March 29, 2024

మాలిక పత్రిక ఏప్రిల్ 2022 సంచికు స్వాగతం

  Jyothivalaboju Chief Editor and Content Head     మరో కొత్త సంవత్సరానికి, కొత్త పత్రికకు స్వాగతం.. పాఠక, రచయిత మిత్రులందరికీ శ్రీ శుభకృత్ నామసంవత్సర శుభాకాంక్షలు. ఎటువంటి ఒడిదుడుకులు, సమస్యలు, విపత్తులు మళ్లీ రాకుండా ఉండాలని మనసారా కోరుకుందాం. గడచిన సంవత్సరంలోని చేదుసంఘటనలు, ఆపదలు, సమస్యలను మరచిపోవడం కష్టమే అయినా మరువడానికి ప్రయత్నిద్దాం. కొత్త ఉత్సాహంతో ముందుకు సాగుదాం. ఈ జీవన పయనం ఆగలేదు కదా. అంతా మన మంచికే అనుకుంటూ కాలంతో […]

వెంటాడే కథలు – 7

నా వృత్తిలో భాగంగా దేశదేశాల కథలు, మనదేశానికి చెందిన తెలుగు, తెలుగేతర కథలూ వేలకొద్దీ చదివాను. వాటిలో కొన్ని ఎప్పటికీ మరుపుకు రావు. ఎల్లవేళలా మనసుని వెంటాడుతూనే ఉంటాయి. అవి ఏ భాషలో వచ్చాయో.. రచయితలెవరో, అనువాదకులెవరో గుర్తులేకపోవడం నా దురదృష్టం. అలాంటి కథలు నెలకొకటి చొప్పున నా మాటల్లో క్లుప్తంగా చెబుతాను. పాఠకులెవరైనా ఇది ఫలానా వారి కథ, ఫలానా భాష కథ అని గుర్తుపడితే మరీ సంతోషం. ఆ రచయిత గురించి తరువాతి సంచికలో […]

ధృతి – 10

రచన:-మణి గోవిందరాజుల “అమ్మా! అంతా బానే అయింది కానీ… ఆ పెళ్ళి వాళ్ళ ప్రవర్తనే నాకు నచ్చలేదు. కరణం అంకుల్ని అలా తీసిపడేసింది ఒక చిన్న పిల్ల. పెద్దవాళ్ళు కనీసం చెప్పనన్నా లేదు. మగపిల్ల వాళ్ళు అనగానే అంత పొగరుగా ఉంటారా?” అక్కడి విశేషాలన్నీ చెప్తూ తాంబూలాల సందర్భంలో జరిగిన సంఘటన చెప్తూ ఆశ్చర్యంగా అడిగింది. “ఆ అమ్మాయి స్వభావం అది అయి ఉంటుంది. రేపు ఆ అమ్మాయి తన పెళ్ళిలో కూడా తాను తగ్గదు. అప్పుడు […]

చంద్రోదయం – 27

రచన: మన్నెం శారద ” ఎక్కడ్రా వుద్యోగం?” అంది సావిత్రమ్మ. “శేఖర్ ఆఫీసులోనే. భర్తగాని, తండ్రిగాని పోయినప్పుడు ఆ యింట్లో ఎవరికో ఒకరికి ఉపాధి చూపించేందుకు ఉద్యోగం ఇచ్చే రూల్ వుంది” అంటూ వివరంగా చెప్పేడు సారథి. ఆ మాట విన్న స్వాతి చేతులు ముఖానికడ్డంగ పెట్టుకుని వెక్కెక్కి ఏడిచింది. సారథి కాస్సేపు మాట్లాడలేనట్లు చూసి వూరుకున్నాడు. “ఎప్పుడు జాయిన్ అవుతారు?” స్వాతి దుఃఖాన్ని అదుపులో పెట్టుకుంటూ “నేను వీధి ముఖం చూడలేను. నాకే వుద్యోగం వద్దు” […]

అమ్మమ్మ – 34

రచన: గిరిజ పీసపాటి పండుగ వెళ్ళిన ఐదు రోజులకే ఇంట్లో బియ్యంతో సహా సరుకులన్నీ నిండుకున్నాయి. వసంత చెల్లిని తీసుకుని వీళ్ళు నెలవారీ కిరాణా సరుకులు తీసుకుని షాపుకి వెళ్ళి ఐదు కేజీల బియ్యంతో పాటు, అవసరమైన సరుకులు ఇమ్మని అడిగింది. తండ్రి ప్రతీనెలా ఆ షాప్ లోనే కిరాణా సామాను అరువుగా తీసుకొని జీతం రాగానే సొమ్ము చెల్లించేవాడు. డబ్బు తండ్రి కట్టినా సరుకులు మాత్రం పిల్లలే తెచ్చేవారు కనుక వసంత వెళ్ళి సరుకులు అడగగానే […]

