April 23, 2024

మాలిక పత్రిక మార్చ్ 2022 సంచికకు స్వాగతం

Jyothivalaboju Chief Editor and Content Head పాఠక మిత్రులకు, రచయితలకు, శ్రేయోభిలాషులకు మాలిక పత్రిక తరఫున హార్ధిక స్వాగతం. ప్రపంచ వ్యాప్తంగా  ప్రజా జీవనం మళ్లీ సాధారణ స్థితికి  చేరుకుంటుందన్న శుభవార్త హర్షణీయం..అందరూ బాగుండాలి. అందులో మనముండాలి. మాలిక పత్రికలో అందరినీ అలరించే కథలు, వ్యాసాలు, కవితలు, సీరియల్స్, సమీక్షలు, కార్టూన్లు తీసుకొస్తున్నాము. ఇందులో ప్రముఖ రచయితలు, రచయిత్రులెందరో ఉన్నారు. అలాగే ఔత్సాహికులకు మాలిక ఎప్పుడూ ప్రోత్సహిస్తుంది. అప్పుడప్పుడు పోటీలు కూడా నిర్వహిస్తున్నాము. ఈ సారి […]

చంద్రోదయం – 26

రచన: మన్నెం శారద మరుసటిరోజే వాళ్ళు వెళ్ళిపోయేరు. … గతంలోని నీడలని తప్పించుకోలేక సారథి రెండు నిద్రమాత్రలు వేసుకుని పడుకున్నాడు. ***** స్వాతి చాలా రోజుల తర్వాత ఉత్సాహంగా వుంది. తన మనసులో వున్న భయాన్ని సారథి ముందుంచింది. తనని అనుక్షణం పట్టి వేధిస్తున్న మోహన్ విషయం అతనికి నిర్భయంగా చెప్పేయగలిగింది. సారథి తనని అపార్థం చేసుకోలేదు. స్వాతికి అకస్మాత్తుగా దిగులేసింది. మనసు విప్పి అంతా చెప్పినా తననింకా దూరంగానే వుంచు తున్నాడు సారథి. పరాయిదానిగానే భావిస్తున్నాడింకానూ. […]

ధృతి – 9

రచన: మణికుమారి గోవిందరాజుల బద్దకంగా కళ్ళు విప్పింది ధృతి. అప్పటికే లేచి ఆడుకుంటున్న ఆర్తి కార్తి కేకలతో మెలకువ వచ్చిందే కాని, లేవబుద్ది కావడం లేదు. బెడ్ కి పక్కనే ఉన్న కిటికీలో నుండి బయటికి చూసింది. కింద గార్డెన్ లో శివ పిల్లలు బాల్ ఆట ఆడుకుంటున్నారు. ఇంట్లో ఎంత లేపినా లేవని ఆర్తీ కార్తీ, ఇక్కడికి వస్తే మటుకు సూర్యోదయం కాకముందే లేస్తారు. శివతో ఆడుకోవటం వాళ్ళకు చాలా ఇష్టం. ఆ చెట్లల్లో పడి […]

వెంటాడే కథలు -6 – గుర్తింపు

నా వృత్తిలో భాగంగా దేశదేశాల కథలు, మనదేశానికి చెందిన తెలుగు, తెలుగేతర కథలూ వేలకొద్దీ చదివాను. వాటిలో కొన్ని ఎప్పటికీ మరుపుకు రావు. ఎల్లవేళలా మనసుని వెంటాడుతూనే ఉంటాయి. అవి ఏ భాషలో వచ్చాయో.. రచయితలెవరో, అనువాదకులెవరో గుర్తులేకపోవడం నా దురదృష్టం. అలాంటి కథలు నెలకొకటి చొప్పున నా మాటల్లో క్లుప్తంగా చెబుతాను. పాఠకులెవరైనా ఇది ఫలానా వారి కథ, ఫలానా భాష కథ అని గుర్తుపడితే మరీ సంతోషం. ఆ రచయిత గురించి తరువాతి సంచికలో […]

మోదుగ పూలు – 8

రచన: సంద్యా యల్లాప్రగడ వేసవి ఫైనల్‌ పరిక్షలు పూర్తి కావొచ్చినాయి. పిల్లలను పరీక్షలకు సిద్ధం చెయ్యటంలో టీచర్లు తలమునకలయ్యారు. పెద్ద పరీక్షలు అయ్యాయి పదో తరగతి పిల్లలకు. మిగిలిన వారికి కూడా పరీక్షలయినాయి. ఆ సాయంత్రము టీచర్ల మీటింగు అయింది. రాజు సార్ అందరినీ ఉద్దేశించి మాట్లాడుతూ” మనం ఇంక పదిహేను రోజులు సెలవులు తీసుకుందాం. పదిహేను రోజుల తర్వాత సారులందరు వెనక్కి వచ్చేయ్యండి. మనము పిల్లలను తీసుకురావాలి. మన జ్యోతి టీచరు పెళ్ళి చేసుకు వెళ్ళిపోతోంది […]

తాత్పర్యం – దుఃఖం సుఖంకంటే సుఖమా. ?

