June 24, 2024

మాలిక పత్రిక ఫిబ్రవరి 2022 సంచికకు స్వాగతం

పాఠక, రచయిత మిత్రులకు మాలిక ఫిబ్రవరి సంచికకు స్వాగతం సుస్వాగతం.. దాదాపు పదకొండేళ్లుగా మీ సహకారంతో మాలిక పత్రిక అందరినీ అలరించే అంశాలతో  అంతర్జాలంలో ప్రచురించబడుతోంది.  గత రెండేళ్లుగా సంతోషం, బాధ కలగలుపు జీవితం అందరిదీ.. అయినా జీవనప్రయాణం ఆగదు. సాగక తప్పదు కదా.. ఒక్కరొక్కరుగా మనలని వీడి వెళ్లిపోతున్న పెద్దవారందరికీ సాదర ప్రణామాలు తప్ప ఏమి చేయగలం.. వారు చెప్పిన పాఠాలను గుర్తుచేసుకుంటూ సాగిపోవాలి. ఈ మాసపు సంచికలో మీకోసం ఎన్నో కవితలు, కథలు, వ్యాసాలు, […]

*శ్రీగణేశ చరిత్ర*

రచన: నాగమంజరి గుమ్మా 17 వ పద్యం నేటి మొదలు నీ పేరున మేటిగ తొలిపూజచేసి మేలునుపొందున్ కోటీజనులు తమ పనులను, సాటిగ రారెవ్వరనుచు సాంబశివుడనెన్ భావం: పునర్జీవితుడైన బాలుని చూచి, పార్వతీదేవితో కూడిన శివుడు (సా అంబ శివుడు), “గజముఖుడు, గజాననుడు అనే పేర్లు కలిగిన నీకు జనులందరూ తమ కార్యముల కొరకు తొలి పూజలు అందజేస్తారు. ఈ విషయంలో మరెవ్వరూ నీకు సాటిగా రాబోరు. వారికి తగిన మేలు చేకూర్చుము” అని దీవించెను. 18 […]

పరవశానికి పాత(ర) కథలు – 1 – గూడు విడిచిన గుండె

రచన: డాక్టర్ కె.వివేకానందమూర్తి (U.K) ఇది కథో, వ్యథో కచ్చితంగా చెప్పలేను. లండన్ హీత్రో ఎయిర్ పోర్ట్ ఎప్పటిలాగే ఎంతో బిజీగా వుంది. పెద్ద పెద్ద అద్దాలకు అవతల రన్ వే మీద అనుక్షణం యెగిరి, వాలే విమానాలతో, గుంపులు గుంపులుగా సేద దీర్చుకుంటున్న జంబో జెట్లతో జటాయువుల సంతలా వుంది. మా అవిడా, పిల్లలు ఇండియా వెళ్లే ఫ్లైట్ ఎక్కారు. వాళ్లకి కనిపించదని తెలిసినా చెయ్యూపి నేను ఒంటరిగా యింటికి కదిలాను. కదిలో కార్లోంచి ఆకాశం […]

సాఫ్ట్‌వేర్ కధలు – తిరగమోత

రచన: కంభంపాటి రవీంద్ర ఏంటో మూడేళ్ళ నుంచీ అదే కంపెనీలో పనిచేస్తున్నా, ఆ రోజు మటుకు రామరాజుకి చాలా కొత్తగా ఉంది. అసలు ఇంతకాలం తను పనిచేసింది ఈ కంపెనీ లోనేనా అనిపించింది కూడా. అంత వింతగా ఉందా ప్రాజెక్ట్ వాతావరణం అతనికి ! టీంలో అందరూ ప్రాజెక్ట్ మేనేజర్ అంటే భయపడి చస్తున్నారు. ఫ్లోర్ లో ఎక్కడా ఓ నవ్వు లేదు, టీమ్ అందరూ కాస్త గట్టిగా మాట్లాడ్డానికే భయపడిపోతున్నారు. ఆ ప్రాజెక్ట్ లో జాయిన్ […]

వెంటాడే కథలు -5 , మాయా మకరి!

పునరుల్లేఖనం : చంద్రప్రతాప్ కంతేటి నా వృత్తిలో భాగంగా దేశదేశాల కథలు, మనదేశానికి చెందిన తెలుగు, తెలుగేతర కథలూ వేలకొద్దీ చదివాను. వాటిలో కొన్ని ఎప్పటికీ మరుపుకు రావు. ఎల్లవేళలా మనసుని వెంటాడుతూనే ఉంటాయి. అవి ఏ భాషలో వచ్చాయో.. రచయితలెవరో, అనువాదకులెవరో గుర్తులేకపోవడం నా దురదృష్టం. అలాంటి కథలు నెలకొకటి చొప్పున నా మాటల్లో క్లుప్తంగా చెబుతాను. పాఠకులెవరైనా ఇది ఫలానా వారి కథ, ఫలానా భాష కథ అని గుర్తుపడితే మరీ సంతోషం. ఆ […]

