February 5, 2023

మమతల బంధం – మన జీవనవేదం

రచన: రాజ్యలక్ష్మి. బి “నాకు రెండువేలు కావాలి” “ఎందుకు?”చదువుకుంటున్న సుబ్రహ్మణ్యం తలెత్తకుండానే ప్రశ్నించాడు. “ఆడవాళ్లకు కూడా అవసరాలు వుంటాయి. అని తెలుసుకోండి, ప్రతీదీ ఆరా తియ్యడం యేమిటి ?” విసుగ్గా కిటికీ దగ్గర నించుంది పద్మ. చదవడం ఆపేసి సాలోచనగా పద్మను చూస్తూ “ఎందుకు అన్నాను కానీ అవసరం లేదని అనలేదుగా, చెప్పకూడని రహస్యమా ” అన్నాడు నవ్వుతూ సుబ్రహ్మణ్యం. అసలే కోపంగా వున్న పద్మ వదనం మరింత యెర్రబడింది. “వెక్కిరింపు అనవసరం. నాకు మీ దగ్గర […]

పరివర్తన

రచన: ప్రభావతి పూసపాటి “తులశమ్మగారి కొడుకు కోడలు రేపొద్దున బెంగుళూరు వెళ్ళిపోతున్నారుట” తన కోడలు చెపుతున్న మాటలు పక్క గదిలో ఉన్న వర్ధనమ్మ చెవిలో పడ్డాయి. కోడలు చెపుతున్న తులశమ్మగారువాళ్ళు తమ ఇంటి ఎదురు ఫ్లాట్ లో వుంటారు.. “కొడుకు కోడలు బెంగుళూరు రమ్మన్నా, అక్కడికి రాలేను అని తులశమ్మగారు అనకముందే మన అపార్ట్మెంట్ వాళ్లే ఇక్కడ మేమంతా దగ్గర ఉండి చూసుకొంటాము, మీతో బెంగుళూరు వస్తే పగలంతా ఇంట్లో వాళ్ళు ఇద్దరే ఉండవలసి వస్తుంది, ఇక్కడ […]

మార్పు మొదలయ్యింది

రచన: MRVS మూర్తి “సుజీ, నువ్వూ అబ్బాయి ఎలా వున్నారు ? నేను బాగానే ఉన్నాను. ” భర్త గొంతు విని సుప్రజ తనువంతా పులకించి పోయింది. నోట మాట రావడంలేదు. పదిహేను రోజులు అయ్యింది ఆయన నుండి ఫోన్ వచ్చి. భార్య మాట్లాడక పోవడంతో అతను మల్లీ పిలిచాడు ‘సుజీ.. సుజీ ‘ అని. “ఆ వింటున్నానండి “ అంది ఆనందంగా. “మేము బాగానే ఉన్నాము. ఆదిత్య ఇంటర్ పరీక్షలకు చదువుతున్నాడు. ఇప్పుడు అంతా ఆన్లైన్ […]

తమసోమా జ్యోతిర్గమయ

రచన: గరిమెళ్ళ వెంకట లక్ష్మీ నరసింహం ఆ ఊరు మరీ పెద్దది కాదు గాని, నేరాలకు రాజధానిగా పేరు బడ్డాది. సీతాలు, సింహాద్రి దంపతులు, ఆ ఊళ్ళో కూలీ నాలీ చేసుకు బ్రతుకుతున్నారు. వారికి పెళ్లయిన ఆరేళ్ళ తరువాత, మొదటి సంతానం మొగ బిడ్డ కలిగింది. అప్పట్లో, ఆ ఊళ్ళో ఒక బాబాగారుండే వారు. ఆయన మీద ఉన్న భక్తి, గౌరవాల సూచకంగా, ఆ దంపతులు పిల్లాడికి ‘బాబా’ అని పేరు పెట్టుకొన్నారు. ముద్దుగా పెరుగుతున్న బాబా, […]

అవలక్షణం

రచన: ఎ. బి. వి. నాగేశ్వర రావు పరదేశీ పెత్తనం మన గడ్డ పైనా ! ఏమి దుర్దశ మనది !! పాడాలి చరమగీతమని పరితపించిరి… ఆనాడు. తల్లి భారతిని తాకట్టు పెట్టినా తప్పేంటి తమ్ముడు ? అన్నదే ఉన్నట్టి ధోరణి, స్వతంత్ర భారతిన… ఈనాడు. జాతీయ భావము, దేశాభిమానము, సమిష్టి వ్యాపకము, మన జాతి వేదముగ చాటుకొంటిరి మరి… ఆనాడు. తరతమ భావము, సంకుచితము, ప్రాంతీయ వాదము – వచ్చిచేరాయి, పెచ్చుమీరాయి, తీరులు మారాయి… ఈనాడు. […]