రచన:- రామా చంద్రమౌళి ఆమె సుభద్రేనా. ? మనసు పదే పదే తరచి తరచి వెదుకుతోంది. జ్ఞాపకాన్ని. రెండు నిముషాలక్రితం గబగబా మెట్లెక్కుతూ ఎ. టి. ఎం. లోకి వస్తున్నప్పుడు కనబడ్డ ఆమె రూపురేఖలను మరోసారి మననం చేసుకుంటూ. దాదాపు నలభై సంవత్సరాల క్రితం కనుమరుగైన సుభద్ర. మళ్ళీ అనూహ్యంగా. ఇప్పుడు ఇలా కనబడే అవకాశం ఉందా. ఒకవేళ ఆమె సుభద్రే ఐతే. ఇన్నాళ్ళు ఎక్కడుందో. ఎక్కడో ఉంటే ఇప్పుడెందుకొచ్చిందో. వస్తే. , సుభద్ర. సుభద్ర. . […]

పరవశానికి పాత(ర) కథలు – 2 , నేను చూసిన నక్షత్రం

రచన: డా. వివేకానందమూర్తి నాకీ మధ్య హఠాత్తుగా కథలు రాసే యావ తగ్గిపోయి రాయడం మానేశాను. కథ రాయడం మానేయడానికి కథ ఉంది. నేనెప్పుడు కంచికి వెళ్ళిన కథే మంచి కథ అనుకుంటాను. కథలు ముమ్మరంగా రాసే రోజుల్లో నేనోసారి కంచికి వెళ్లేను. నా కథ లెక్కడేనా కనిపిస్తాయేమోనని కాంచీపురమంతా కళ్లు కంచు కాగాడాల్లా చేసుకుని కాంచేను. కనిపించలేదు. నేను కంచికి చేరినా నా కథలు కంచికి చేరలేదు. అంచేత నేను మంచివి రాయలేదనుకున్నాను. నాకు చాలా […]

అమ్మమ్మ – 33

రచన: గిరిజ పీసపాటి పరిస్థితులు ఇలా ఉండగానే పెద్ద పండుగ అని పిల్చుకునే ముచ్చటైన మూడురోజుల పండుగ వచ్చింది. భోగీ పండుగ రోజు ఉదయాన్నే ‘ఢిల్లీ’ అని అందరూ పిలుచుకునే ‘లక్ష్మణరావు’ అనే అబ్బాయి వేరేవాళ్ళ ద్వారా పెదబాబు ఇంట్లోంచి వెళ్ళిపోయాడనే విషయం తెలిసి వీళ్ళింటికి వచ్చాడు. నాగ వాళ్ళు వైజాగ్ లో కాపురం పెట్టిన కొత్తల్లో చెంగల్రావు పేటలో వీళ్ళు అద్దెకుండే ఇంట్లోనే మరో వాటాలో అద్దెకుండేవారు ఢిల్లీ వాళ్ళు. ఢిల్లీ అమ్మానాన్నలను నాగ ‘పిన్ని, […]

కంభంపాటి కథలు – దేవుడికి భయం లేదు

రచన: రవీంద్ర కంభంపాటి సాయంత్రం నాలుగున్నర అవుతూంది. ఆదిలక్ష్మి ఇంటిపక్కనే ఉన్న సందులోకి తిరిగి, వీధి వైపుకి వచ్చింది. ఇంటి ముందుభాగం అద్దెకిచ్చేసేరేమో, తిన్నగా వీధిలోకి వచ్చే వెసులుబాటు లేదు. ఆ సందులోంచి బయటికి వచ్చి, వీధిలోకి తిరిగేసరికి బజ్జీల నూనె వాసన నుంచి, కోడిమాంసం, కోడిగుడ్ల వాసన వరకూ రకరకాల వాసనలొచ్చేయి ! వెనక్కి తిరిగి తన ఇంటి వేపు నిరసనగా చూసింది. ఇంటి ముందు శ్రీ సాయి విలాస్ టిఫిన్స్, నూడుల్స్, కర్రీస్ అనో […]