April 19, 2024

శునకం నవ్వింది

రచన: రాజ్యలక్ష్మి బి

చైతన్యకు కుక్కలంటే పరమ అసహ్యం చదువుకునే రోజుల్లో రాత్రిపూట అందమైన కలలు కంటూ నిద్ర పోయే సయం లో ఒక కుక్క వల్ల తనకు జరిగిన అవమానం తల్చుకుంటే యిప్పటికీ కంపరమేస్తుంది చైతన్యకు ఒకరాత్రి ఒక కుక్క సరిగ్గా చైతన్య దుప్పటి కప్పుకుని తన కాలేజీలోని అందమైన వసంతను తల్చుకుంటూ తియ్యటి కల కంటున్నాడు అది అర్ధరాత్రి సమయం ఒక కుక్క మొరిగి మొరిగి అరిచీ అరిచీ చివరకు తనను యెవరూ పట్టించుకోవడం లేదని కుయ్యో కుయ్యో అంటూ ఆరోహణ అవరోహణలో రాగాలు మొదలు పెట్టింది దాని అరుపులకు సానుభూతిగా మరో నాలుగు కుక్కలు శోకాలు మొదలు పెట్టాయి వాటి శోకాలతో నిశ్శబ్దం గా వున్న వీధంతా ఒక పెద్ద రణరంగం అయ్యింది
చైతన్య తియ్యని నిద్రకూడా చెడింది వాటిగోల మహా తారా స్థాయిలో వినపడుతున్నది అంతే చైతన్య మహా కోపం తో కర్ర తీసుకుని వీధిలోకి పరుగెత్తాడు కానీ అప్పటికే ఆ కుక్కలన్నీ రాజవీధిలో సైనిక కవాతులాగా తోకలాడించుకుంటూ వెళ్లిపోతున్నాయి ఒక్క కుక్కా లేదు ప్రతీరోజు యిదేపని చైతన్య కు విసుగెత్తి కుక్కల బాధ భరించలేక మరో వీధిలోకి మకాం మార్చాడు
అక్కడ రాత్రిపూట కుక్కల అరుపులూ రొదలు వినిపించేవి కావు తన నిద్రా కలలూ హాయిగా జరిగిపోతూ కరిగిపోతూ వుండేవి ఒకరోజు చల్లనిగాలికి ప్రశాంతం గా హాయిగా నిద్ర పట్టింది పొద్దున్నే వాతావరణం చూసి రాత్రి వాన పడిందని గ్రహించాడు అక్కడ రాత్రిపూట నిశ్శబ్దంగా ప్రశాంతంగా గడవడంతో చైతన్యకు మహా ఆనందంగా వుంది
డిగ్రీ పరీక్షలు దగ్గర పడటంతో రాత్రుళ్లు మేలుకుని చదవడం మొదలుపెట్టాడు కానీ చదవడం మొదలుపెట్టగానే నిద్రమత్తు ముంచుకొచ్చేది కుక్కలు అరిస్తే బాగుండు అనుకునేవాడు మళ్ళి ‘ఆమ్మో ‘ అనుకునేవాడు కష్టపడి నిద్రాపుకుని చదివాడు పరీక్షలు ముగిసాయి సరిగా నిద్ర లేదు కదా ఆ రాత్రి హాయిగా నిద్ర పోవాలనుకున్నాడు వంద ఫిరంగులు పిలినట్టు పెద్ద పెద్ద శబ్దాలు వినిపించాయి ఉలిక్కిపడి నిద్ర లేచాడు చైతన్య కొత్తగా వచ్చాయో లేక తన మీద కోపంగా వున్నాయో కానీ కుక్కల అరుపులు మొరగడం వినపడ్డాయి చెవులు గట్టిగా మూసుకుని పడుకున్నాడు ఓపిక పట్టాడు కుక్కలు బిగ్గరగా భయంకరంగా మొరుగుతున్నాయి కోపంగా నిద్ర కళ్లు నిలుపుకుంటూ దుడ్డుకర్ర పట్టుకుని బయల్దేరాడు
వీధిచివర చెత్తకుండీ దగ్గర సుమారు పదికుక్కలు భీకరంగా మొరుగుతూ తిరుగుతున్నాయి చతన్య గురిచూసి కర్ర కుక్కలమీద విసిరాడు కర్ర గురితప్పి చెత్తకుండీకి కొట్టుకుని పెద్దశబ్దం వచ్చింది కుక్కలు పారిపోయాయి అంతలో శబ్దానికి డాబాలమీద పడుకున్నవాళ్ల్లు లేచి “దొంగా ;;;;; దొంగా ;;;దొంగా “అంటూ అరిచారు అందరూ లైట్లు వేశారు
చైతన్యకు చెమటలు పట్టి కాళ్లు వణుకుతున్నాయి ఒకసారి తన ఆకారం చూసుకున్నాడు గళ్ళలుంగీ చారల షర్టు నిజంగానే యెవరైనా చూస్తే దొంగే అనుకునేలా వున్నాడు వెంటనే శక్తికొద్దీ పిక్కబలం తో తిరోగమించాడు అదిచూసి కుక్కలు అతని వెంటబడ్డాయి కొంతమంది కేకలేస్తూ అతని వెనకాల పరుగెత్తుతున్నారు అందరినీ తప్పించుకుంటూ పరుగు పరుగున గదికి చేరి లోపలికి గొళ్ళెం వేసుకున్నాడు లుంగీ షర్టూ మార్చుకుని పడుకున్నాడు వణుకు తగ్గలేదు
కుక్కలు మొరుగుతున్నాయి జనం కూడా గుమ్మం ముందు చేరి తలుపులు బాదుతున్నారు ఇంటి యజమాని బయటకు వచ్చాడు కుక్కల అరుపులూ జనాల చేతిలో కర్రలూ వింతగా చూసాడు
“ఏమైంది …ఏమైంది “ప్రశ్నించాడు యింటి యజమాని
“ఒక దొంగ పారిపోతూ యీ గదిలో దూరాడు “అంటూ ఒకతను చైతన్య గది వైపు చెయ్యి చూపించాడు
” చైతన్యా — చైతన్యా ‘అంటూ యింటి యజమాని తలుపు కొట్టాడు ఆవులిస్తున్నట్టుగా నటిస్తూ కళ్లు తుడుచుకుంటూ తలుపు తీసాడు చైతన్య ఎదురుగా గుంపు కర్రలతో కుక్కలు అరుపులతో కనపడ్డారు
“”నీ గదిలోకి యెవరైనా చొరబడ్డారా చైతన్యా “ప్రశ్నించాడు యజమాని
” లోపలికి గొళ్ళెం వుంటే యెవరొస్తారండీ ? ఏం జరిగింది “అమాయకంగా యెదురు ప్రశ్నించాడు చైతన్య
” విన్నారుగా !యిక్కడికి దొంగా రాలేదు గింగా రాలేదు సరేలే చైతన్యా పడుకో ” అన్నాడు యజమాని వాళ్లు వెళ్లిపోయారు కుక్కలూ వెళ్లిపోయాయి ‘హమ్మయ్య ‘ పెద్దగండం గడిచింది అనుకున్నాడు చైతన్య
ఆ సంఘటన జరిగినప్పటినించీ చైతన్యకు కుక్కలను చూస్తే కోపం కంపరం వగైరా వగైరాలు పుట్టుకొస్తాయి

