April 20, 2024

ఔషధ విలువల మొక్కలు

రచన: నాగమంజరి గుమ్మా 1. బృహతిపత్రం చేదు రుచిని గల్గు శ్రీ గణపతి పత్రి* జ్వరము, కఫము కట్టు వాంతులున్ను* వాకుడాకు పేర వర్ధిల్లు బృహతియే* ఏకదంతుని కిది మోకరిల్లె* ఏకదంతాయ నమః బృహతీపత్రం పూజయామి అని పూజించే ద్వితీయ పత్రానికే వాకుడాకు అని పేరు. ఇది కూడా ఔషధమే. జ్వరం, కఫం, వాంతులు మొదలగు వ్యాధులకు ఔషధం. పురుషుల వంధ్యత్వానికి కూడా మంచి మందు. 2. బిల్వ పత్రం శివకేశవులకు ప్రీతిగ* నవలీలగ వేడి మాన్పె […]

తుమ్మెదా.. తుమ్మెదా

రచన: శశిబాల ఎచ్చన్ని సూరీడు తుమ్మెదా సల్లంగ వచ్చాడు తుమ్మెదా పొద్దు పోడిసేనంటు తుమ్మెదా ..మరి పల్లె లేసేసింది తుమ్మెదా కొప్పులో పూలెట్టి కొత్త పావడ గట్టి మామకై వచ్చాను తుమ్మెదా మామేమో లెగడాయే పక్కేమో దిగడాయే ఊరంతా నవ్వేరు తుమ్మెదా కొండల్లో కోనల్లు ఎక్కి సూసొద్దామంటే నిద్దర లేవడు తుమ్మెదా వులుకులికి సూస్తాడు తుమ్మెదా పంట సేనుల్లోన వరికోత కొస్తేను సాటుకి లాగిండు తుమ్మెదా కొంటె కోణంగి ఐనాడు తుమ్మెదా.. నేను సిగ్గుతో సితికెను తుమ్మెదా […]

నీ నయనాలు

రచన: చంద్రశేఖర్ నీలాల నీ కనులు సోయగాల సోకళ్ళు అందాల ఆ కనులు నల్లని నేరేడు పండ్లు చేప వంటి నీ కనులు చెబుతున్నాయి ఊసులు నాట్యం చేసే ఆ కనులు మయూరానికే అసూయలు మెరిసేటి నీ కనులు వెలిగేటి జ్యోతులు తేజస్సుతో ఆ కనులు ఇస్తాయి కాంతులు కాటుక పెట్టిన నీ కనులు తెచ్చెను కాటుకకే వన్నెలు ప్రపంచంలో అందరికి రెండే కనులు కానీ నీ రెండు కనులలో దాగి ఉంది మరో అందమైన ప్రపంచం

వెన్నెల జాము

రచన: డా. బాలాజీ దీక్షితులు పి వి వెన్నముద్ద తినిపిస్తుంది కన్నె చందమామ కన్నుల పూసిన కలువలు గండె గూటికి చేరుస్తుంది వెన్నెల హంస మధుర మధురామృత మధువును త్రాగిస్తుంది వలపుల పందేరం పరిమళ సుధాసుగంధంతో అప్సర మధనం చేస్తుంది చిరు వయ్యారం ప్రేమ నెమిలిక నెయ్యంతో నిలువెళ్ళా పూస్తుంది వన్నెల సోయగం పదునైన పైయెదల పరువపు శూలాలతో దాడి చేస్తుంది కన్నె తనం స్వప్నం నుండి లేవగానే వెన్నెల జాము మల్లెల వర్షంలో భావుక తపస్సుచేసే […]