శ్రీదేవీభాగవత మహత్మ్యము . 2

రచన: ఓలేటి స్వరాజ్యలక్ష్మి మొదటి స్కందము మూడవ కథ రైవతుడను మనువు వృత్తాంతము ఈ కథను మిత్రావరుణుని నుండి ప్రకటితుడైన అగస్త్యమునికి శివకుమారుడైన స్కంధుడు వివరించినది. దేవీ భాగవత మహాత్మ్యము ఇందు చెప్పబడినది. ఋతువాకుడను ముని గలడు. అతడికి ఒక పుత్రుడుదయించెను. పుత్రోత్సాహము జరుపబడెను. అతడు రేవతీ నక్షత్రమందు నాల్గవ పాదమున జన్మించెను. అది గండాంతము అని చెప్పుదురు. చేయవలసిన సంస్కారాదులన్నీ ముని అతనికి జరిపించెను. జాతకర్మాదులు, ఉపనయన సంస్కారము చేసెను. అ పిల్లవాడు పుట్టినప్పటినుంచి తల్లిదండ్రులు […]

కథ విందువా … నా మనసుకథ విందువా…

రచన: కోసూరి ఉమాభారతి వెన్నెల ఆకస్మిక మరణం, ఆమె నుండి అందిన ఉత్తరంలోని సారాంశం… అమ్మాపిన్ని శారదని విపరీతంగా కృంగదీశాయి. వారం రోజులుగా నిద్రాహారాలు మాని, మాటాపలుకు లేకుండా నిర్లిప్తంగా ఉండిపోయిన ఆమెని…. తమకి యేళ్లుగా తెలిసిన డాక్టర్. వాణి మీనన్ వద్దకు బలవంతంగా తీసుకుని వెళ్లారు ఆమె భర్త రామ్, కొడుకు సాయి. విషయం వివరించి, చనిపోయేముందు వెన్నెల… శారదకి రాసిన ఉత్తరాన్ని కూడా డాక్టర్ చేతిలో పెట్టారు. *** ఆ ఉత్తరాన్ని ఒకటికి రెండుమార్లు […]

నాచారం నరసింహస్వామి గుడి

రచన: రమా శాండిల్య తెలంగాణాలో, ఇంత మంచి దేవాలయాలు ఉన్నా, అవి ప్రాచుర్యంలో లేకపోవటం విచారించాల్సిన విషయం. చుట్టూ పొలాలు, చిన్న వాగు, చిన్న గుట్టమీద తాయారమ్మ, ఆండాళ్లమ్మలతో పాటుగా వెలసిన నరసింహస్వామి ఆలయమిది. ప్రశాంతమైన పరిసరాలతో ఈ గుడి చాలా బావుంటుంది. ఇక్కడ పెద్దసంఖ్యలో కోతులుంటాయి. అవి, మన చేతుల్లో ఉన్న వస్తువులను లాక్కుపోతూ ఉంటాయి. ఈ గుడి ఉదయం ఆరు గంటలనుంచీ మధ్యాహ్నం పన్నెండు గంటలవరకూ తెరచి ఉంటుంది. ఒంటిగంటకు గుడి లోపల శాకాహార […]

దానవ గురువు ‘శుక్రాచార్యుడు’

రచన: అంబడిపూడి శ్యామసుందర రావు తెలివితేటలలో బృహస్పతి ఎంతటివాడో శుక్రాచార్యుడు కూడా అంతటి వాడు. దేవతలు బృహస్పతిని గురువులుగాఉండమని అడిగినప్పుడు బృహస్పతి , “నాకన్నా శుక్రాచార్యుడు సమర్ధుడు ఆయనను అడగండి” అని చెపుతాడు. కానీ దేవతలు బృహస్పతిని గురువుగా ఎంచుకుంటారు బృహస్పతి మీద, దేవతల మీద కోపముతో శుక్రాచార్యుడు రాక్షసులకు గురువుగా ఉంటాడు. ఆనాటి నుంచి దేవా దానవుల సంగ్రామాల్లో దానవులకు అన్ని విధాలుగా సహకరించివారి విజయాలకు తోడ్పడినవాడు శుక్రాచార్యుడు, కానీ దేవతలా పక్షనా న్యాయము ధర్మము […]