May 19, 2024

మాలిక పత్రిక అక్టోబర్ 2021 సంచికకు స్వాగతం

 

 

 

పండగ అనగానే సంప్రదాయం , ఉత్సాహం, సంబరం….   పండగ అనగానే కొత్త బట్టలు, పూజలు, పిండివంటలు మాత్రమే కాదు   భారతీయ సంప్రదాయంలో ప్రతీ పండగకు ఒక విశేషమైన అర్ధం పరమార్ధం ఉంటాయి.. కొన్ని హిందూ పండగలు పురాణగాధలకు ప్రతీకలైతే, మరి కొన్ని ప్రకృతికి, పువ్వులకు సంబంధించినవి ఉన్నాయి. అలాంటివాటిలో ప్రముఖమైనది తెలంగాణా ప్రాంత సంస్కృతి, సంప్రదాయాలను, ఆత్మీయానురాగాలను ప్రతిబింభించే బతుకమ్మ పండగ. ఆడపిల్లలకు, వాళ్లని కన్నతల్లులకు ప్రియమైన ఈ బతుకమ్మ కేవలం ఒక పండగ మాత్రమే కాదు. మన సంబంధ బాంధవ్యాలను, సంస్కృతిని గుర్తు చేసుకుని తలవంచి నమస్కరించే ఉత్సవం. మహాలయ అమావాస్యనుండి మొదలయ్యే నవరాత్రులలో దుర్గాదేవిని అందంగా తీరైన రంగు రంగుల పూలతో అలంకరించి , పాటలు పాడుతూ ఆడుతూ ఆరాధిస్తారు. ఈ బతుకమ్మ నిండైన బతుకునే కాకుండా గౌరీదేవిగా సౌభాగ్యాన్ని, లక్ష్మీదేవిగా సంపదనూ, సరస్వతీదేవిగా చదువునూ ప్రసాదిస్తుందని స్త్రీల ప్రగాఢ విశ్వాసం.

బతుకమ్మ అంటేనే పూలపండగ. ఈ పండగ వర్షాకాలపు చివరిలో, చలికాలపు తొలి రోజులలో వస్తుంది. ఆ సమయానికి వర్షాలవల్ల వాగులు, చెరువులూ నిండుగా కళకళలాడుతూ ఉంటాయి. ప్రకృతి అంతా పచ్చగా, రంగు రంగుల పూలతో ఆహ్లాకరంగా ఉంటుంది.. ఈ కాలంలో గునుగుపూలు, తంగేడు, బంతి , చామంతి, గోరింట మొదలైన పూలు విరగ కాస్తాయి. అదే విధంగా సీతాఫలాలు కూడా చేతికంది వస్తాయి. ఇలా తమ చుట్టూ ఉన్న పూలను సేకరించి వాటికి అందమైన బతుకమ్మ రూపమిచ్చి ప్రకృతి మాత ఒడిలో ఆడి పాడతారు.

 

మాలిక పాఠకులకు, రచయితలకు, మిత్రులందరికీ రాబోయే పువ్వుల పండుగ బతుకమ్మ, దసరా పండగ శుభాకాంక్షలు. మాలిక పత్రిక మరింతమందికి చేరువవుతూ, కొత్త శీర్షికలతో మీ ముందుకు వచ్చింది..

 

మీ రచనలు పంపవలసిన చిరునామా; maalikapatrika@gmail.com

ఈ అక్టోబర్ మాసపు విశేషాలు:

1. వెంటాడే కథలు – 1

 2.  ధృతి పార్ట్ – 5

 3.  మోదుగ పూలు – 3

 4. తామసి – 12

 5. చంద్రోదయం – 20

 6. అమ్మమ్మ – 29

 7. సాఫ్ట్‌వేర్ కథలు – 1. మజ్జిగ

 8. తపస్సు – అంటుకున్న అడవి

 9. కనువిప్పు

10. నిజాయితీ ఆచరణ

11. సర్వజ్ఞుడు

12. సర్దాలి….సర్దుకోవాలి…

13. భజగోవిందం తెలుగు పాట – 1

14. ధర్మసూత్రాలకు ఆద్యుడు గౌతమ మహర్షి

15. ఔషధ విలువల మొక్కలు – 3

16. కార్టూన్స్ – CSK

17. కార్టూన్స్ – భోగా పురుషోత్తం

18. సుమహార కోశం

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *