October 16, 2021

అనుక్షణం నీతోనే…

రచన: చంద్రశేఖర్

నిన్ను చూసిన క్షణం
నన్ను మరిచిన క్షణం

నిన్ను తలచిన క్షణం
మది పులకించిన క్షణం

నిన్ను కలిసిన క్షణం
ఊహకందని క్షణం

నీతో మాట్లాడిన క్షణం
అనుభూతి పొందిన క్షణం

నీ స్నేహం పొందిన క్షణం
అదృష్టం పొందిన క్షణం

నీ ప్రేమ పొందిన క్షణం
అన్నీ పొందిన క్షణం

నిన్ను వీడిన క్షణం
ఊపిరి వదిలిన క్షణం

2 thoughts on “అనుక్షణం నీతోనే…

Leave a Reply to Gsr Cancel reply

Your email address will not be published. Required fields are marked *