———————–

చైతన్య బేంక్ వుద్యోగలో చేరాడు వనజ తో పెళ్లి జరిగింది చిన్న పట్టణం లో ఒక చిన్న ముచ్చటైన యిల్లు అద్దెకు తీసుకున్నాడు ఇంటిముందు పూలమొక్కలు పెట్టుకున్నారు ఒకవెదురు గేటు పెట్టాడు కుక్కలు రాకుండా వనజ సరదా మనిషి జాలి దయ మంచితనం కలబోసిన వ్యక్తిత్వం విధి చివర చెత్తకుండీ చూసి చైతన్యకు భయం వేసింది గతం గుర్తుకొచ్చింది ఆ యిల్లు వనజకు బాగా నచ్చింది పైగా అన్ని వసతులూ వున్నాయి చైతన్య తన కుక్కల అనుభవం వనజకు చెప్పలేదు.
ఒకరోజు వనజ యెంగిలాకులు చెత్తకుండీలో వెయ్యడానికి వెళ్లింది అక్కడ ఒక కుక్క ఆ యెంగిలాకులు నాకడం మొదలుపెట్టింది జాలిగుండె కదా వనజకు !వెంటనే పెరుగన్నం తెచ్చి కుక్కకు పెట్టింది కుక్క గౌరవం గా వనజను చూస్తూ పెరుగన్నం తినేసింది వనజకు కుక్కలంటే అభిమానం లేదుకానీ ఆ కుక్కమీద యెందుకో సానుభూతి యేర్పడింది రోజు గేటు దగ్గర పెరుగన్నం పెట్టడం మొదలుపెట్టింది కుక్కకూడా నెమ్మదిగా గేటు ముందుకు మకాం మార్చింది చెత్తకుండీ దగ్గరకు వెళ్లడం లేదు చైతన్య యిదంతా పెద్దగా గమనించలేదు
ఒక ఆదివారం పొద్దున ఇడ్లిలు తిని తీరిగ్గా మొక్కల దగ్గర వాలు కుర్చీలో కూర్చున్నాడు చైతన్య అప్పుడు గేటు దగ్గర కుక్క కనపడింది ఉలిక్కిపడ్డాడు కంపరం కలిగింది గతం కళ్ళముందు గిరగిరా తిరిగింది ఇంకా తనమీద ప్రతీకారమా అనుకున్నాడు.
“వనజా ;;;;;;;; కుక్క యిక్కడ వుందేమిటీ “అడిగాడు భార్యను
“పాపం ;;;;; మంచి కుక్కండి —గేటు దగ్గరే వుంది కదండీ పైగా యిది వుంటే రాత్రిళ్లు మనకు కూడా కాపలా కదండీ “అంటూ వనజ కుక్కను సపోర్ట్ చేసింది
“వనజా —- కుక్కలంటే నాకు గిట్టదు ” అన్నాడు చైతన్య వనజ నవ్వేసింది ఆ నవ్వుకు చైతన్య మళ్లీ ఏం మాట్లాడలేకపోయాడు

——————————

ఒకరోజు వనజ వంట చేస్తుండగా కుక్కల అరుపులు వినిపించాయి తన కుక్కను వేరే కుక్కలు కరుస్తున్నాయేమోనని గబగబా పరుగెత్తింది అన్ని కుక్కలూ యీ కుక్కను చుట్టేసి యుద్ధం చేస్తున్నాయి ఈ కుక్క అభిమన్యుడిలాగా ఒంటరి పోరాటం ధైర్యంగా చేస్తున్నది గొంతు పెంచి మరీ మొరుగుతున్నది వనజ తన కుక్కను కాపాడుకోవడానికి వేరే కుక్కల మీద రాళ్లు విసిరింది కానీ గురితప్పి రాళ్లు తన కుక్కకే తగిలాయి “కుయ్యో “అంటూ వనజను చూసింది మిగిలిన కుక్కలు పారిపోయాయి వనజ బాధ పడింది వెంటనే పెరుగన్నం తెచ్చి పెట్టింది అమాయకపు కుక్క “తనకా —కాదా ;;” అన్నట్టు వనజ వైపు చూసింది
” రామ్మా తిను “అంటూ లాలనగా పిలిచింది వనజ కానీ అది ఆత్రంగా రాలేదు మెల్లగా హుందాగా వచ్చి మరోసారి వనజను చూసింది
“తిను” అన్నది వనజ అప్పుడు వంచిన తల యెత్తకుండా గబగబా తినేసి గేటు దగ్గరకెళ్లి పడుకుంది
మధ్యాహ్నం భోజనం అయ్యాక వనజ “హీరో “అంటూ కుక్కను పిల్చింది
“ఇదేమిటి ?— తనకు కొత్తపేరున్నట్టు “తల పక్కకు తిప్పి వెనక్కి తిరక్కుండానే చూసింది కుక్క
” బయటకు చెత్తకుండీ దగ్గరకు వెళ్లకు కుక్కలు కరుస్తాయి గేటు దగ్గరే వుండు అర్ధమయ్యిందా “అంటూ వనజ దాన్ని వీపుమీద నిమిరింది “సరే ‘అన్నట్టుగా చూసి వనజ దగ్గర నిలబడి తల పైకెత్తింది కుక్కకళ్లల్లో కన్నీటిచుక్కలు వనజకు జాలీ దయ ఆప్యాయత ! క్రమంగా మమకారం పెరుగుతున్నది.
ఈ జరిగినదంతా ఆ రాత్రే చైతన్య తో పూసగుచ్చినట్టు చెప్పింది దానికి పెట్టిన ముద్దుపేరు ‘హీరో ‘కూడా చెప్పింది చైతన్య యిప్పుడు ఒకవిధం గా యింటికీ వనజకు కుక్క రక్షణగా వుంటుందని తృప్తి పడ్డాడు

