April 25, 2024

మాలిక పత్రిక అక్టోబర్ 2021 సంచికకు స్వాగతం

      పండగ అనగానే సంప్రదాయం , ఉత్సాహం, సంబరం….   పండగ అనగానే కొత్త బట్టలు, పూజలు, పిండివంటలు మాత్రమే కాదు   భారతీయ సంప్రదాయంలో ప్రతీ పండగకు ఒక విశేషమైన అర్ధం పరమార్ధం ఉంటాయి.. కొన్ని హిందూ పండగలు పురాణగాధలకు ప్రతీకలైతే, మరి కొన్ని ప్రకృతికి, పువ్వులకు సంబంధించినవి ఉన్నాయి. అలాంటివాటిలో ప్రముఖమైనది తెలంగాణా ప్రాంత సంస్కృతి, సంప్రదాయాలను, ఆత్మీయానురాగాలను ప్రతిబింభించే బతుకమ్మ పండగ. ఆడపిల్లలకు, వాళ్లని కన్నతల్లులకు ప్రియమైన ఈ బతుకమ్మ కేవలం ఒక […]

ధృతి పార్ట్ – 5

రచన: మణికుమారి గోవిందరాజుల “స్వాతీ! మనం ఇద్దరమూ జీవితాంతం కలిసి సంతోషకరమైన జీవితం గడపాలని ప్రమాణాలు చేసుకుని పెళ్ళి చేసుకున్నాము. చిన్న చిన్న గొడవలూ, అపోహలూ ప్రతి ఇంటా మామూలే. . . సర్దుకుపోతూ ఉంటాము. కానీ పెద్దవాళ్ళను అవమానించడం అనేది కూడని పని. స్వాతీ. . . నువు మంచి భార్యవి. ఖచ్చితంగా మంచి తల్లివి కూడా అవుతావు. కాని మంచి కోడలిగా కూడా ఉంటే కుటుంబం ఆనందంగా ఉంటుంది. మీ అమ్మా నాన్నలు కూడా […]

వెంటాడే కథలు – 1

రచన: చంద్రప్రతాప్ కంతేటి వెంటాడే కథలు! నా వృత్తిలో భాగంగా దేశ దేశాల కథలు, మనదేశానికి చెందిన తెలుగు, తెలుగేతర కథలూ వేలకొద్దీ చదివాను. వాటిలో కొన్ని ఎప్పటికీ మరుపుకు రావు. ఎల్లవేళలా మనసుని వెంటాడుతూనే ఉంటాయి. అవి ఏ భాషలో వచ్చాయో.. రచయితలెవరో, అనువాదకులెవరో గుర్తులేకపోవడం నా దురదృష్టం. అలాంటి కథలు నెలకొకటి చొప్పున నా మాటల్లో క్లుప్తంగా చెబుతాను. పాఠకులెవరైనా ఇది ఫలానా వారి కథ, ఫలానా భాష కథ అని గుర్తుపడితే మరీ […]

మోదుగ పూలు – 3

రచన: సంధ్య యల్లాప్రగడ గేటులోంచి లోపలికి ప్రవేశిస్తున్న వివేక్‌ను కొందరు పిల్లలు చూశారు. అది వాళ్ళకు లంచ్‌ టైంలా ఉన్నది. గోల గోలగా దగ్గరకు వచ్చేశారు. అందరూ “నమస్తే సార్!” అంటూ పలకరింపులు. పెద్ద పిల్లలు దగ్గరకు వచ్చి బ్యాగు, పెట్టె అందుకున్నారు చేతుల నుంచి. “ప్రిన్సిపాల్ దగ్గరకు తీసుకుపోండి!” అన్నాడు వివేక్. ఆ ప్రహరిలోకి ప్రవేశించగానే లోపల పెద్ద మైదానము మధ్యలో ఒక ఎత్తు అరుగు, మధ్యన జెండా స్తంభం ఉన్నాయి. రెండు రెండంతస్థుల భవనాలు […]

తామసి – 12

రచన: మాలతి దేచిరాజు నసీమా, గౌతమ్ పెళ్ళి చేసుకోడానికి నిర్ణయించుకున్న కొన్ని రోజులకి. పెళ్ళి షాపింగ్ చేస్తున్నారు షీబా, నసీమా. “ఇంతకీ అబ్బాయిగారెక్కడ. ?” అడిగింది షీబా. “వస్తున్నాడు ఈ లోపు మనం చూద్దాం. ” అంది నసీమా. చీరలు సెలెక్ట్ చేస్తున్నారు ఇద్దరూ. ఒక చీర ఒంటికి చుట్టుకుని ఎలా ఉంది అనడిగింది నసీమా. “పర్ఫెక్ట్. ” వస్తూనే అన్నాడు గౌతమ్. షీబా తల తిప్పి చూసింది. “హే. గౌతమ్. ” అంది నసీమా. షీబా, […]

