March 29, 2024

బంధం

రచన: రాజ్యలక్ష్మి బి క్లాసులో పిల్లలకు టెస్ట్ పెట్టి కూర్చున్నదన్న మాటే కానీ రాజ్యం మనసులో అంతా గందరగోళం!బడికి వస్తుంటే యింటి దగ్గర అమ్మ చెప్పిన మాటలు పదే పదే చెవిలో రింగుమంటున్నాయి. రేపు తనను చూడడానికి పెళ్లివారొస్తున్నారు కనుక బడికి సెలవు పెట్టమంది. కానీ రాజ్యానికి పెళ్లిచూపులంటే మహా కంపరం. ఒకసారి తలెత్తి పిల్లలందరినీ చూసింది. అందరూ తలొంచుకుని శ్రద్హగా వ్రాస్తున్నారు. అందరూ అమ్మాయిలే. అరవిరిసిన లేత గులాబీల్లాగా స్వచ్ఛంగా మెరుస్తున్నారు. భవిష్యత్తులో వీళ్లు యెన్ని […]

లైవ్ లింక్

రచన: ఆర్. లలిత “ఏమండీ. అందరికీ వాట్స్ ఆప్ లో పెళ్లి కార్డులు పంపించారా ? అడిగింది సుశీల “ఆ! పంపించడమే కాకుండా, ఫోన్లు చేసి, మరీ పిలిచానే. “అన్నాడు ధర్మారావు. “మా పెద నాన్న మనవడు ఈ ఊళ్లోనే ఉన్నాట్ట. అతనికి ఫోన్ చేసి, పెళ్లి కూతుర్ని చేసేటప్పుడు, తప్పకుండా రావాలని చెప్పండి. మా పిన్ని మనవరాలు దాని ఇంటి గృహ ప్రవేశానికి పిలవనే లేదు. నేను మాత్రం అలా చెయ్యను. వాట్స్ ఆప్ లో […]

నీవే సఖుడౌ. . నిజముగ కృష్ణా!

రచన: G.S.S.కళ్యాణి సుప్రియ, శ్రీరమణలు దాదాపు అయిదేళ్ల తర్వాత అమెరికానుండి ఇండియాకు ఒక నెలరోజుల కోసం వచ్చారు. శ్రీరమణ సుప్రియను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అందుకే సుప్రియ మాటంటే శ్రీరమణకు వేదవాక్కు! సుప్రియ కోరిక ప్రకారం శ్రీరమణ ఇండియాలో ఉన్నన్నాళ్లూ తన అత్తగారింట్లో ఉండేందుకు అంగీకరించాడు. సుప్రియ, శ్రీరమణల చుట్టాలందరూ ప్రస్తుతం ఒకే నగరంలో ఉండటంతో వాళ్ళు ఒక పెద్ద కారును అద్దెకు తీసుకుని, గత పదిహేను రోజులుగా ఒక ప్రణాళిక ప్రకారం తమ బంధువుల ఇళ్లకు […]

ఇదీ పరిష్కారం !

రచన: ముక్కమల్ల ధరిత్రీ దేవి ” సౌమ్యా, ఇంకా ఏం చేస్తున్నావ్? ” లాంగ్ బెల్ అయి పది నిమిషాలైనా ఇంకా రాని సౌమ్య కోసం వెతుకుతూ ఉన్న దుర్గకు క్లాస్ రూమ్ లో డెస్క్ మీద తల వాల్చి కూర్చున్న సౌమ్య కనిపించడంతో గట్టిగా పిలిచింది. తలెత్తి చూసింది గానీ సౌమ్య అట్నుంచి కదల్లేదు. ” ఏమిటి సౌమ్యా, ఏమైంది? ఎందుకు అలా ఉన్నావ్? ఆర్ యు ఓకే? ” తనే లోనికెళ్లి సౌమ్య భుజం […]