తాత్పర్యం – అంటుకున్న అడవి

రచన: – రామా చంద్రమౌళి డాక్టర్ పుష్ప ఆ వేసవి కాలపు సాయంత్రం తన ఇంటి బాల్కనీలో కూర్చుని . . ఎదుట అస్తమిస్తున్న సూర్యుణ్ణి తదేకంగా చూస్తోంది దాదాపు పది నిముషాలనుండి. ఆమె హృదయం అంటుకున్న అడవిలా . . మధ్య మధ్య ఘనీభవించిన మంచు మైదానంలా ఉంది. మనిషి మనోస్థితి ఎప్పటికప్పుడు మారుతూ క్షణ క్షణం. . విస్ఫోటిస్తూ, కింది అంతస్తు వాకిట్లోనుండి మొలిచి ఏపుగా ఎదిగిన టేకు చెట్టు తన విశాలమైన పచ్చని […]

మోదుగపూలు – 9

రచన: సంధ్యా యల్లాప్రగడ మామిడిపల్లి వచ్చాక. ఊపిరి హాయిగా పీల్చినట్లు ఫీల్‌ అయ్యాడు వివేక్‌. ఊరి నుంచి మామిడిపల్లి రాగానే రెండోరోజు రాము ఉన్నాడేమో అని వారింటికెళ్ళాడు. రాము ఇంట్లోనే ఉన్నాడు. బుక్సు ముందరేసుకొని, చదువుతూ, రాస్తూ… “ఎలా గడిచింది సిటీలో? రావాలనిపించిందా?” అడిగాడు స్నేహంగా చూస్తూ. “ఆ! అస్సలు వెంటనే రావాలనిపించినా పనులు చూసుకువచ్చాను. అసలు ఉండలేకపోయాను బాబు ఆ పొల్యూషన్ లో. ఇన్ని రోజులు ఎలా ఉన్నానా అని నాకే వింతగా ఉంది” అన్నాడు […]

సాఫ్ట్ వేర్ కథలు – మైసూరు బజ్జీ

రచన: రవీంద్ర కంభంపాటి కొత్త ఉద్యోగంలో చేరేది ఆ రోజేననేమో.. ఆ రోజు నిశ్చలకి చాలా ఎగ్జైటింగ్ గా ఉంది.. కాసింత టెన్షన్ కూడా ఉంది. పాత ఉద్యోగంతో పోలిస్తే ఇక్కడ నలభై శాతం జీతం ఎక్కువ ఆఫర్ చేసేరు. పైగా అందమైన కేంపస్, జిమ్మూ గట్రా అదనం ! ఆఫీస్ క్యాంపస్ లోకి అడుగుపెడుతూనే, తల్లి ఫోను, ‘ఏమే.. జాగ్రత్తగా చేరేవా ?’ అంటూ. ‘చిన్న పిల్లనా ఏమిటి ? బాగానే వచ్చేసేను.. చూడు మా […]

పరవశానికి పాత(ర) కథలు – సయొనారా

రచన: డాక్టర్ కె.వివేకానందమూర్తి (యు.కె) ప్రేమించిన చక్కటి అమ్మాయి కళ్లల్లోంచి కురిసే చిక్కటి వెలుగు లాంటి వెన్నెల జాలు వానగా కురిపిస్తున్న పున్నమి చంద్రుణ్ణి, ఆ అమ్మాయిని అదుపులో పెట్టడానికి ప్రయత్నించే ముసిలి తండ్రిలాగ, నల్లటి మేఘం వొకటి నిండా కప్పేసింది. అంచేత ఆకాశంలో చంద్రుడు షెడ్ చాటున టేబిల్ లైటులా వున్నాడు. చాలని చిరువెన్నెల పరుచుకున్న భూమ్మీద పల్చని చీకటి మసగ్గా వ్యాపించివుంది. ఇప్పుడు ‘రామకృష్ణా మిషన్ బీచ్’లో వెన్నెల పున్నమినాటిలా లేదు. జనం అప్పుడే […]

బెంగ

రచన: – కర్లపాలెం హనుమంతరావు తెల్లవారింది. మెలుకువ వచ్చినా లేవబుద్ధి కావడంలే. ఈ మధ్యనే ఈ గొడవంతా. ఇంటిల్లిపాదీ నిద్దర్లు లేచేవేళకి అన్నీ అమర్చి పెట్టడం అత్తగారు నేర్పిన విద్య. తు. చ తప్పకుండా పాటిస్తూ వచ్చా ఇప్పటిదాకా. కొంపలు కూలిపోతాయా వక్కరగంట ఆలీసమైతే.. అనిపించడం.. ఇదిగో ఈ మాయదారి అనుమానం మొదలయినప్పట్నుంచే ! రాత బావో లేక నేను గాని చచ్చిపోతే? పాలు లేక పిల్లలు, బెడ్ కాఫీల్లేక ఆయనగారు కూడా చచ్చిపోతారా? నవ్వొచ్చింది నా […]