చంద్రోదయం – 20

రచన: మన్నెం శారద “ఓహో!! ఆడవాళ్ల వయసడగకూడదనుకుంటాను” అన్నాడు కళ్లెగరేస్తూ. “అబ్బే అందుకోసం కాదు. నా వయసు నా సర్వీస్ రిజిస్టర్ తీస్తే మీకే దొరుకుతుంది. ఇందులో దాచేదేమీ లేదు” అన్నాను. మోహన్ మర్నాడు నవ్వుతూ “మీ వయసు ఇరవై నాలుగేళ్ళు” అన్నాడు. నాకు ఆశ్చర్యం కల్గింది. అతను నేను తమాషాగా అన్నదే చేసి వచ్చేడు. నా సర్వీసు రిజిస్టరు వెరిఫై చేసేడు. “ఇంతకీ మీ వయసెందుకడిగేనో తెలుసా?” నా కళ్లు ఆందోళనతో రెపరెపలాడేయి. “ఇన్నాళ్ల మన […]

అమ్మమ్మ – 29

రచన: గిరిజ పీసపాటి సాధారణంగా ఒకసారి హాస్పిటల్ లో అడ్మిట్ అయితే డిస్చార్జ్ చేసేవరకు పేషెంట్ ని బయటకు పంపరు. కానీ, వసంత డాక్టర్ ని అడిగి, ఆయన ఒప్పుకోకపోతే అలిగి మరీ ఒకరోజు ఇంటికి వచ్చి, తలంటి పోసుకుని, తరువాత శ్రీదేవి – అనిల్ కపూర్ జంటగా నటించిన ‘మిస్టర్ ఇండియా’ సినిమా మేట్నీ షో చూసి, ఆ సాయంత్రం బీచ్ కి వెళ్ళి, తరువాత తిరిగి హాస్పిటల్ కి వెళ్ళింది. గిరిజకు జ్వరం ఒకరోజు […]

సాఫ్ట్‌వేర్ కథలు – 1. మజ్జిగ

రచన: రవీంద్ర కంభంపాటి దీపక్‌కి చాలా విసుగ్గా ఉంది. . గంట నుంచీ తన మేనేజర్ శరత్ క్యాబిన్ ముందు నుంచుని ఉన్నాడు. నిజానికి పదిన్నరకి మీటింగ్. . పదీ ఇరవై ఐదుకే ఆ మీటింగ్ క్యాబిన్ దగ్గరికి వచ్చి నుంచున్నాడు తను. శరత్‌తో ఇదే గొడవ. . మీటింగ్ అని పిలుస్తాడు. . ఆ మీటింగ్‌లో డిస్కస్ చేసే విషయం ఫోన్లో కూడా చెప్పొచ్చు. . కానీ తన క్యాబిన్‌కి పిలిపించుకోవడం, వచ్చాక వెయిట్ చేయించడం […]

తపస్సు – అంటుకున్న అడవి

– రామా చంద్రమౌళి డాక్టర్ పుష్ప ఆ వేసవి కాలపు సాయంత్రం తన ఇంటి బాల్కనీలో కూర్చుని . ఎదుట అస్తమిస్తున్న సూర్యుణ్ణి తదేకంగా చూస్తోంది దాదాపు పది నిముషాలనుండి. ఆమె హృదయం అంటుకున్న అడవిలా . మధ్య మధ్య ఘనీభవించిన మంచు మైదానంలా ఉంది. మనిషి మనోస్థితి ఎప్పటికప్పుడు మారుతూ క్షణ క్షణం. విస్ఫోటిస్తూ, కింది అంతస్తు వాకిట్లోనుండి మొలిచి ఏపుగా ఎదిగిన టేకు చెట్టు తన విశాలమైన పచ్చని ఆకులతో. విస్తరించి. చల్లగా గాలి. […]

కనువిప్పు

రచన: ప్రభావతి పూసపాటి “అన్నయ్య సాయంత్రం వదినని తీసుకొని గుడి కి రా. మీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి ” ఫోన్లో రజని గొంతు కొంచెం కంగారుగానే వినిపించింది. “ఎమ్మా! ఏదైనా ఆందోళన కలిగించే విషయమా? పోనీ ఇంటికి రాకూడదు ” కొంచెం ప్రశాంతంగా వుంటూ అడిగాను. “లేదు అన్నయ్య ఇంట్లో మాట్లాడటానికి కుదరదు.సాయంత్రం ఆఫీస్ అయిపోయాక వదిన ని తీసుకొని డైరెక్టుగా అక్కడికి వచ్చేయి. నేను కూడా రవీందర్ తో కలిసి వస్తాను “అంటూ హడావుడిగా […]