తాత్పర్యం – దుఃఖలిపి

రచన: రామా చంద్రమౌళి రాత్రి. ఒంటిగంట దాటిఉంటుందా. ?. . అనుకున్నాడు సర్కిల్ ఇన్ స్పెక్టర్ నరహరి. అప్పుడతను. తన పోలీస్ స్టేషన్లో. తన ప్రత్యేక గదిలో. సోఫాలో. వెనక్కివాలి. నెత్తిపైనున్న టోపీని ముఖంపైకి లాక్కుని. కప్పుకుని. కళ్ళు మూసుకుని. ఒకరకమైన జ్వలితజాగ్రదావస్థలో ఉన్నాడు. మనసు. ఆత్మ. కణకణలాడుతున్న నిప్పుకణికలా ఉన్నాయి. శరీరం గడ్దకట్టిన మంచుగడ్డలా ఉంది. మంచుగడ్డలో. నిప్పు కణిక. నిప్పుకణిక పైన. చుట్టూ. ఆవరించి. కప్పేసి. కబళించి. మంచుకడ్డ. మంచు పొరా. తెరా కాదు. […]

నారాయణుని సేవలో…

రచన: మధుపత్ర శైలజ ఎప్పటినుండో లలితమ్మగారు బదరీనాధుణ్ణి చూడాలని కలలు కంటున్నారు. భర్త జీవించిన కాలంలో ఒక్కసారన్నా వెళ్ళాలని ఎంతగానో ప్రయత్నించారు కానీ పరిస్థితులు అనుకూల పడలేదు. “రామలక్ష్మణుల్లాంటి ఇద్దరు కొడుకులుండగా నీకేం బాధ తల్లీ! నీవు తప్పకుండా ఆ వైకుంఠవాసుని చూసి తీరతావు” అని బంధువులంతా అంటూండేవారు. అదిగో ఆమె కోరిక తీరబోయే రోజు రానే వచ్చింది. కొడుకులిద్దరు బాంక్ ఉద్యోగస్తులు కావటంతో ముందుగా ఆ యాత్రకు కావలసిన ప్రయాణ సౌకర్యాలన్నిటిని సమకూర్చుకున్నారు. ఏడుపదులు దాటిన […]

అష్టవిధ నాయికల కథలు – వాసకసజ్జిక.

రచన: ధనలక్ష్మి పంతుల రఘురామ్ ఊరెళ్ళి వారం దాటింది. ఇంకా రాలేదు. ఇందాక ఫోను చేసాడు. “రాత్రి ఎనిమిది అవుతుంది” అని. అంటే వంట చేసి వుంచాలి. ఎప్పుడు భోంచేసారో!?” ఆనుకుని ” అమ్మో ! సాయంత్రం నాలుగయ్యింది” ఆనుకొని గబగబా మొదలెట్టింది వంట. రఘురామ్ కి కుక్కరులో వండితే ఇష్టం వుండదు. అందుకే కోలగా దుక్కగా ఉన్న ఇత్తడి గిన్నె ( బూసిగిన్ని) అనేవాళ్ళు. అందులో బియ్యం కడిగి అత్తెసరుకి పెట్టింది. సిమ్ లో పెడితే […]

మోదుగపూలు – 7

రచన: సంధ్యా యల్లాప్రగడ మళ్ళీ రాముని కలవటానికి వెంటనే సమయం చిక్కలేదు వివేక్‌కి. స్కూలు పనుల వలన, పిల్లలకు పరీక్షలు వస్తున్నందునా. అతను ఉట్నూరు వెళ్ళాల్సి వచ్చింది. స్కూల్లో క్లాసులు అయ్యాక అతనూ మరో టీచరు కలిసి వెళ్ళి స్కూలు పని చూసుకు వచ్చేసరికే చాలా రాత్రి అవటం, ఇలా వరుసగా రెండు రోజులు జరిగింది. చంద్రయ్య తాత వచ్చి చెప్పాడు “సార్! నీ కోసము రాముడు వచ్చి పోయాడు”. అని ‘అయ్యో!’ అనుకున్నాడు వివేక్. పని […]

పరిహారం..

రచన: షామీరు జానకీదేవి రమణి స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాదు, ఒక గ్రామీణ శాఖలో పని చేస్తున్నది. ఆ బ్రాంచి అంతకు ముందు పట్టణానికి దూరంగా వుండేది. గ్రామీణ ప్రాంత ప్రజలకు సహయకారిగా వుంటుందని ఈ బ్రాంచిని ఆ ప్రాంతంలో ప్రారంభించారు బ్యాంకధికారులు. నక్సల్స్ కార్యక్రమాలు ముమ్మరంగా జరుగుతున్న ప్రాంతమది. ఎన్నో ఒడుదుడుకులతో అక్కడ బ్రాంచి మేనేజర్లుగా పనిచేసిన వాళ్ళు తమ ప్రాణాలను అర చేతుల్లో పెట్టుకుని, ఏదో విధంగా, రూరల్ సర్వీస్ (రెండు సంవత్సరాలు అతి […]