————————–

క్రమంగా హీరో తన స్థానాన్ని గేటు దగ్గర్నించి ముందు హాల్లో ఒకమూలకు మార్చుకుంది నెమ్మదిగా వనజ యెక్కడుంటే అక్క్కడ తిరుగుతున్నది కానీ ఒక్క హల్లోనే ఆలా తిరుగుతుంది వేరే గదుల్లోకి వనజ వున్నా వెళ్లదు ఒకరోజు చైతన్య “హీరో “అని పిల్చాడు ఠక్కున అది తనల్నే అని అర్ధం అయినట్టుగా చెవులు నిటారుగా పక్కకు వంచి చూసింది.
“వనజా నువ్వెప్పుడయినా మన హీరోని నిశితం గా చూసావా “అన్నాడు చైతన్య
వనజ కంగారుగా “మన హీరోకి గజ్జి పుళ్లు లేవండీ “అన్నది
“అదికాదు యీ కుక్క తోకాడించడం చూసావా “అడిగాడు చైతన్య
” అదేం పిచ్చి ప్రశ్న ? యే కుక్కయినా తోకాడిస్తుందిగా ! వింతగా అడుగుతారేమిటీ ” విచిత్రం గా చైతన్యను చూసింది వనజ.
” వనజా పరీక్షగా చూడు మన హీరో తోకాడించడం లేదు “అన్నాడు చైతన్య వనజ పదినిమిషాలు సీరియస్ గా కుక్క తోకనే కన్నార్పకుండా చూసింది నిజమే కుక్క తోకాడించడం లేదు వనజకు చైతన్యకు వింతగా వుంది

