March 29, 2024

ఓ మనిషీ !

రచన: ధరిత్రి దేవి

ఓ మనిషీ !
సమస్యల సుడిగుండాలెన్ని ముంచెత్తినా
ప్రకృతి గర్జించి ప్రళయంతో వెల్లువెత్తినా
ఎన్ని’కరోనా ‘లొచ్చి కన్నీటి కడగండ్లు చుట్టుముట్టినా
సాగుతున్నావు అదరక బెదరక అడుగేస్తూ కొనసాగిస్తున్నావు జీవనయానం మున్ముందుకు!
ఆటుపోట్ల తాకిడికి వెరవనంటావు
అవాంతరాలను లెక్కచేయనంటావు
ఆశా జీవిని నేనంటావు!
మిన్ను విరిగి మీదపడ్డా ఆత్మస్థైర్యం కోల్పోనంటావు ! అదే కదా మరి,
నీ తిరుగులేని ఆయుధం!
ఏది ఏమైనా, ఆగదుగా కాలగమనం!
అదో నిరంతర ప్రవాహం!
కదుల్తూ కదుల్తూ తెచ్చింది తనతో
కొత్త సంవత్సరం!!
“సంవత్సరాలెన్ని మారినా
మనుషులం మనమేగా !
సంక్రాంతులు మరెన్నొచ్చినా
సమస్యలు మామూలేగా !
అయితేనేమి గాక !అవన్నీ వచ్చిపోయే చుట్టాలనుకుందాం !”
అంటూ స్ఫూర్తి పొందుతావు
నీకు నీవే సాటి అనిపించుకుంటావు !
ఓ మనిషీ !నిజం !
ఆత్మస్థైర్యమే నీ తిరుగులేని ఆయుధం!
అది ఉన్నంతవరకు నీకు లేదు అపజయం !!

*************

1 thought on “ఓ మనిషీ !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *