March 29, 2024

ప్రగతి (బి) భిక్ష

రచన: అఖిల దొడ్డపనేని మనోహరమైన సుందర దృశ్యం! విమానం కిటికీలోనుండి చూస్తున్న నా మనసు పులకలకు గురైంది. చూస్తున్నంతసేపు నీలి పరదాలు కప్పుకున్న తనివి తీరనన్ని కొండల బారులు! వాటినంటి పెట్టుకున్న దట్టమైన చెట్టూ చేమా. ఇంతకంటే సుందర దృశ్యాలు ఎన్నిటినో చూసాను కాని ఇవ్వన్ని నావి. ఈ నేల, నింగి, మబ్బులు, గాలి సర్వం నా సొంతం. ఏ నిమిషమైనా నేను చూడొచ్చు, అక్కడ తిరగొచ్చు. అన్నీ కుదిరితే సొంతం కూడా చేసుకోవచ్చు. ఇది మనది, […]

తలరాత మార్చిన క్షణాలు

రచన: G.V.L. నరసింహం ఆ ఊరి పేరు కొత్తపేట. ఎంత కొత్తదో తెలియదు కాని, ఆ ఊళ్లోని ఇళ్లన్నీ, తాతలనాటి పాతవే. ఆలా అని, చిన్న చూపు చూడకండి. ఆ గ్రామానికున్న కట్టుదిట్టమయిన భద్రతా ఏర్పాట్లు తెలుసుకొంటే, మీరే ఆశ్చర్యపోతారు. అందులోనూ విశేషమేమిటంటే, అంత అభేద్యమయిన భద్రతకు, గ్రామవాసులు ఒక చిల్లిగవ్వ కూడా ఖర్చు చేయలేదు. ప్రభుత్వం భరించిందనుకొంటున్నారా. అది కలలో మాట. నిజానికి ప్రభుత్వం, ఆ ఏర్పాట్లను నాశనం చేసే దిక్కుగా, అడుగులేస్తోంది. ఆ భద్రతా […]

అపాత్రదానం

రచన: ప్రభావతి పూసపాటి “మీ బామ్మకి రాను రాను చాదస్తం ఎక్కువైపోతోంది.. ఎవెరెలా పొతే మనకేంటి అని అనుకోకుండా. సమాజసేవ, మంచి, మానవతా విలువలు అంటూసైదమ్మకి చెప్పాలని చూసారు. విసురుగా అంటూ టేబుల్ మీద గిన్నెలు తీసి సింకులో పడేయడానికి వెళ్ళింది. శ్వేత. “ఏమి? ఏమైంది ఈ రోజు కూడా సైదమ్మ పనిలోకి రాలేదా ??” తన ప్లేట్ కూడా తీసి సింక్ లో వేస్తూ అడిగాడు సిద్దు. “మీ బామ్మసుభాషితాలు విన్నాక ఎటువంటి వారైనా ఇల్లాంటి […]

మలుపులో మధుర చెలిమి

రచన: రాజ్యలక్ష్మి బి “వచ్చావా.? యెక్కడున్నావే.?” అన్నది జానకి ఫోన్ చెవి దగ్గర పెట్టుకుని. “ఇదిగో యీ కుడివైపు చూడు — నిన్ను నేను చూస్తున్నా. గేట్ వద్ద కనిపిస్తున్నావు నువ్వ్వు “చెయ్యుపుతూ అంది శారద. “ఆ —– కనిపించావు. ఆగు వస్తున్నా. ” అటువైపు నడిచింది జానకి. జానకి, శారద చిన్నప్పటినించీ మంచి స్నేహితులు. ఒకే వీధిలో యిళ్ళు. ఒకేస్కూలు, ఒకేకాలేజీ. మనస్తత్వాలలో భిన్నత్వం వున్నా, అభిరుచులలో యేకత్వం వుంది. ఒకరిపై ఒకరికి గల అభిమానం […]

ఔషధ విలువల మొక్కలు -2 (6 – 10)

రచన: నాగమంజరి గుమ్మా *దూర్వాయుగ్మ పత్రం* గరిక పోచ యనుచు కడు హీనముగ జూచు* జనుల మనములెల్ల ఝల్లు మనగ* ప్రీతి తోడ మెచ్చె విఘ్నేశ్వరుడు తాను* గరిక నిచ్చినంత గరిమ నిచ్చు* శ్రీ గణేశునికి చాలా ఇష్టమైన పత్రులలో మొదటిది గరిక అనబడే దూర్వాయుగ్మం . గడ్డి పోచ అని తక్కువ చేసి పలికే వీలు లేకుండా తనకు ఎంతో ఇష్టమైన ద్రవ్యంగా స్వీకరించారు స్వామి . ప్రేమగా గరికను సమర్పిస్తే చాలు కోరిన కోరికలు […]

శ్రీ మహావిష్ణువు అంశతో జన్మించిన “కపిల మహర్షి”

రచన: అంబడిపూడి శ్యామసుందరం రావు   కపిల మహర్షి వేదకాలపు మహాముని మహాభారతములో పేర్కొన్నట్లుగా ఈయన ఏడుగురు బ్రహ్మ మానస పుత్రులలో ఒకడు. ఈయన శ్రీ మహావిష్ణువు అవతారంగా విష్ణు పురాణములో పేర్కొనబడినది. కృత యుగములో కర్దమ ప్రజాపతి అనే మహర్షి సరస్వతి నదీతీరంలో శ్రీ మహావిష్ణువు కోసము పదివేల సంవత్సరాలు తపస్సు చేస్తే శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై “నీకు దేవహూతి అనే భార్య వలన తొమ్మిది మంది కుమార్తెలు పుడతారు ఆ తరువాత నా అంశతో […]