May 19, 2024

ధ్యానం-యోగం

రచన: సుశీల

ప్రతి సంవత్సరం జూన్ 2వ తేదీ అంతర్జాతీయ దినోత్సవానికి 2015 నుండి ప్రభుత్వం శ్రీకారం చుట్టడం జరిగింది కాబట్టి పామరునినుండి పండితుడు వరకు ఇది అత్యవసరమని గుర్తించి, ఆచరించడం జరుగుతున్నది. దీనివలన ఫలితాలను పొందుచున్నారు.
యోగా అంటే “కలయిక”. వియోగంలో ధు:ఖం ఉంటుంది. యోగంలో ఆనందం ఉంటుంది. తనతో తాను కలవడమే యోగా. ప్రాపంచిక జీవితంలో డబ్బు అనేది కనీస అవసరాలకు చాలా ముఖ్యమైనది. అదే విధంగా ఆధ్యాత్మిక మార్గంలో ప్రాణశక్తి లేక విశ్వశక్తి కూడా అంతే ప్రధానమైనది. సృష్టి అంతా ఆవరించుకొని ఉన్నటువంటి ఈ విశ్వమయ ప్రాణశక్తే మన దేహంలో దేహమయ ప్రాణశక్తిగా ఉంటుంది. ధ్యానం ద్వారా మాత్రమే మనం ఈ విశ్వమయ ప్రాణశక్తిని మరింత ఎక్కువగా, దేహంలోకి తీసుకుంటాం. దానికి ఉంపయోగపడే ఒక అత్యున్నతమైనటువంటి ప్రక్రియే ఈ ధ్యానం.
ఈ ధ్యానాన్ని ఎప్పుడైనా, ఎక్జడైనా ఏ సమయంలోనైనా చేసుకోవచ్చు. ఆఖరుకి తీవ్ర అనారోగ్యంతో ఉన్న సమయమందైనా పడుకొని చెయ్యవచ్చు. నడుం నొప్పి, మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు కూడా కూర్చొని చెయ్యవచ్చు. ఎవరి వయస్సు ఎంతుంటుందో అన్ని నిముషాలు తప్పనిసరిగా రోజుకి రెండుసార్లు ధ్యానం చెయ్యాలి. ఈ విధంగా ప్రతిరోజూ నియమబద్ధంగా ధ్యాన అభ్యాసాన్ని అలవాటు చేసుకోవాలి. ఆత్మ స్థాయీలను బట్టి యోగా పద్ధతులున్నాయి. వీటిలో ముఖ్యమైనవి 1. శరీరంతో చేసేది -హట యోగం. 2. సంగీతంతో చేసేది – నాద యోగం. 3. శ్వాసతో చేసేది – ధ్యాన యోగం లేదా రాజయోగం. ఈ రాజయోగం ఏనుగు కుంభస్థలం లాంటిది. ఉత్కృష్టమైనది. చివరిగా అన్ని యోగాలు ఈ రాజయోగంలో కలవవలసిందే.
ముఖ్యాంశాలు: ధ్యానానికి మంచి రోజులు, ముహుర్తాలు, మైలలు వర్తించవు. ఏ పరిస్తితిలోనైనా చేయగలిగిందే ధ్యానం. ఇది పూర్తిగా శాస్త్రీయ ప్రక్రియ. ధ్యానం చ్గేస్తున్నంతసేపూ ఆలోచనలు విపరీతంగా కలిగినప్పటికీ కూడా ధ్యానం ఆపి వేయకూడదు. అయిదు ఇంద్రియాలనూ మూసి ఉంచి శ్వాసమీదే ధ్యానం ఉంచడంలో ఎంతో శక్తిని కూడబెట్టగలం. కొద్ది సెకన్ల పాటు వచ్చి వెళ్ళే ఆలోచనా రహిత స్థితి ఎంతో ముఖ్యమైనది. వ్యక్తిగత ధ్యానం చేస్తూనే అవకాశం ఉన్నపుడు ఒకటీ పిరమిడ్ ధ్యానం, రెండూ పౌర్ణమి ధ్యానం, మూడు సామూహిక ధ్యానం లలో పాల్గొంటూవుండాలి. ఈ యోగా ప్రక్రియల వల్ల నాడీమండలం శుద్ధవుతుంది. సమస్యలకు సులభంగా పరిష్కారాలు దొరుకుతాయి. ధ్యానయోగం ద్వారా విశ్వగురువులను సందర్శించొచ్చు. ప్రతిరోజూ శరీరం శుభ్రంగా ఉంచుఓవడానికి స్నానం ఎలా చేస్తామో అలగే ఆత్మ పరిశుద్ధికి ధ్యానం తప్పనిసరి. రచన: సుశీల

లాభాలు: ధ్యానం వల్ల, శారీరక ఆరోగ్యం, జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, బుద్ధి కుశలత, ఆత్మస్థైర్యం, ఆత్మజ్ఞానం కలుగుతుంది, పెరుగుతుంది. అలాగే మనోనేత్రం ఉత్తేజితమవుతుంది. సూక్ష్మ శరీరయానం చేయగలుగుతాం. మనం తినే అహారం ద్వారా వచ్చే శక్తికన్నా ధ్యానం చెయ్యడం ద్వారా వచ్చే శక్తి అధికం, సంపూర్ణ ఆరోగ్యం. ఈ ధ్యానం వలన అంతరాత్మ ప్రభోదం వినగలుగుతాం. మనలోని చైతన్యం విస్తృతమవుతుంది. అంతర్గతంగా దాగి ఉన్న కళాత్మక శక్తి గుర్తింపుకొస్తుంది మనలో మనకే. బ్రహ్మర్షి పత్రీజీ వ్రాసిన తులసీదళం-2 అనే పుస్తకం ప్రకారంగా ధ్యానం అన్నది మానవుని పునీతుడ్ని చేసే ఒక్కగానొక్క ప్రక్రియ. మానవుని దివ్యమనస్కుడిగా రూపొందిస్తుంది. జ్ఞానమే ఆనందం, చందం, జయం, విజయం. జ్ఞానం వలనే జీవుడు దేవుడవుతాడు, ఈ దేహం జ్ఞానం కోసమే.

2 thoughts on “ధ్యానం-యోగం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *