March 28, 2024

అమ్మమ్మ – 30

రచన: గిరిజ పీసపాటి బిఎడి లో మంచి రాంక్ రావడంతో “టీచర్ ట్రైనింగ్ కోసం విజయనగరం వెళ్ళి జాయిన్ అవనా?!” అని నాగ అడగగానే “ఇక్కడ నన్ను, పిల్లల్ని వదిలేసి నువ్వు విజయనగరం వెళిపోతే ఎలా?” అంటూ ఎదురు ప్రశ్న వేసాడు పెదబాబు. “సీజన్ పాస్ తీసుకుని, రోజూ ఉదయం వెళ్ళి, సాయంత్రానికల్లా వచ్చేస్తానండీ. ఎలాగూ వసంత, గిరిజ ఉదయం ఏడు గంటలకే కాలేజ్ కి వెళిపోతున్నారు. మీరు నాని కూడా తొమ్మిది గంటలకల్లా వెళిపోతారు.” “మీరందరూ […]

వెంటాడే కథలు – 3 .. పెళ్లి విందు

రచన: చంద్రప్రతాప్ కంతేటి వెంటాడే కథలు! నా వృత్తిలో భాగంగా దేశ దేశాల కథలు, మనదేశానికి చెందిన తెలుగు, తెలుగేతర కథలూ వేలకొద్దీ చదివాను. వాటిలో కొన్ని ఎప్పటికీ మరుపుకు రావు. ఎల్లవేళలా మనసుని వెంటాడుతూనే ఉంటాయి. అవి ఏ భాషలో వచ్చాయో.. రచయితలెవరో, అనువాదకులెవరో గుర్తులేకపోవడం నా దురదృష్టం. అలాంటి కథలు నెలకొకటి చొప్పున నా మాటల్లో క్లుప్తంగా చెబుతాను. పాఠకులెవరైనా ఇది ఫలానా వారి కథ, ఫలానా భాష కథ అని గుర్తుపడితే మరీ […]

ముక్తిక్షేత్రంలో ముక్తిక్షేత్రం

‘ముక్తిక్షేత్రంతో ముక్తిక్షేత్రం’ రచన: రమా శాండిల్య ఈ మధ్య నేను ‘ముక్తిక్షేత్రము’ అనే పుస్తకం నా కాశీయాత్రల గురించి వ్రాసాను. ఆ పుస్తకాన్ని కాశీవిశ్వనాథుడి సన్నిధిలో ఒక్కసారి పెట్టి రావాలనే సంకల్పం కలిగింది. నా మనసులోని మాటను గ్రహించినట్లు నా దగ్గర యోగా నేర్చుకుంటున్న నా శిష్యురాలు ఒకరోజు ప్రొద్దున్నే ఫోన్ చేసింది. “అమ్మా! నాకు కాశీ చూడాలని ఉంది. అది కూడా మీతో కలిసి చూడాలనుకుంటున్నాను. మీకు వీలవుతుందంటే కార్తీకపౌర్ణమికి కాశీలో ఉండేలా ప్లాన్ చేసుకుందాము.” […]

ఔషధ విలువల మొక్కలు – 5

రచన: నాగమంజరి గుమ్మా       . *జాజి పత్రం* కనులకు చలువను గూర్చుచు* మనముల హాయి కురిపించు మధు వీచికలన్* సన సన్నగ జాల్వార్చెడి* వినాయకుని పూజ పత్రి విను జాజి యిదే* జాజి పత్రి శ్రీ గణేశుని పూజా పత్రులలో ఒకటి. ఆకులు, పూవులు కూడా కళ్ళకు చలువను కూర్చుతాయి. ఆకులను నూరి కళ్ళు మూసికొని పై రెప్పలపై కాసేపు ఉంచినా, పువ్వులను యధాతధంగా కంటి రెప్పలపై పరచినా క్షణాల్లో అలసిన కనులు […]

బహువిధ యజ్ఞకర్త “శౌనక మహర్షి”

రచన: శ్యామసుందర రావు పూర్వము విజ్ఞాన ఖని తపస్సంపన్నుడు అయినా శునక మహర్షి ఉండేవాడు అయన కుమారుడే శౌనక మహర్షి ఈయన పేరు చెప్పగానే గుర్తుకు వచ్చేది నైమిశారణ్యము తండ్రి దగ్గర సకల యజ్ఞ నిర్వహణా సామర్థ్యము, వేద వేదాంగములు, నియమ నిష్టాగరిష్టుడై నేర్చుకొని తల్లిదండ్రుల అనుమతితో నిర్జన ప్రదేశము కొరకు బయలు దేరి, చివరకు నైమిశారణ్యము చేరుకొన్నాడు. ఇంక ముందుకు వెళ్ళలేక, ఆక్కడే స్థిర నివాసము ఏర్పరుచుకొని, అనేక మంది ముని పుంగవులని శిష్యులుగా చేసుకొని, […]

మనిషి ఎదుట మాట్లాడితే…

రచన: కంచరాన భుజంగరావు కొమ్మలపైనుండి లేచినప్పుడు రెక్కలున్న పచ్చనాకుల్లా అనిపిస్తాయి దొండపండులాంటి ముక్కులుండబట్టి సరిపోయింది లేకుంటే, ఆకుల్లో ఆకుల్లా ఉన్న వీటి ఆనవాలు పట్టుకోవడం కూడా కష్టమయ్యేది వీటి చురుకైన మొహంలో ఎన్నెన్ని చలాకీ నవ్వులాటలో! ముక్కూ ముక్కూ రాసుకుని మురిపెంగా సిగ్గుపడినప్పుడూ… దోరజామకాయలతో ఇష్టంగా ఎంగిలి పడినప్పుడూ… వీటి ఎరుపు ముక్కు మురిపెం మరింత పలకమారుతుంది! మెడచుట్టూ బంగారు తొడుగులా అమరిన రింగుతో రాజకుటుంబీకుల్లా ఉంటాయి దివ్యమైన తేజస్సు వర్చస్సుతో పచ్చని ఈకల పసిమి కొమ్మల్లా […]