February 21, 2024

ఓ చల్లగాలి

రచన: డా|| బాలాజీ దీక్షితులు పి.వి నీవు ఊపిరివి సుగంధాల పరిమళం పంచాలన్నా మట్టిమధువుతో గుండె తట్టి లేపాలన్నా ఆనందాల రెక్కలు కట్టి ఎగిరించాలన్నా నీకు సాధ్యమే నీవు క్షణంలో వాలతావు ఎక్కడైనా నీవు సెకనులో దూరతావు ఏగుండెలోనైనా నీకు పరిచయంలేని మంచి మనసంటూ లేదు ఈ అవనిపై నీకు తెలియని గొప్ప హృదయమంటూ లేదు ఈ భువిపై నీవు చూడని అందమంటూ లేదు ఈ నేలపై అందుకే నిను ప్రార్దిస్తున్నా ఓ నా చల్లగాలి నాకు […]

అనుక్షణం నీతోనే…

రచన: చంద్రశేఖర్ నిన్ను చూసిన క్షణం నన్ను మరిచిన క్షణం నిన్ను తలచిన క్షణం మది పులకించిన క్షణం నిన్ను కలిసిన క్షణం ఊహకందని క్షణం నీతో మాట్లాడిన క్షణం అనుభూతి పొందిన క్షణం నీ స్నేహం పొందిన క్షణం అదృష్టం పొందిన క్షణం నీ ప్రేమ పొందిన క్షణం అన్నీ పొందిన క్షణం నిన్ను వీడిన క్షణం ఊపిరి వదిలిన క్షణం

ప్రశ్నలు స్వీయశిక్షలే …

రచన:చందలూరి నారాయణరావు ప్రశ్నలు మనసు లోతుగా మారుమ్రోగే అర్ధంకాని అగాధాలే.. అనుభవాలై పెనవేసుకొని మెలిపెట్టే మొనదేలిన వేదనాయుధాలే… ఎన్నాళ్ళుగా మోస్తున్నా కుంగదీస్తున్నా భారం తగ్గని చేదు నిజాలే…. వయసు కరిగిపారే భావసంద్రంతో అలల కలల్లో స్రవించే తీపిబాధలే… మనసు మెరుపులలో తేలియాడే తరుగులేని ఊహాలే తరిగిపోని ఆశలబాకులే. ప్రశ్నలు జీవితమంతా విధించుకొనే పరీక్షలే. స్వీయశిక్షలే. * * *

మాలిక పత్రిక జూన్ 2021 సంచికకు స్వాగతం

Jyothivalaboju Chief Editor and Content Head మండే ఎండలలో చల్లబరిచే మల్లెలు, కాస్త చినుకులు పడినవేళ మత్తెకిస్తాయంటారు పెద్దలు. చల్లని సాయంత్రాలలో చిరుజల్లుల చలిలో సుమనోహరమైన మల్లెల సుగంధాలు మనసును పులకింపజేస్తాయి.. అవునంటారా.. కాదంటారా.. మాలిక పత్రిక జూన్ సంచికలో ఎన్నో విశేషాలున్నాయి. ముఖ్యమైనవి రెండు.  ప్రముఖ రచయిత, కవి రామా చంద్రమౌళిగారి కథల సమాహారం “తాత్పర్యం”.   ఈ ‘ తాత్పర్యం’ కథా సంపుటి మొత్తం 6 కథా‌పురస్కారాలను సాధించింది. ఎందరో పాఠకుల ప్రశంసలను […]

తాత్పర్యం

తెలుగు కథ గత దశాబ్ది కాలంలో పెను మార్పులకు లోనౌతూ తనను తాను పునర్నిర్వచించుకుంటూ, పునర్నిర్మించుకుంటూ వృద్ధిచెందతూ వస్తోంది. వర్ధమాన రచయితల అత్యాధునిక సామాజిక, అంతరిక, సంక్షుభిత సమస్యలతో పాటు లోతైన అవగాహన కలిగి తాత్విక నేపథ్యంతో కూడా భిన్న ఆలోచనలతో, భిన్న విలక్షణ చింతనతో, మనిషి వికాసానికి దోహద పడగల భిన్నమైన కథా వస్తువులను స్వీకరిస్తూ చాలా ధైర్యంగా సరికొత్త మానవీయ పార్శ్వాలను స్పృశిస్తున్నారు. ఈ క్రమంలో తెలుగు కథ బహుముఖీన విస్తరణతో తనదైన సొంత […]

ధృతి – 1

రచన: మణి గోవిందరాజుల వణుకుతున్న చేతులతో చీటీ ని గట్టిగా పట్టుకుంది ధృతి. “హే! ధృతీ ! తొందరగా తెరువు. ఏమి రాసి వుందో మేము చూడాలి…ధృతి…ఓపెన్ ద స్లిప్…ధృతి…ఓపెన్ ద స్లిప్… రిధమిక్ గా అరవసాగారు చుట్టు వున్న స్టూడెంట్స్. మిగతా విద్యార్థులంతా అరుపులతో ఎంకరేజ్ చేయసాగారు. “రాజారాం మోహన్ రాయ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్” లో ఆ రోజు రాగింగ్ జరుగుతున్నది. రాగింగ్ ని ప్రభుత్వం బాన్ చేసినా, సరదాగా చేసుకుంటాము, వయొలెన్స్ లేకుండా […]

తామసి – 8

రచన: మాలతి దేచిరాజు షాక్ నుంచి తేరుకున్నాడు ఇజాక్ కొన్ని సెకన్లకి..అతనికి ఏమీ అర్థం కావట్లేదు అసలు అలా ఎలా చేసాను అనుకున్నాడు. “బావా… నీ మనసులో ఏముందో ఈ పుస్తకం చెబుతోంది…” అంది తను బాధ నిండిన గొంతుతో. “నీ మొహం… ఫస్ట్ ఆ బుక్ ఏమిటో చూడు సరిగ్గా…”అన్నాడు. తను బుక్ చూసింది… మొహంలో చిన్నగా నవ్వు. అది ఏదో కథ అని, నసీమా అంటే అందులో క్యారెక్టర్ అని అప్పుడు అర్థం అయింది […]

చంద్రోదయం 16

రచన: మన్నెం శారద “ఈ రోజు నానీ బర్త్‌డే” స్వాతి ఎటో చూస్తున్నట్టుగా చెప్పింది. వాష్‌వేసిన్ దగ్గర అద్దం ముందు నిలబడి షేవ్ చేసుకొంటున్న సారధి వెనక్కి తిరిగి చూసేడు. “ఈజిట్?” అంటూ. అప్పటికే స్వాతి లోపలికి వెళ్లిపోయింది. ఆమె చెప్పింది తనకేనని సారధికి తెలుసు. త్వరగా షేవింగ్ అయిందనిపించి స్వాతి ఉన్న గదిలోకి వచ్చేడు. స్వాతి నానికి తల స్నానం చేయించి ఇస్త్రీ బట్టలు తొడుగుతోంది. “నిన్న చెప్పలేదేం? ఆఫీసు నుండి వచ్చేటప్పుడు కొత్త బట్టలు […]

అమ్మమ్మ – 26

రచన: గిరిజ పీసపాటి విశ్రాంతి తీసుకుంటూ, శేష జీవితం గడపవలసిన వయసులో కూడా గరిటె పట్టుకుని ఆ ఇంటా, ఈ ఇంటా వంటలు చేస్తూ సంపాదిస్తున్న తల్లిని డబ్బు అడగడానికి మనసొప్పకపోయినా, తనకు చదువు అంటే ఉన్న ఇష్టం, అంతంత మాత్రంగా ఉన్న తమ ఆర్ధిక పరిస్థితి కారణంగా తల్లికి విషయం వివరిస్తూ ఉత్తరం రాయక తప్పలేదు నాగకి. వారం రోజులలోనే ఆవిడ దగ్గర నుండి ”తప్పకుండా డబ్బు పంపుతాననీ, ఎంత అవసరమౌతుందో తెలియజేయమ’ని జవాబు వచ్చింది. […]

కంభంపాటి కథలు – అటకెక్కేడు

రచన: రవీంద్ర కంభంపాటి ఒకటే వాన..రెండ్రోజుల్నుంచీ తెరిపినివ్వకుండా కురుస్తోంది. వర్షానికి, బిళ్ళ పెంకేసున్న ఆ వీధిలో దూరంగా విసిరేసినట్టున్న మండువా ఇంట్లో వంటిల్లు, వరండా తప్ప అన్ని గదులూ కారుతున్నాయి. చేసేదేమీ లేక డెబ్భై ఐదేళ్ల గంగాలక్ష్మిగారు ఆ వరండాలో ముడుచుక్కూర్చుని ఆ వర్షాన్ని చూస్తున్నారు. లోపలికెళ్ళి ఏదైనా వండుకుందామనుకుంటే, కళ్లజోడెక్కడ పెట్టేసుకున్నారో ఏమో, అన్నీ మసకమసగ్గా కనిపిస్తున్నాయి ఆవిడ గాజు కళ్ళకి. రెండ్రోజులైంది ఆవిడ తిని, ఇవాళ ఏదో ఒకటి ఉడకేసేసుకుని తినకపోతే ఈ ప్రాణం […]