April 23, 2024

మారుతున్న యువతరం

రచన: లక్ష్మి చివుకుల “ఈ పెళ్లి సంబంధం అయినా కుదిరితే తిరుపతి వెంకటేశ్వర స్వామీ.. నీ గుడికి నడుచుకుంటూ వచ్చి నీ దర్శనం చేసుకుంటాము తండ్రీ! నూతన వధూవరుల చేత కళ్యాణం చేయిస్తాను”… ఎడాపెడా చెంపలు వాయించుకుంటూ దేవునికి మొక్కుకుంటోంది అలివేలు. “నవీన్ !! రెడీ అయ్యావా ! ప్లీజ్ … ఈ పెళ్లి చూపులలో అయినా, ‘నేను అమ్మాయితో విడిగా మాట్లాడతాను….. మా అమ్మని నాన్నని బాగా చూసుకోవాలి…. మనమంతా కలిసే వుండాలి……’ అని చెప్పకురా. […]

మాలిక పత్రిక సెప్టెంబర్ 2021 సంచికకు స్వాగతం

పాఠక మిత్రులు, రచయిత మిత్రులు, సాహితీ మిత్రులందరికీ స్వాగతం, సుస్వాగతం… కొత్త సంవత్సరం వచ్చేసింది. అప్పుడే ఎనిమిది నెలలు దాటిపోయాయి కూడా.. ఎన్ని విపత్తులు వచ్చినా కాలం ఆగదు కదా.. భయంభయంగానే పండుగలు జరుపుకుంటున్నాము.. వరలక్ష్మీ వ్రతం, రాఖీ పండగ, జెండా పండగ అయిపోయి వినాయకుడికి ఆహ్వానం పలికే ఏర్పాట్లు జరుగుతున్నాయి.. మీ అందరికీ ఈ వినాయకుడు అన్ని ఆటంకాలను తొలగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెప్టెంబర్ మాలిక పత్రిక మీకు అందిస్తున్నాము. మీకు నచ్చిన, మెచ్చిన కథలు, […]

మోదుగపూలు – 2

రచన: సంధ్యా యల్లాప్రగడ ఆదిలాబాదు అంటేనే అడవులు గుర్తుకు వస్తాయి. రాష్ట్రములో అత్యంత ఎక్కువ అడవులు ఉండి, అందాలతో ఉన్న జిల్లా అది. 75శాతం పచ్చని అడవులు, జలపాతాలతో ప్రకృతి అందాలన్నీ నిలవలుగా ఉన్న జిల్లా అది. అందాలు హస్తకళలు ఉన్నా అక్షరాస్యత 63శాతంలోనే ఉంది. ఆదివాసులు, గిరిజనులు ఉన్న జిల్లా. ఉన్నత విద్య, వైద్యము, కనీస అవసరాలకు ఆదిలాబాదే క్రేంద్రము వాళ్ళకు. ఆదిలాబాదు తెలుగు రాష్ట్రాలకు సరిహద్దు. కాని అడవులకు సరిహద్దులేర్పచగలమా? మహారాష్ట్ర, నాందేడు సంస్కృతులు […]

చంద్రోదయం – 19

రచన: మన్నెం శారద “ఇది జరిగి రెండేళ్ళు అవుతోంది. డిపార్టుమెంటు రూల్స్ ప్రకారం శేఖర్ ఆఫీసులో నాకు క్లర్క్ పోస్ట్ యివ్వటం, నేను జాయినవ్వటం మీకు తెలుసు. ఆ విషయంలో మీరు మాకనేక విధాలుగా సహాయం చేసి ఆదుకున్నారు. అయినా కూడా నేను మిమ్మల్ని నొప్పించి పంపేసేను. అప్పటి పరిస్థితులు, ఆవేశం అలాంటివి. శేఖర్ నన్ను ఎంతో ఆదరణగా చూసేరు. ఆయనతో గడిపిన జీవితం చాలా చిన్నదయినా ఎంతో అపురూపమైనది. అంత మంచి వ్యక్తిని భర్తగా ప్రసాదించిన […]

ధృతి – 4

రచన: మణికుమారి గోవిందరాజుల “రండి! రండి… అత్తయ్యగారూ!” కారు దిగుతున్న అత్తగారికి ఎదురెళ్ళి ఆహ్వానించింది పూర్ణ. కారు దిగుతూ కోడల్ని నిండుగా చూసుకుంది రంగనాయకమ్మ. ఎప్పుడూ చిరునవ్వుతో ఉండే కోడలంటే చాలా ఇష్టం రంగనాయకమ్మకి. కారు దిగిన అత్తగారి కాళ్ళకు దండం పెట్టింది. “ఇప్పుడెందుకే ఈ దండాలూ” అంటునే మనసారా “దీర్ఘ సుమంగళీ భవ” అని దీవించింది. “పిల్లలేరే” ఎక్కడా పిల్లల జాడ కనపడక అడిగింది. “ఏమో అత్తయ్యా! ఇప్పటిదాకా ఇక్కడే ఉన్నారు. ఎక్కడికెళ్ళారో… ఏంటో” పూర్ణ […]

తామసి – 11

రచన: మాలతి దేచిరాజు షీబాతో ఆ ఘటన జరిగిన తర్వాత, గౌతమ్ ఆమెని కలవడం తగ్గించాడు. ఎదురుపడినా మొహం చాటేస్తున్నాడు. అది మరింత బాధ పెడుతోంది ఆమెని. రోజులు గడుస్తున్న కొద్దీ వాళ్ళ మధ్య దూరం పెరుగుతోంది. చివరిసారిగా అడుగుదామని నిశ్చయించుకుంది. ‘టక్..టక్..టక్…’ తలుపు చప్పుడు విని గుమ్మం వైపు చూసాడు గౌతమ్. ఎదురుగా షీబా. “రా…” అన్నాడు. “ఎందుకొచ్చావనంటావ్ అనుకున్నా.” చెప్పింది తను. “తెలిసినవి అడగను నేను.” “కాని, తెలిసి కూడా పట్టించుకోవు! అంతేనా?” “పట్టించుకోకపోవడమే… […]

అమ్మమ్మ – 28.

రచన: గిరిజ పీసపాటి నాగ అలా అడగడానికి కారణం చిన్నప్పటి నుండి గిరిజ పెద్దగా నడవలేదు. కాస్త దూరం నడిచినా మనిషి నీరసించిపోతుంది. కానీ పరిస్థితిలే ఆరిందాతనాన్ని ఇస్తాయేమో. అందుకే “అదేం లేదమ్మా. కానీ కేరేజీ లోపలకి తీసుకురావాలంటే డబ్బు కట్టాలని కింద గేట్ దగ్గర వాచ్ మేన్ ఆపేస్తున్నాడమ్మా!” అంది. “ఎంత అడిగాడు” అనడిగిన తల్లితో “ఇరవై రూపాయలు” అంది. “సరే. రేపు ఉదయం ఈ పది రూపాయలు ఇవ్వు. మిగిలిన డబ్బులు తరువాత మా […]

కంభంపాటి కథలు – సమయానికి తగువు మాటలాడెనే

రచన: కంభంపాటి రవీంద్ర ‘ఏవండీ… ‘ ‘ఊఁ’ ‘ఓ మాట’ ‘చెప్పు ‘ ‘రేపటి నుంచీ మనిద్దరం తగులాడుకోవద్దు’ ‘రెండు విషయాలు’ ‘రెండు విషయాలా? ‘అవును… ఒకటి. తగూలాడుకోవద్దు అనడం తప్పు… తగువుపడొద్దు అనాలి… రెండు… మనిద్దరం తగువుపడకూడదు అంటే… రేపటిదాకా ఎందుకు? ఇవాళ్టి నుంచే మనిద్దరం గొడవ పడకుండా ఉండొచ్చుగా’ ‘ముందు మొదటి పాయింట్ చర్చిద్దాం… మీ ఉద్దేశం ఏమిటి? నాకు తెలుగు రాదనేగా?’ ‘రాదని కాదు… సరిగా రాదని… ఒకవేళ వచ్చుంటే… పాయింట్ బదులు […]

తాత్పర్యం – అమ్మ గది

రచన: రామా చంద్రమౌళి ఏ వస్తువు విలువైనా ఆ వస్తువు లేనప్పుడే తెలుస్తుంది. మనిషి విషయంకూడా అంతే..ఒక మనిషి మననుండి దూరమౌతున్నప్పుడు. పూర్తిగా ఎడమై కోల్పోతున్నప్పుడు.. చివరికి మనిషి శాశ్వతంగా నిష్క్రమించినప్పుడు., విలువలు ఎప్పుడూ సాపేక్షాలూ..సందర్భోచితాలూ..జీవితానుభవంతో మారే పాఠాలా? మనుషులనుబట్టి..వాళ్ళ వయసులనూ,వాళ్ళ సామాజిక ప్రయోజకతనూ..ముఖ్యంగా ఆర్థిక నేపథ్యాన్ని బట్టీ,ఆ వ్యక్తితో ఎవరికైనా ఒనకూరే లాభాన్నిబట్టీ విలువలు ఎప్పటికప్పుడు మారుతూ..సంబంధిత వ్యక్తులను శాసిస్తుంటాయా.? ఔను. సరిగ్గా అంతేనేమో..సందర్భాన్ని బట్టీ..అవసరాన్నిబట్టీ..మున్ముందు ఆ వ్యక్తితో సిద్ధించబోయే ప్రయోజనాలనుబట్టే మానవ సంబంధాలన్నీ., అరవై […]

దేవీ భాగవతము 3

రెండవ స్కంధము ఆరవ కథ ఉపరిచర వసువు ఉపరిచర వసువు ఛేది దేశమును పాలించేవాడు. నిష్ఠాగరిష్ఠుడు. సత్యవ్రతుడు, ధర్మ ప్రభువు. అతనికి నలుగురు కుమారులు గలరు. వారిని వివిధ రాజ్యములకు రాజులుగా నియమించాడు వసువు. రాజుభార్య గిరిక. గొప్ప సౌందర్యవతి. ఒకసారి ఆమె ఋతుమతి అయిఉండగా రాజు పిత్రాజ్ఞచే వేటకు వెళ్ళవలసి వచ్చెను. భార్యయందు అనురక్తుడైన రాజుకు వీర్యస్ఖలనమయ్యెను. రాజు ఆ వీర్యమును ఒక వటపత్రము నందు భద్రపరచి దగ్గరలో ఉన్న ఒక గ్రద్దకు యిచ్చి భార్యకు […]