March 29, 2024

తృప్తి

రచన: ఆచార్యులు జీ. వీ యస్ “కాఫీ తాగావురా రాఘవా?”… పేపర్ చదువుతున్న నలభై ఏళ్ల కొడుకుని, వినిపించుకోలేదేమోనని ఇంకోసారి అడిగారు ఉదయం పూట ఎండకోసం, వరండాలో స్తంభానికి జారగిలపడి కూర్చుంటూ రాఘవ అమ్మగారు ఎనభై ఏళ్ల తాయారమ్మగారు. ” ఆబ్బా! తాగానమ్మా ‘ ….. పేపర్ లోంచి తల బైట పెట్టకుండా బిజినెస్ వార్తలు చదువుతూ విసుగ్గా అన్నాడు బ్యాంక్ లో క్యాషియర్ గా పనిచేస్తున్న రాఘవ. ఏమిటో… చిన్నప్పటినుంచి వీడికి చిరాకు, విసుగు ఎక్కువే, […]

వ్యసనం

రచన: రాజ్యలక్ష్మి బి “ఏవండీ గుమ్మం దగ్గర మిమ్మల్ని యెవరో పిలుస్తున్నారు “వంటింట్లోనించి రాధిక హాల్లో చదువుకుంటున్న రఘునాథ్ కు చెప్పింది. చదువుతున్న “అసమర్ధుని జీవయాత్ర “ప్రక్కన పెట్టి షర్ట్ వేసుకుని లుంగీ సర్దుకుంటూ వరండాలోకి వచ్చాడు రఘునాథ్. కైలాష్ ని ఆశ్చర్యంగా చూస్తూ అయినా మొహంలో కనపడనియ్యకుండా, ”రండి లోపలికి “అంటూ ఆహ్వానించాడు. ఇద్దరూ హాల్లో కూర్చున్నారు. రాధికను మంచినీళ్లు తీసుకురమ్మని చెప్పాడు. కైలాస్ మంచి యెండలో వచ్చాడు రెండు గ్లాసుల చల్లని నీళ్లు త్రాగి […]

అష్టవిధ నాయికలు. ప్రోషితభర్త్రుక.

కథారచన: పంతుల ధనలక్ష్మి. మహారాణీ మాలినీదేవి మహా అందాలరాణి. అందమంతా తనసొత్తే అన్నట్టుంటుంది. రాజా ప్రతాపవర్మ గొప్ప యుద్ధ నైపుణ్యం గుణగణాలు కలవాడని చాలాసార్లు చాలామందినోట విన్నది. అటువంటివాడు తన తండ్రిపైకి యుద్ధానికి వస్తున్నాడని తెలిసింది. వెంటనే తన తండ్రి అతనితో యుద్ధం కంటే సంధి చేసుకోవటం మంచిదని భావించి సంధి చేసుకున్నాడు. తమ ఉద్యానవనం చూపించడానికి తీసుకొని వచ్చి అక్కడేవున్న తనని పరిచయం చేసాడు. అందంలోను అందమైన లలిత కళలలోను ప్రావీణ్యం కలిగిన మాలినీదేవిని ఇష్టపడి […]

దేవీ భాగవతం – 9

  రచన: వోలేటి స్వరాజ్యలక్ష్మి   7 వ స్కంధము, 28 వ కథ బ్రహ్మ సృష్టిని చేయుట   విష్ణు భగవానుని నాభి కమలమునుండి బ్రహ్మ ఉత్పన్నమయ్యెను. సృష్టి కార్యక్రమమును బ్రహ్మ మిక్కిలి తపమొనరించిన తరువాత భగవతి యొక్క వరముచే ఆరంభించెను. మొదట ఏడుగురు మానస పుత్రులు ఉదయించిరి. 1. మరీచి 2. అంగిరా 3. అత్రి 4. వశిష్టుడు 5. పులహుడు 6. క్రతువు 7. పులస్త్యుడు. బ్రహ్మయొక్క రోషమునుండి రుద్రుడు, ఒడినుండి నారదుడు, […]

గృహస్థాశ్రమ ధర్మాలను వివరించిన “ఔర్వ మహార్షి “

రచన: శ్యామసుందరరావు   ఔర్వ మహార్షి  కధ మహాభారతము ఆదిపర్వంలోని చైత్ర రద పర్వము అనే ఉప పర్వంలో 79,80అధ్యాయాలలో 55 శ్లోకాల్లో ఉంది. ఈ కథను వశిష్ఠుడు తన మనుమడైన పరాశరునికి చెబుతాడు.  ఆంధ్ర మహాభారతములో నన్నయ ఈ కథను ఆదిపర్వం సప్తమాశ్వాసములో 132 వచనము నుండి 149 వ వచనము వరకు 18 గద్య పద్యాలలో ఎటువంటి మార్పులు చేయకుండా చెప్పాడు.   ఈ కథ మొత్తము అనