May 31, 2023

నీ నయనాలు

రచన: చంద్రశేఖర్

నీలాల నీ కనులు
సోయగాల సోకళ్ళు

అందాల ఆ కనులు
నల్లని నేరేడు పండ్లు

చేప వంటి నీ కనులు
చెబుతున్నాయి ఊసులు

నాట్యం చేసే ఆ కనులు
మయూరానికే అసూయలు

మెరిసేటి నీ కనులు
వెలిగేటి జ్యోతులు

తేజస్సుతో ఆ కనులు
ఇస్తాయి కాంతులు

కాటుక పెట్టిన నీ కనులు
తెచ్చెను కాటుకకే వన్నెలు

ప్రపంచంలో అందరికి రెండే కనులు
కానీ నీ రెండు కనులలో దాగి ఉంది
మరో అందమైన ప్రపంచం

1 thought on “నీ నయనాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *