రచన: డా|| బాలాజీ దీక్షితులు పి.వి
వెన్నెల హంస వాలిందా
పున్నమి రేయిన గుండె కొలనుపై
కన్నె కలువ విచ్చిందా
వలపుల సడి వేణువు స్వరమై
పరిమళ సుమం తాకిందా
మయ మరపుల మధుాలికై
కలల మాటు కంత్రిక
ఓ సొగసుల మాంత్రిక
నీవు మాయ చేసి మాయమయ్యే
దేవతవు కాని
అక్కరతీర్చే ఆర్తివో
కనురెప్పల కాంచే శక్తివో
అనే నమ్మకం ఎప్పుడో సడలింది…