March 30, 2023

మనసే ఒక పూలతోట

రచన: గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్

మనసే ఒకపూల తోట
తీయని తలపుల ఊట
అందాల ఆస్వాదనకు బాట
ఆనందాల అందించే మూట

నా మనసులో
సుమాలున్నాయి
సొగసులున్నాయి
సౌరభాలున్నాయి
సంతసాలున్నాయి

నాకు
అందాన్ని
చూపుతున్నాయి
ఆనందాన్ని
కలిగిస్తున్నాయి

మందారాలు
మురిపించి
మరందమును
మధుపములవలె క్రోలుకొనుమను

ఎర్రగులాబీలు
ఎదనాక్రమించి
ఎర్రబుగ్గలపై మోజుకలిగించు
ఎందుకాలశ్యమనుచు పరుగులుతీయించు

మల్లెపూలు
మత్తెక్కించి
మయిని మరిపించు
ముద్దూముచ్చటలు తీర్చుకొనుమను

పున్నాగపూలు
పలకరించి
పరిహసములాడు
పరిమళాలను పీల్చుకొనుమను

బంతిపూలు
భ్రమలుకల్పించి
బ్రతుకును
బహుధన్యము చేసుకొనుమను

చామంతిపూలు
చక్కదనాలుచూపి
చమత్కరించు
చిరునవ్వులు మోమునచిందించు

సన్నజాజులు
సరసములాడి
సందడిచేయు
సన్మోహపరచి సంతసపెట్టు

అన్ని అలరుల అందాలు
అంతరంగాన్ని తాకి
ఆశలు పుట్టించు
ఆనందసాగరమున ముంచు

మీరు కూడా
ఊహల పల్లకెక్కి
ఊరేగండి
మేఘాల పల్లకెక్కి
మురిసిపోండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe to మాలిక పత్రిక

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

ఇటీవలి వ్యాఖ్యలు

కొత్త టపాలు

Categories

Archives

April 2022
M T W T F S S
« Mar   May »
 123
45678910
11121314151617
18192021222324
252627282930