చైతన్య తన స్నేహితుడు వేణుతో కుక్క తోక ఆడించడం లేదని చెప్పాడు వేణుకి కుక్కల గురించి కొంత తెలుసు
వేణు “అలాంటి కుక్కలను యింట్లో వుంచుకోకూడదు అరిష్టం వెంటనే దూరం గా వదిలెయ్యాలి ‘ అన్నాడు
అసలే గతంలో చేదు అనుభవం వుందిగా !అందుకే చైతన్య యీసారి వేణు ఆ మాట చెప్పగానే నమ్మాడు భయపడ్డాడు వనజకు చెప్పాడు వనజ అయోమయం గా భర్తను చూసింది
“పాపం తోకాడించకపోవడం దాని తప్పా ?” దినం గా ప్రశ్నించింది వనజ
“నీకర్ధం కావడం లేదు !!! అది యిక్కడుంటే మనకు అనర్ధం “కోపం గా అరిచాడు చైతన్య వనజ మౌనంగా వుండిపోయింది మర్నాటినించీ హీరోని తప్పించుకుని తిరుగుతున్నది కానీ మనసులో బాధ పడుతున్నది కుక్క మాత్రం వనజ చుట్టూనే తిరుగుతున్నది వనజకు దుఃఖం ముంచుకొస్తున్నది ఇంటిపనీ వంటపనీ మీద ధ్యాస తగ్గుతున్నది అదిచూసి చైతన్యకు వేణు మీద యింకా నమ్మకం పెరిగింది
ఒకరోజు తెల్లవారు ఝామున చైతన్య హీరోకి మత్తుకలిపిన రొట్టె పెట్టాడు అది నిద్రపోగానే తలుపులు బయటకు తాళం వేసి ఆటోలో దూరం గా వదిలివచ్చాడు
వనజ కుక్క లేదని గ్రహించింది అర్ధం చేసుకుంది చైతన్య బాధ పడతాడని అడగలేదు వనజకు అన్నం సయించడం లేదు నిద్ర సరిగ్గా పట్టడంలేదు ప్రతిక్షణం హీరో గుర్తుకొస్తున్నది దాని జాలి చూపులు గుర్తుకొస్తున్నాయి చెత్తకుండీ దగ్గర దాని బ్రతుకేదో బతుకున్నదాన్ని తనే పెరుగన్నం పెట్టి దగ్గర తీసింది అదికూడా పెరుగన్నం రొట్టెలు తప్ప ఇక ఏం తినకుండా అలవాటు పడింది యెక్కడుందో ఎలా వుందో ! వనజకు దిగులు పట్టుకుంది కానీ చైతన్య బాధ పడతాడని పైకి మాత్రం మాములుగా వుంటున్నది చైతన్య కు కుక్క గుర్తుకొస్తున్నది కానీ వేణు చెప్పింది గుర్తుకొచ్చి తను మంచి పనే చేసానని సర్దిచెప్పుకున్నాడు వనజ దగ్గర కుక్క గురించి ప్రస్తావన రాకుండా జాగ్రత్త పడుతున్నాడు
వనజ రోజూ యెదురు చూస్తూనే వుంది నెలరోజుల తర్వాత వనజ పగలు పనయ్యిన తర్వాత కూరల మార్కెట్ కు వెళ్లింది కూరలు కొంటుంటే ఒక వైపునుంచి సన్నని మూలుగు యేదో పరిచమైన గొంతులా వనజకు వినిపించింది ఎందుకో యదాలాపంగా తలతిప్పి చూసింది వనజ అంతే కళ్లు చెరువులయ్యాయి హీరో చెట్టుకింద మూలుగుతూ తన్నే చూస్తున్నది గబగబా దగ్గరకు వెళ్లింది ‘హీరో ‘ అని పిలిచింది దానికి లేచే ఓపిక కూడా లేదు “నన్ను మర్చిపోయావా ‘అన్నట్టు జాలిగా చూసింది. వనజ దాని వీపునిమిరి దగ్గర తీసింది ‘ ఇక నిన్ను విడిచిపెట్టనమ్మా ‘ అంటూ యింటికి తెచ్చేసింది యింటికి రాగానే దానికి పెరుగన్నం పెట్టింది పాపం హీరో నడిచే ఓపిక కూడా లేదు చైతన్య కుక్కను దాని పరిస్థితి చూసి తప్పుచేసిన వాడిలాగా సిగ్గుపడ్డాడు
వనజ చైతన్యను దణ్ణం పెడుతూ కన్నీళ్లతో చూసింది చైతన్య కరిగిపోయాడు ఇద్దరూ కూడబలుక్కుని ఒక్కసారిగా ‘ హీరో ‘ అంటూ లాలనగా పిలిచారు అంతే హీరోకి శక్తి యెలా వచ్చిందో కానీ వాళ్లిద్దరి దగ్గరికీ వచ్చి నించుంది.
“వనజా వనజా చూడు చూడు తోకాడిస్తున్నది ” అన్నాడు చైతన్య సంతోషంగా వనజ ఆనందంగా నవ్వింది
హీరో యిప్పుడు చైతన్యకు వనజకు మురిపాల శునకరాజం.

2 thoughts on “శునకం నవ్వింది

  1. చాలా బాగుంది అండి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *