April 24, 2024

కంభంపాటి కథలు – ఏనుగా ? గేదా ? పేనా ?

రచన: కంభంపాటి రవీంద్ర “ఇదిగో ..బయటికెళ్తున్నా .. తలుపేసుకో” “ఎక్కడికేమిటి ?” “బయటకి వెళ్ళేటప్పుడు ఎక్కడికీ అని అడగొద్దని ఎన్ని సార్లు చెప్పాలి ?” “అడిగినన్ని సార్లూ చెప్పాలి” “అంటే ..ఓసారి చెబితే బుర్రకెక్కదన్నమాట” “బుర్రకెక్కేలా చెబితే ఎందుకెక్కదూ ?” “అయితే, నేను బుర్రకెక్కేలా చెప్పనన్నమాట ! !” “మన బలహీనతలనెరడగం కూడా ఓ రకమైన బలం” “ బలహీనతేమిటీ ?” “ఇప్పుడే చెప్పేరు కదా !” “నేను నా బలహీనత చెప్పేనా ??” “అంటే .. […]

పేదోడి ప్రశ్న

రచన: జెట్టబోయిన శ్రీకాంత్ ఆకలి అంటే ఏమిటో నూకలి గింజనడుగుతా..! ఈ ఆకలి ఎందుకవుతదో, మాడుతున్న కడుపునడుగుతా..! గూడు అంటే ఏమిటో గుడిసెలున్న అవ్వనడుగుతా…! తోడు అంటే ఏమిటో నా మనసులోని మనిషినడుగుతా…! కష్టము అంటే ఏమిటో నా ఒంటిమీది చెమటనడుగుతా…! దురదృష్టము అంటే ఏమిటో నా కంటిలోని నీటినడుగుతా…! కోపము అంటే ఏమిటో నాకు జీతమిచ్చే దొరని అడుగుతా…! శాపము అంటే ఏమిటో నా నుదిటనున్న రాతనడుగుతా…! కరువు అంటే ఏమిటో ఎండిపోయిన చెరువునడుగుతా…! పరువు […]

ధృతి – 2

రచన: -మణి గోవిందరాజుల “నాన్నా కాలేజీకి వెళ్ళొస్తాను” చెప్తూ గుమ్మం దాటబోతున్న కూతురి మీద గయ్యిమని లేచింది పూర్ణ. “చచ్చిందాకా చాకిరీ నాతో చేయించుకుని కాలేజికి వెళ్ళేప్పుడు తల్లికి చెప్పాలన్న జ్ఞానం కూడా లేదు.పెంపకం సరిగ్గా లేకపోతే ఇలానే ఏడుస్తుంది… అసలు గారాబం చేసి చెడగొడుతున్న తండ్రిననాలి” “ఇదిగో! పెంపకం సరిగా లేదని మా అమ్మనను పడతాను. అంతే కానీ, మా నాన్న నంటే ఊర్కునేది లేదు” తనూ అంతే గయ్యిమని లేచింది ధృతి. “తల్లీ కూతుళ్ళిద్దరూ […]

‘అపరాధిని’

  రచన:  కోసూరి ఉమాభారతి   ప్రియమైన అమ్మాపిన్నికి, పిన్నీ, నేను అపరాధినే. నీతో మాట్లాడి నాలుగేళ్ళవుతుంది. నువ్వు తప్ప నాకింకెవరున్నారు చెప్పు. అందుకే, ఇన్నాళ్ళకి నా మనసు విప్పి .. నా నుండి కొన్ని సంజాయిషీలు, నా ప్రశ్నలకి నేనే ఇచ్చుకున్న కొన్ని సమాధానాలు నీ ముందుంచుతున్నాను. ప్రత్యక్ష్యంగా, పరోక్షంగా కూడా నా జీవితంలో జరిగిన ముఖ్యమైన సంఘటనలకి నీవే కారణమయ్యావు పిన్నీ. ఐదేళ్ళప్పుడు అమ్మ బంధం, అమ్మతో అనుబంధం నన్ను వీడిపోయినప్పుడు, నాన్న నన్ను […]

ఒక నిద్ర .. ఒక మెలకువ

రచన: రామా చంద్రమౌళి శీతాకాలపు రాత్రి.. గాఢ నిద్ర. కలలు నక్షత్రాలుగా.. ఆకాశం ఒక సముద్రంగా.. పర్వతాలు ద్రవిస్తున్న హిమనగాలుగా శోభిస్తున్న స్వప్నంలో తేలిపోతున్న వేళ, తలుపులపై ఎవరో మెల్లగా తడ్తున్న చప్పుడు. పూలు రాలుతున్న సవ్వడా, వెన్నెల కురుస్తున్న మృధు ధ్వనా.. గాలి ప్రకృతితో సంభాషిస్తున్న నిశ్శబ్ద ప్రస్తారమా.? అసహనంగా.. చికాగ్గా లేచి.. తలుపులు తెరిచి చూస్తే., కళ్ళు మిరిమిట్లు గొలిపే సాంద్ర స్వర్ణకాంతితో చంద్రుడు.. ధగ ధగా మెరిసిపోతూ.. గుండ్రగా.. పరిపూర్ణంగా.. తామ్ర చంద్రుడు. […]

చంద్రోదయం – 17

రచన: మన్నెం శారద ఆ రోజు శేఖర్‌కి కొడుకు పుట్టేడని, అంతేగాకుండా ఇసక తోటలో హౌసింగ్ బోర్డు ఫ్లాటొకటి అతనికి ఎలాటయిందని తెలియగానే ఎంతగానో సంతోషించేడు సారధి. పదిహేను రోజుల్లో గృహప్రవేశం పెట్టుకున్నాడు. ఆ చేతులతోనే బాబుకి బారసాల కూడా చెయ్యాలనుకున్నాం. కాబట్టి అందరూ రావల్సిందని, అదీ నెలరోజులకి తక్కువ కాకూడదని ఆజ్ఞాపిస్తున్నట్లుగా ఉత్తరం రాసేడు శేఖర్. ఆ ఉత్తరం చూసిన దగ్గరనుంచి సావిత్రమ్మ పోరు ఎక్కువయింది. “సెలవు సంగతి చూడరా. అందరం వెళదాం. సునందని చూసి […]

తామసి – 9

రచన: మాలతి దేచిరాజు కుక్కట్ పల్లి భ్రమరాంబ థియేటర్ చుట్టుపక్కల ప్రాంతం… ఒక టీ స్టాల్ దగ్గర బైక్ పార్క్ చేసి, ఏరియా అంతా ఒక చూపు చూసాడు గౌతమ్. షీబా చెప్పిన రెండే రెండు ఆనవాళ్ళు… ఒకటి: “రేయ్ మన ఏరియాకి పోదాం..రా…” “వద్దొద్దు… మన ఏరియాలో డ్రైనేజ్ పైప్ లైన్ వర్క్ జరుగుతుంది… ఏదైనా తేడా వస్తే దొరికిపోతాం… ఇక్కడే త్వరగా కానిచ్చేద్దాం.” అని వాళ్ళు మాట్లాడుకున్న మాటలు. రెండు: నలుగురిలో ఒకడికి… ఎడమ […]

అమ్మమ్మ – 27

రచన: గిరిజ పీసపాటి మర్నాడు ఉదయాన్నే తన అటుకుల గొలుసును కూడా జండగంటలు తాకట్టు పెట్టిన చోటే తాకట్టు పెట్టి, డబ్బు తెచ్చింది నాగ. సాయంత్రం వసంతను తీసుకుని ముందుగా లేబ్ కి వెళ్ళి, డబ్బు కట్టి, రిపోర్ట్స్ తీసుకుని, వాటితో డాక్టర్ గారిని కలిసింది. ఆయన రిపోర్ట్స్ చూసి “నేను ఊహించిందే నిజమయ్యింది. ప్రస్తుతం వసంత పరిస్థితి సీరియస్ గా ఉన్న మాట నిజమే కానీ, ఇది జలోదరం కాదమ్మా!” “వసంతకు షుగర్ వ్యాధి వచ్చింది. […]

నాన్న చెప్పిన మాట!

రచన: రమా శాండిల్య “ఒరేయ్ భీమా!” పెద్ద గావుకేక వంటింట్లోంచి వినిపించేసరికి పెరట్లో పశువుల కొట్టంలో పనిచేసుకుంటున్న భీముడు “అమ్మా…వత్తన్నా,” అంటూ పరుగున ఒక్క ఉదుటున వచ్చాడు. “భీమా, వీధిలో లారీలేవో వచ్చినట్లున్నాయి చూడు, దొరగారు ధాన్యం పంపిస్తానన్నారు, కొట్టుగదిలో వేయించాలి… ఆ బస్తాలన్నీ చూసి సింగడ్ని కూడా పిలుచుకో…. ఇద్దరూ కలిసి సాయం పట్టి కొట్టుగదిలో పడేయండి. తెల్లారితే పిల్లలందరూ వస్తారు, అన్ని ఊళ్లనుంచీ.” అంటూ, భీముడికి పని పురమాయించి, మళ్లీ తన పనిలో తాను […]

నేస్తానికి నజరానా

రచన: ఎం.ఆర్.వి.సత్యనారాయణ మూర్తి వసిష్ట గోదావరి వంతెన మీద నుండి కారు నెమ్మదిగా వెళ్తోంది. కార్తీకమాసం ఉదయం సమయం. గోదావరి మీద మంచు తెరలు ఇంకా విడి వడలేదు. గోదావరిలో నీళ్ళు తక్కువగా ఉన్నాయి. ఇరవై నిముషాలలో రావులపాలెం చేరుకున్నాము. “కారు పక్కకు ఆపి పువ్వులు తీసుకోండి” రాజేశ్వరి అభ్యర్ధన. కళా వెంకటరావు విగ్రహం పక్కగా డ్రైవర్ కారు ఆపాడు. చామంతుల దండ, విడి పూలు తీసుకోమని డ్రైవర్ కి వంద రూపాయలు ఇచ్చాను. కొద్ది సేపటికి […]