April 20, 2024

అమ్మమ్మ – 32

రచన: గిరిజ పీసపాటి “నేను కూడా ఈ పూట వెళ్ళను పాపా! నా మనసేం బాగోలేదు” అన్న తల్లితో “నువ్వు మనసు బాగోలేదని మానెయ్యడానికి నీది మామూలు ఉద్యోగం కాదమ్మా! నిన్ను నమ్మి కుష్ట (కృష్ణ) మామ అప్పజెప్పిన బాధ్యత. నువ్వు వెళ్ళకపోతే ఎలా?” అంటూ తల్లిని బలవంతంగా షాప్ కి పంపింది. మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చిన నాగ “నాన్నకి కేరియర్ పంపావా!?” అనడిగింది వసంతను. “తమ్ముడు తిని, ఇప్పుడే తీసుకెళ్ళాడు. నువ్వు కూడా తినేసి […]

చంద్రోదయం – 24

రచన: మన్నెం శారద శేఖర్ కిందపడి మెలికలు తిరిగిపోతున్నాడు. సారథి అతన్ని పట్టుకోలేకపోతున్నాడు. శేఖర్ నోటినుండి నురగ వస్తోంది. వసుధ సుహాసిని శేఖర్ చేతులు గట్టిగా అదిమి పట్టుకున్నారు. స్వాతి మ్రాన్స్పడిపోతున్నట్లు చూసింది. ఆమెకేం చేయాల్సింది. . ఏం జరుగుతున్నదీ అర్ధం కాలేదు. ఆమె గుండె బలహీనంగా కొట్టుకొంటోంది. సారథి కేక వేసేసరికి క్రిందనించి నలుగురు యువకులు వచ్చారు. అందరూ శేఖర్‌ని అదిమిపట్టి క్రిందకు దింపి రిక్షాలో హాస్పిటల్‌కి తీసికెళ్ళేరు. అంతవరకూ నవ్వుకొంటున్న ఇల్లు ఒక్కసారి కళావిహీనమపోయింది. […]

దేవీ భాగవతం – 7

రచన: వోలేటి స్వరాజ్యలక్ష్మి 6వ స్కంధము 20వ కథ నహుషుని వృత్తాంతము వృత్రాసురుని వధ అనంతరము ఇంద్రుడు అమరావతి చేరెను. దేవతలందరు ఇంద్రుని నీచకార్యములు దూషించసాగిరి. త్వష్ట కుమారుని మరణవార్త విని దుఃఖించెను. కుమారునికి అంత్యక్రియలొనర్చి ‘‘ఇంద్రుడు భయంకర దుఃఖ మనుభవించుగాక! ఇది బ్రహ్మ రేఖ!’’ అని శాపమొసగి సుమేరు శిఖరము మీదకు వెళ్ళి తపమాచరించసాగెను. ప్రతి ఒక్కరు తాము చేసిన పాప, పుణ్యకార్యములకు తప్పక ఫలమనుభవించెదరు. ఇంద్రుని తేజస్సు క్షీణించసాగెను. దేవతలందరూ అతనిని నిందించుచుండిరి. ఇంద్రద్యుమ్నుడు, […]

నల్ల పన్ను

రచన: ఎ.బి.వి. నాగేశ్వరరావు ఉప్పు మీద పన్నా! తెల్లవారికిదేమి తెగువ !! అనుకొంటిరి, ఆందోళితులైరి ఆనాడు మనవారు. దోపిడీ అనీ, దమన నీతనీ, ఆవేశపడి ఆగ్రహించిరి, ఏకతాటిన ఉద్యమించిరి మరి, మనవారు ఆనాడు. నీటి పై పన్ను, పాలపై పన్ను, పండ్లపై పన్ను, రోగమున తిను రొట్టె ముక్కకు పన్ను, ఔషధములపై పన్ను, వైద్య సేవలకు పన్ను, ఉసురు నిలిపే వస్తు పరికరాలపై పన్ను, విధి వక్రిస్తుంటే ఎక్కించే ప్రాణ వాయువుపై పన్ను, భద్రత పేరిట పన్ను, […]

మునికుల చూడామణి “కణ్వ మహర్షి”

రచన: శ్యామ సుందరరావు కణ్వుడు కశ్య ప్రజాపతి వారసుడైన అంగీరసుని వంశంలో ఘోరుడు అనే ఋషికి జన్మించాడు ఈయనను “మునికుల చూడామణి”అని అంటారు అంటే మునులలోకెల్లా శ్రేష్ఠుడు అని అర్ధం. ఈయన బాల్యము నుండి తపోనిష్ఠలో ఉండి బ్రహ్మచారిగా ఉండిపోయాడు కణ్వుడు మహా నిష్ఠాగరిష్ఠుడు. గొప్ప తపస్సంపన్నుడు అతను మన వేదాలలో పెక్కు మంత్రాలకు ద్రష్టగా నిలిచారన్న విషయంలో మాత్రం ఎలాంటి వివాదమూ లేదు. రుగ్వేదంలో కణ్వుడి పేరిట చాలా మంత్రాలే ఉన్నాయి. కణ్వుడు, అతని వంశజులు […]

ఓ మనిషీ !

రచన: ధరిత్రి దేవి ఓ మనిషీ ! సమస్యల సుడిగుండాలెన్ని ముంచెత్తినా ప్రకృతి గర్జించి ప్రళయంతో వెల్లువెత్తినా ఎన్ని’కరోనా ‘లొచ్చి కన్నీటి కడగండ్లు చుట్టుముట్టినా సాగుతున్నావు అదరక బెదరక అడుగేస్తూ కొనసాగిస్తున్నావు జీవనయానం మున్ముందుకు! ఆటుపోట్ల తాకిడికి వెరవనంటావు అవాంతరాలను లెక్కచేయనంటావు ఆశా జీవిని నేనంటావు! మిన్ను విరిగి మీదపడ్డా ఆత్మస్థైర్యం కోల్పోనంటావు ! అదే కదా మరి, నీ తిరుగులేని ఆయుధం! ఏది ఏమైనా, ఆగదుగా కాలగమనం! అదో నిరంతర ప్రవాహం! కదుల్తూ కదుల్తూ తెచ్చింది […]