March 29, 2024

మౌనం.

రచన: విజయలక్ష్మి కొఠారి.

 

రూపు లేని నేను,

రూపము లోని స్పందనను.

అనుభవములోని అనుభూతిని, అవగాహా న్ని, అతీతాన్ని,

జీవములోని చలనాన్ని. భాష లేని నేను భాష లోని భావాన్ని.

సహనాన్ని నేను,  మౌనాన్ని నేను.

నీ చుట్టూ నేనే, నీ తోడు నేనే.

నీ రూపు నిశ్చలమై, చివరకు చేరేను …

నాలో మౌనాన్ని నేను.

మౌనాన్ని నేను, నీలో, నీ చుట్టూ మౌనాన్ని నేను,

మౌనం ఎంత మనోహరమో, మౌనం ఎంత కర్కశమో,

స్పందించే హృదికి…

అన్నింటి కలయిక మౌనమే.

 

2 thoughts on “మౌనం.

  1. భాషలేని నేను
    భాషలోని భావాన్ని

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *