April 16, 2024

మాలిక పత్రిక ఆగస్టు 2021 సంచికకు స్వాగతం..

  Jyothivalaboju Chief Editor and Content Head వేసవి తాపం చల్లారింది. వాన జల్లులు కూడా కాస్త తగ్గినట్టున్నాయి. వాతావరణమంతా చల్లచల్లగా, రంగు రంగులతో అలరారుతూ ఉంది. వరినాట్ల సమయం, ఇళ్లల్లో కూడా కొత్త మొక్కలు పెట్టుకోవచ్చు. ప్రభుత్వంకూడా హరితహారం అని మొక్కలు ఉచితంగా ఇస్తున్నారు.  పచ్చదనాన్ని ఆహ్వానించండి.. రాబోయేది పండగల సీజన్. ఈసారైనా అందరినీ కలిసి, సంతోషంగా పండుగలు జరుపుకునే అవకాశం కలగాలని కోరుకుందాం. మాలిక పత్రిక ఎప్పటికప్పుడు కొత్త రచనలను, కొత్త రచయితలను […]

మోదుగ పూలు – 1

నా మాట: భారతదేశములో ‘వికాసతరంగిణి’గా పేరున్న ఒక Non-Profit Organizationకు అమెరికాలో VTSeva బ్రాంచ్‌ వంటింది. వారు ప్రతి సంవత్సరము అమెరికాలో పుట్టి పెరిగిన భారతీయ సంతతిని ‘ఇంటర్న్‌షిప్’ మీద భారతదేశములోని వారు నడుపుతున్న పాఠశాలలకు తీసుకువెడతారు. ఆ స్కూల్సు ‘గిరిజన పాఠశాలలూ, అంధవిద్యార్థుల పాఠశాలలు’. ఇవి పరమహంసపరివ్యాజులైన శ్రీ. చిన్నజియ్యరు స్వామి వారి అధ్వర్యములో నడుస్తాయి. ఈ internship కు chaperoneలా పిల్లలతో కలసి నేను కూడా ప్రయాణించే అపూర్వ అవకాశమొచ్చింది. అలా మొదటిసారి 2017 […]

తాత్పర్యం – 2. 264 రోజుల జీవితం

రచన: రామా చంద్రమౌళి ఒకటే ఎడతెగని వర్షం. రెండురోజులనుండి. నగరం తడిచి ముద్దయింది. అంతా నీటి వాసన ఎక్కడికి వెళ్ళినా. రోడ్లూ, చెట్లూ, లక్షలకొద్ది ఇండ్లూ. అన్నీ ఎంతో కాలం తర్వాత తనివితీరా అభ్యంగన స్నానం చేసినట్టు. అంతా శుభ్రంగా. , హోటల్ దుర్గా. రిసిప్షన్ కౌంటర్ లో ఏదో రాసుకుంటున్న మాలతి అప్రయత్నంగానే తలెత్తి చూచింది ఎదురుగా ఉన్న గోడ గడియారంవైపు. ఏడు గంటల పది నిముషాలు. రాత్రి. ‘టైం తెలియనే లేదు. డ్యూటీకి వచ్చి […]

తామసి – 10

రచన: మాలతి దేచిరాజు అప్పటి నుంచీ గౌతమ్ నసీమాకి అడుగడుగునా తోడున్నాడు. తనకి ఏ అవసరం వచ్చినా ముందుండే వాడు. షీబాతో కలవడం కొంచెం తగ్గింది. తనతో ఉన్నప్పుడు కూడా ఎక్కువ నసీమా టాపిక్కే మాట్లాడేవాడు. (ఉద్దేశపూర్వకంగా కాదు.) నెమ్మదిగా షీబాకి దూరమవుతున్నాడు, నసీమాకి దగ్గరవుతున్నాడు గౌతమ్. కారణం తెలిసిన షీబా, ఓ రోజు నసీమాని కలవాలనుకుంది. అనుకున్నట్టే కలవటానికి తన స్కూల్ కి వెళ్ళింది. “మేడం మీ కోసం ఎవరో వచ్చారు…” చెప్పాడు ప్యూన్. టెక్స్ట్ […]

అమ్మమ్మ – 28.

రచన: గిరిజ పీసపాటి ఆ సాయంత్రం నుండి తుఫాను వల్ల ఒకటే ఈదరు గాలులతో కూడిన వర్షం కుండపోతగా కురుస్తోంది. గిరిజ, నాని కూడా నిద్ర పోకుండా అక్కనే చూస్తున్నారు. అర్ధరాత్రి దాటినా ఇంట్లో లైట్లు వెలుగుతూనే ఉండడంతో ఎదురింటి ఆర్టీసీ కండక్టర్ డ్యూటీ ముగించుకుని ఇంటికి వచ్చి, భార్యతో “ఏంటి? వసంత వాళ్ళింట్లో ఇంకా లైట్లు వెలుగుతున్నాయి” అని అడిగాడు. ఆవిడ “అవునా! వసంతకెలా ఉందో ఏమిటో!? పదండి చూద్దాం” అంటూ ఇద్దరూ వచ్చారు. వస్తూనే […]

ధృతి – 3

రచన:మణి గోవిందరాజుల… “హే! ధృతీ కంగ్రాట్స్… శేఖరం గారినే మెప్పించావు హార్టీ కంగ్రాట్స్” అభినందనలు వెల్లువలా కురిశాయి. “ధృతీ, ఇక వెళ్దామా? బాగా అలసి పోయావు!” దినేష్ వచ్చి అడిగాడు. “అదేమీ కుదరదు.అంకుల్… ఇంత పెద్ద సక్సెస్ మేము ఎంజాయ్ చేయాల్సిందే. మేమొచ్చి దింపుతాము. ప్లీజ్! అంకుల్, మీరెళ్ళండి. మేము క్యాంటీనుకెళ్ళి ఏమన్నా తిని, తాగాక బయలుదేరుతాము” అప్పుడే వెళ్ళడానికి ఎవ్వరూ ఒప్పుకోలేదు. చేసేది లేక భార్యను, పిల్లల్ని తీసుకుని దినేష్ వెళ్ళిపోయాడు. అందరూ కలిసి పొలో […]

కంభంపాటి కథలు.. ఆవిడేమందంటే..

రచన: రవీంద్ర కంభంపాటి ‘ఏమిటి..నీలో నువ్వే నవ్వేసుకుంటున్నావు? ‘ఆఁ..ఏం లేదూ.. పక్కింటి స్వర్ణ గారి మాటలు గుర్తొచ్చి ‘ఏవన్నారు ఆ స్వర్ణ గారు?’ ‘ఆవిడేమందో మీకెందుకండీ అంత ఆసక్తీ? ‘నువ్వేదో అన్నావని అడిగేను గానీ.. ఆవిడ గురించి ఆసక్తీ లేదు.. ఆవిడేమందో వినే శక్తీ లేదూ ‘ ‘ఆఁ.. ఏదో అలా పైకంటారు గానీ.. మీకెప్పుడూ అవతలాళ్ళు ఏం మాట్లాడుకున్నారా అని.. మహా ఇది!.. నిజం చెప్పండి.. అత్తగారి మీద ఒట్టేసి.. మీకాసక్తి లేదని చెప్పండి ‘ […]

చంద్రోదయం – 18

రచన: మన్నెం శారద శేఖర్ యింటి గృహప్రవేశం చాలా నిరాడంబరంగా జరిగిపోయింది. చాలా ముఖ్యులయిన వాళ్లను మాత్రమే పిలిచేడు శేఖర్. పనిలోపనిగా పిల్లవాడి బారసాల కూడా జరిపించేడు. బాబుకి “ఆశాకిరణ్” అని నామకరణం చేసేరు. సారధి బాబు మెడలో పులిగోరు పతకం వున్న గొలుసు వేసి దీవించేడు. “ఇప్పుడీ ఖర్చెందుకు?” అంటూ కోప్పడ్డాడు శేఖర్. “నువ్వు నాకోసం చేసిన ఖర్చులో యిది యెన్నో వంతురా? నా సరదా కూడా తీర్చుకోనీ!” అన్నాడు సారధి నవ్వుతూ. అందరూ ఉత్సాహంగా […]

అల్ విదా!

రచన : సోమ సుధేష్ణ “నా మనసుకు నచ్చి, కోరికల కోటాలో కొట్టుకు పోయేవాడు కాకుండా అరవింద్ బావలాగ మంచి వాడైతే తప్ప నేను పెళ్ళి చేసుకోను. ” అని ఖచ్చితంగా చెప్పింది మాలిక. అలాగేలే అని దీవించారు విమల, బలరాం తమ గారాల కూతురును. అది విని మౌనిక చెల్లిని ప్రేమగా అక్కున చేర్చుకుని దీవించింది. మౌనిక కంటే మాలిక నాలుగేళ్ళు చిన్నది. అందరికి ఇద్దరు పేరెంట్సు ఉంటె` మాలికకు ముగ్గురున్నారు. మౌనిక మూడో పేరెంటు. […]

నిర్ణయం

రచన: శింగరాజు శ్రీనివాసరావు పదవీ విరమణ చేసిన తరువాత మా అమ్మాయి గోల పడలేక మా శ్రీమతితో కలిసి అమెరికాలో ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఎంతో సాదరంగా ఆహ్వానించారు కూతురు, అల్లుడు. ఇక మా మనుమరాలు మిహిత సరేసరి ‘తాతయ్యా’ అంటూ మెడల మీదే నాట్యం చేసింది. దానికి తెలుగు ధారాళంగా రాదు, దాని ఆంగ్ల భాషా పటిమ నాకు అర్థం కాదు. ఆంగ్లంలో కొద్దో, గొప్పో ప్రవేశం ఉన్నా ఆ ఉచ్ఛారణ మనకు అంతుబట్టేది […]