February 9, 2023

సుప్రభాత పద్యములు

రచన: టి.వి.యెల్. గాయత్రి

సీసము //

పసుపు వర్ణపు వెల్గు బాటలన్ జల్లుచు
ప్రాగ్దిశ నుదయించె భానుడిలను
కువకువ లాడుచు గూళ్లను వదిలిన పక్షి గణంబుల పాట వినుచు
వడివడిమేల్కొని వయ్యారి భామలు
పెరుగును జిల్కగ ప్రీతి తోడ
పశువుల తోడ్కొని పాలేళ్ళు ముదముగ
నాగళ్లు పట్టుచు నడచి రపుడు //

తేట గీతి

పల్లె నిద్దుర లేచెను
పరవశించి
విరులు వెదజల్లు పుప్పొడి విందు చేయ
తేటి గుంపుల సందడి తేరి చూచి
నవ్వు కొనుచును భానుడు నడువ సాగె //

చంపక మాల //

తొలితెలి వెల్గులీ భువిని దూకొను చుండెను తేజరిల్లి యా
వెలుగుల గాంచి తామరలు వేడుక నొందగ తెల్ల వారగన్
బరుగిడి తుమ్మెదల్ ముసిరి పంకజమందలి తేనె త్రావ నా
కలకల మంతయున్ గనుచు కంజహితుండరు దెంచె ప్రాగ్దిశన్ //

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *