Jyothivalaboju Chief Editor and Content Head పాఠక మిత్రులు, రచయిత మిత్రులకందరికీ ఈ సంవత్సరపు ఆఖరు సంచికకు స్వాగతం, సుస్వాగతం.. ఆశ మనిషిని బ్రతికిస్తుంది. ఎన్ని అవాంతరాలెదురైనా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని ఉపద్రవాలు సంభవించినా రాబోయేది మంచి కాలం అనే ఆశ మనందరినీ ముందుగు సాగేలా చేస్తుంది.. సుమారు రెండేళ్లుగా ఒక మహమ్మారిని ఎదుర్కుంటూ కేసులు తగ్గుతున్నాయి గండం తొలగిపోయింది అనుకుంటున్న సమయంలో మరో మహమ్మారి భయం మనని చుట్టేస్తుంది. […]
Day: December 2, 2021
మా చెల్లీ… బంగారుతల్లీ..
రచన: జి.ఎస్. లక్ష్మి “మామ్…నువ్వు మళ్ళీ నా మొబైల్ చెక్ చేసేవా..” రూమ్ లోంచి గట్టిగా అరిచింది నీరజ. టిఫిన్ బాక్స్ లు సద్దుతున్న మాలతి ఒక్కసారి ఉలిక్కిపడింది. “నీదేకాదు చెల్లాయ్.. నాదీ చెక్ చేసింది..” నవ్వుతూ తన రూమ్ లోంచి బైటకొస్తూ అన్నాడు రఘు. “నువ్విలా అస్తమానం నా మొబైల్ చెక్ చేస్తుంటే నేను దీనికి పాస్ కోడ్ పెట్టేసుకుంటాను..” బెదిరిస్తున్నట్టు అంటూ హాల్లో కొచ్చింది నీరజ. “ఆ పని చెయ్యి. అప్పుడు మామ్ […]
సాఫ్ట్‌వేర్ కథలు – 3. . . . దద్దోజనం
రచన: కంభంపాటి రవీంద్ర మొట్టమొదటిసారిగా మా గోపాల్ అంటే భలే ఒళ్ళు మండింది ఆ రోజు ! వాడూ, నేనూ రెండేళ్లుగా ఈ ఎడింబరో లో ఒకే ఫ్లాట్ లో కలిసి ఉంటున్నా, ఎప్పుడూ మా మధ్య గొడవ పడాల్సినంత విషయాలేవీ జరగలేదు. కానీ ఆ రోజు మటుకు భలే కోపం వచ్చేసింది. ఎల్లుండి క్రిస్మస్ అంటే ఇవాళ మధ్యాహ్నం నుంచే ఆఫీసుకి శెలవు. . . హాయిగా ఇంట్లో కూచుందాం అనుకుంటూంటే, ఆ రోజు […]
బాగుందనీ …
రచన: పంతుల ధనలక్ష్మి. అది ఒక పెద్దహాలు. అందరూ హడావుడిగా తిరుగుతున్నారు. కళాశాలలో పదవీ విరమణ మహోత్సవం. ఆ కాలేజీలో సివిక్సు లెక్చరర్. ఆవిడ పాటలు బాగా పాడుతుంది. వారంలో కొత్తగా చేసిన వంటలు బాక్సులో స్పెషల్ గా సరదాగా లంచ్ టైమ్ లో అందరికీ పెడుతుంది. ఆవిడ అసలు పేరు వదిలేసి అందరూ ” అన్నపూర్ణ గారు రాలేదా? వచ్చేరా?” అనేవారు. ఇవాళ ఆవిడ రిటైర్మెంట్. అందరికీ ఆవిడే లంచ్ పెట్టింది. సాయంత్రం […]
తమాషా అనుభవం
రచన: రాజ్యలక్ష్మి బి ఉదయం 8:00 అయింది మాలతి జుట్టు ఆరబెట్టుకుంటున్నది. మాలతి మరింత అందంగా వయ్యారంగా కూర్చుని పాటలు వింటూ తనలో తానే నవ్వుకున్నది. ఆ నవ్వు లో తన పతి దేవుడు రఘు దరహాసం కలిసింది తెల్లవారుజామున ఆఫీసుకు పనిమీద క్యాంపు వెళ్లిన రఘు రాత్రికి రానని తోచకపోతే ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళమన్నాడు. మాలతికి గత సంవత్సరం లోకి ఆలోచనలు వెళ్లిపోయాయి తను డిగ్రీ ఫైనల్ వుండగా రఘుతో పెళ్లి జరిగింది […]
దేవీ భాగవతం – 5
రచన: వోలేటి స్వరాజ్యలక్ష్మి చతుర్థ స్కంధము 13వ కథ నర నారాయణుల పుట్టుక ధర్ముడు బ్రహ్మపుత్రుడు. బ్రహ్మ హృదయమునుండి పుట్టిన వాడు. సత్య ధర్మ పరిపాలకుడు. దక్షప్రజాపతియొక్క10 మంది కన్యలను అతడు వివాహమాడెను. ఎందరో సంతానము కలిగిరి. హరి, కృష్ణుడు, నరుడు, నారాయణులను వారు ఉండిరి. హరి, కృష్ణుడు నిరంతరము యోగాభ్యాసము సల్పుచుండిరి. నర నారాయణులు హిమాలయములు చేరి బదరికాశ్రమము వద్ద పవిత్రస్థానమున తపమాచరించిరి. అట్లు వెయ్యి యేళ్ళు తపస్సుచేసిరి. వారి తేజస్సుతో జగమంతా […]
మోదుగ పూలు .. 5
రచన: సంధ్యా యల్లాప్రగడ సోమవారం సాయంత్రం స్కూలు అయ్యాక వివేక్ నెమ్మదిగా వెతుకుతూ చంద్రయ్య దగ్గరకు వెళ్ళాడు. “తాతా! నీతో మాట్లాడాలి. నీకు టైం ఉన్నప్పుడు నా రూముకు రాగలవా?” అడిగాడు మృదువుగా. “సరే సార్!” చెప్పాడు చంద్రయ్యతాత. వివేక్ మరుసటి రోజు లెసన్స్ చూసుకోవటానికి వెళ్ళిపోయాడు. గంట తరువాత తాత వచ్చి తలుపు కొట్టాడు. వివేక్ తలుపు తీసి తాతను ఆదరంగా ఆహ్వానించాడు. “తాతా! కూర్చో” బల్లను చూపాడు. చంద్రయ్యతాత కూర్చున్నాడు. “చెప్పు సార్ ఏం […]
తపస్సు – దిగడానికి కూడా మెట్లు కావాలి
రచన: రామా చంద్రమౌళి రాత్రి పదీ నలభై నిముషాలు. డిల్లీ రైల్వే ప్లాట్ ఫాం నంబర్ పన్నెండు. అటు చివర. ఎప్పటిదో. పాతది. దొడ్డు సిమెంట్ మొగురాలతో. సిమెంట్ పలకతో చేసిన బోర్డ్. పైన పసుపు పచ్చని పెయింట్ మీద నల్లని అక్షరాలు. ‘నయీ ఢిల్లీ ‘. పైన గుడ్డి వెలుగు. కొంచెం చీకటికూడా. వెలుతురు నీటిజలలా జారుతుందా. కారుతుందా. చిట్లుతుందా. ప్రవహిస్తుందా. వెలుతురుపై. కురుస్తూ. వెలుతురును కౌగలించుకుంటూ. . సన్నగా. మంచుతెర. పైగా పల్చగా చీకటి […]
ధృతి – 7
రచన: మణి గోవిందరాజుల “రంగా! అడ్రెస్ షేర్ చెయ్యవే… మేము రడీగా ఉన్నాము. మీ ఇంటికే బ్రేక్ ఫాస్ట్ కి వస్తున్నాము. నిన్న నీ మనవరాలిని చూసినప్పటినుండీ నా మనసంతా అమ్మాయి మీదే ఉన్నది. ఏమైనా సరే ఆ సంగతి తేల్చుకోవడానికే వస్తున్నాను, నా మనవడిని తీసుకుని…” అవతలనుండి పెద్దగా వినపడ్డ మాటలకు మత్తు పూర్తిగా వదిలింది. టైము చూస్తే ఇంకా ఆరు కూడా కాలేదు. “ఒసే! సువ్వీ… బుద్ది ఉందటే? పొద్దున్నే తయారయ్యావు? కాస్తాగు. నేను […]
చంద్రోదయం 22
రచన: మన్నెం శారద “అయితే మీ ఆవిణ్ని తీసుకొచ్చే ప్రయత్నం యిప్పుడప్పుడే లేదంటావు” అని అపరిచితమైన కంఠం. “ఆవిడ నేనడిని కట్నం పూర్తిగా తీసుకొస్తేనే నా గడప తొక్కేది. అంతవరకూ రానిచ్చే ప్రసక్తి లేనే లేదు” అది మోహన్ కంఠం. “చాలా అన్యాయంరా!” మోహన్ గట్టిగా నవ్వేడు. “ఏది అన్యాయం. ఇస్తానన్న కట్నం ఎగ్గొట్టి పిల్లని నా గొంతుకి కట్టి పంపటమా?” “పాపం. ఆయన సర్దుకోలేకపోయేడు. మధ్యలో ఆ అమ్మాయి ఏం చేస్తుంది” “ఆడపుటక పుట్టినందుకు అనుభవిస్తుంది” […]
ఇటీవలి వ్యాఖ్యలు