February 5, 2023

సూర్యోదయం

రచన : యం. ధరిత్రీ దేవి పార్కులో హుషారుగా నడుస్తున్న వాడల్లా ఠక్కున ఆగిపోయారు రాఘవ రావు గారు, కాస్త దూరంలో ఓ సిమెంటు బెంచీ మీద కూర్చున్న దయానంద్ గారిని చూసి. మెల్లిగా అటువైపు అడుగులు వేశారాయన. దాదాపు కొన్ని నెలలయి ఉంటుంది ఆయన్ని చూసి. మనిషి బాగా నీరసించిపోయారు. ముఖంలో ఏదో చెప్పలేని దిగులు స్పష్టంగా కనిపిస్తోంది. రాఘవరావు గారు, దయానంద్ గారు ఇద్దరూ కాలేజీ ప్రిన్సిపాల్స్ గా చేసి రెణ్ణెళ్ల తేడాతో పదవీ […]

కలహాంతరిత.

రచన: పంతుల ధనలక్ష్మి గోపీ ఆఫీసునుండి ఇంటికి వచ్చేడు. ఆ రోజు బస్సు ల వాళ్ళు ఆటోవాళ్ళు ఏదో ఏక్సిడెంట్ విషయంలో కొట్టుకుని పంతం తో ఇరువురూ స్ట్రైక్ చేసి తిరగటం మానేశారు. పదిహేను కిలోమీటర్ల దూరం నడిచి ఇంటికి చేరేడు. ఉసూరుమని కూర్చుని “రాధా! కొంచెం కాఫీ ఇస్తావా?’ అని అడిగేడు. “ఎందుకివ్వనూ? అదేదో ఎప్పుడూ ఇవ్వనట్టు! ఆ!” అంది. “ఇవాళ సినిమా ప్రోగ్రాం అన్నారు?” దీర్ఘం తీసింది రాధ. ఓ చూపు చూసి ఊరుకున్నాడు. […]

పాపం నీరజ!

రచన: రాజ్యలక్ష్మి బి నీరజకు యీ మధ్య భర్త రాజారాం పైన అనుమానం వస్తున్నది. “ఆఫీసు 5 కల్లా అయిపోతుంది కదా? మీరు రాత్రి 11 అయినా ఇంటికి చేరరు? “ఒకరోజు నీరజ భర్తను నిలదీసింది.” మా ఆఫీసర్ కి నేనంటే నమ్మకం, నమ్మకమైన ఫైళ్లు నాచేత చేయిస్తాడు, అనో “స్నేహితులు పట్టుబట్టి సినిమాకు లాక్కుపోయారు “అనో రోజూ ఏదో ఒక అల్లుతాడు రాజారాం ! ఒక్కొక్కరాత్రి మెలకువ వచ్చి చూస్తే నీరజకు పక్కమీద కనపడడు ! […]

తల్లి మనసు

రచన: G.S.S. కళ్యాణి. ఉదయం ఏడుగంటల ప్రాంతంలో, తమ వరండాలోని పడక్కుర్చీలో కూర్చుని ఆ రోజు దినపత్రికను తిరగేస్తూ, తన పక్కనే బల్లపైనున్న కాఫీ కప్పును తీసుకుని ఒక గుటక వేసిన రమాపతి, చిరాగ్గా మొహంపెట్టి, “ఒసేయ్ శ్రీకళా! ఓసారి ఇలా రావే!!”, అంటూ తన భార్య శ్రీకళను కోపంగా పిలిచాడు. భర్త అరుపుకు భయపడి, చేతిలో ఉన్న పనిని వదిలేసి పరిగెత్తుకుంటూ వరండాలోకి వచ్చి, “ఏంటండీ? ఏమైందీ??’ అని రమాపతిని కంగారుగా అడిగింది శ్రీకళ. “ఇంత […]

తీరిన కోరిక..

రచన: షమీర్ జానకీదేవి కీర్తనకు చిన్నప్పుడు సైకిల్ నేర్చుకోవాలనే కోరిక చాలా బలంగా ఉండేది. ఎందుకో తెలియదు. తన క్లాస్మేట్ రమ్య, తను ఇద్దరు చాలా క్లోజ్ గా ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరు ఇరుగు పొరుగున వుండేవారు. తనకు తమ పెద్ద మామయ్యంటే చాలా భయం. ఆయనను చూడగానే అందరు కనపడకుండా ప్రక్కకు వెళ్ళేవాళ్ళు. ఒక రోజు ఆ మామయ్య బయటికి వెళ్ళిన తర్వాత కీర్తన, రమ్య ఇద్దరు కలిసి సైకిల్ తెప్పించుకుని ప్రాక్టీస్ చేయాలని అనుకున్నారు. వారికి […]

దేవీ భాగవతం – 6

5 వ స్కంధము, 17వ కథ శుంభ నిశుంభ వృత్తాంతము దేవీ భగవతి యొక్క చరిత్రలు అతి ఉత్తమములు. ఆ కథలు సకల ప్రాణులకు సుఖమున యిచ్చెడివి. సకల పాపములు రూపుమాపును. పూర్వము శుంభుడు, నిశుంభుడు అను దానవ అన్నదమ్ములు ఉండెడివారు. మహాబలశాలురు. వారు బ్రహ్మను గూర్చి తపమును చేసి పది సంవత్సరములు యోగసాధనా నిరతులైరి. వారి తపస్సును మెచ్చిన బ్రహ్మ ప్రత్యక్షమై వరమును కోరుకోమనగా వారు అమరమునకై అర్ధించిరి. ఎవరి చేతను చావు లేకుండా ఉండాలని […]

వేదకర్త “జమదగ్నిమహర్షి”

రచన: శ్యామ సుందరరావు భృగు వంశానికి చెందిన ఋచీకుడు అనే మహర్షి వివాహము చేసుకోవాలనే తలంపుతో కుశ వంశానికి చెందిన గాది మహారాజు దగ్గరకు వెళ్లి అయన కూతురు సత్యవతిని ఇచ్చి వివాహము చేయమని అడుగుతాడు రాజు. నున్నటి శరీరము, నల్లటి చెవులు ఉండే వెయ్యి ఆశ్వాలను ఇమ్మని కోరతాడు. అప్పుడు ఋచీకుడు వరుణుని ప్రార్ధించి వెయ్యి అశ్వాలను పొంది గాది మహారాజుకు ఇచ్చి సత్యవతిని పెళ్లాడుతాడు. వివాహము చేసుకున్నాక సత్యవతి తనకు ,తన తల్లికి పుత్ర […]

వనితా!

రచన: ఉమా పోచంపల్లి గోపరాజు ప॥ మరుమల్లెల తావిలా మందారం పూవులా నీవిలాగే ఇలాగే ఇంపుగా, సొంపుగా వికసిస్తూ, విరబూయుమా 1వ చ॥ పదములే పృథివిపైన మెత్తనైన అడుగులై సాగనీ పలుకులే రామచిలుక పలుకులై మాధుర్యములొలకనీ! 2వ చ॥ అడుగులే నడకలలో నాట్యమయూరిగా చూపులే శరత్జ్యోత్స్న కాంతికిరణ చంద్రికయై కనుపాపలోని కాంతివై 3వ చ॥ ఉరకలతో పరుగులతో చదువులలో ప్రఖ్యాతివై ఆటలలో పాటలలో అభ్యున్నతి నొందుమా 4వ చ॥ జగములనెల్లా జయించు లోకాలకు మేటివై మేలొనరెడు నేతవై […]