కాశీలోని రహస్య ద్వాదశ ఆదిత్యుల మందిరాలు

రచన: నాగలక్ష్మి కర్రా ప్రత్యక్ష నారాయణునిగా పూజింపబడే సూర్యునికి మన దేశంలో ఒక్క ‘అరసవల్లి’ తప్ప ఎక్కడా గుడి లేదు అని మనం ఎప్పుడూ అంటూ వింటూ ఉంటాం, కాని కాశీనగరంలో ద్వాదశ, అవును అచ్చంగా పన్నెండు సూర్య మందిరాలు ఉన్నాయని (నమ్మబుద్ది కావటం లేదు కదా? కాని ఇది నిజంగా నిజం) మొదటిమారు విన్నప్పుడు నాకూ నమ్మబుద్ది కాలేదు. వాటిని చూస్తున్నప్పుడు పొందిన శక్తి, కలిగిన అనుభూతి వర్ణనాతీతం, అందుకే కాశీ వెళ్లే ప్రతీవారు ఈ […]

సారంగపూర్ ఆంజనేయస్వామి గుడి:

రచన: రమా శాండిల్య నిజామాబాద్ కి ఐదు కిలోమీటర్ల దూరంలో ‘సారంగపూర్ ‘ అనే ఒక గ్రామంలో వందల సంవత్సరాల క్రితం నుంచీ, చిన్న కొండ మీద ఉన్న దేవాలయమే ఈ సారంగపూర్ ఆంజనేయస్వామి దేవాలయం. ఈ దేవాలయం వెనుక చాలా చరిత్ర ఉన్నది. భారతదేశ చరిత్రలో సమర్థ రామదాసు యొక్క పాత్ర చాలా ఉన్నదని చరిత్ర చెబుతున్నది. ఈ సారంగపూర్ ఆంజనేయస్వామి గుడి ఛత్రపతి శివాజీ కూడా దర్శించుకునేవాడట. ‘ఛత్రపతి శివాజీ’ హిందూసామ్రాజ్యాన్ని స్థాపించడానికి అతని […]

*శ్రీ గణేశ చరిత్ర*

రచన: నాగమంజరి గుమ్మా 31 వ పద్యం వటువు ప్రయోగించెనపుడు పటువున దంతమును పీకి పరిఘకు మారున్ మిటమిట లాడెను మోషకు డటగొని శరణం బనన్ గజాననుడాపెన్ భావం: తండ్రి ఆదేశంతో గజాననుడు లేచి, తన దంతాన్ని విరిచి ఎలుకపై విసిరాడు. అది ఒక ఇనుప గదలా తగలగా ఎలుకకు ప్రాణాలు కళ్ళలోకి వచ్చినంత పనిఅయ్యింది. వెంటనే ఆ ఎలుక శరణు కోరింది. గజముఖుడు తన దాడిని ఆపి ఉపనయన కార్యక్రమం కొనసాగించెను 32 వ పద్యం […]

అంగారపర్ణుడు

రచన: శ్యామసుందర రావు మహా భారతములో ఆదిపర్వంలో ఈ అంగారపర్ణుడి కద వస్తుంది. వారణావతములోని లక్క గృహము దహనము నుండి బయటపడ్డ పాండవులు కుంతీ, విదురుని సలహా మేరకు కొంత కాలము ఏకచక్రపురంలో బ్రాహ్మణ బ్రహ్మచారులుగా రహస్య జీవనము సాగిస్తూ, బకాసురిని వధ తరువాత బ్రాహ్మణుడు ఇచ్చిన సమాచారంతో పాంచాల రాజ్యానికి ద్రౌపది స్వయంవరానికి బయలు దేరుతారు. ఆ సమయములో వారు గంగానది ఒడ్డున గల అరణ్యము గుండా ప్రయాణిస్తున్నప్పుడు, వారి అడుగుల సవ్వడి విన్న అంగారపర్ణుడు […]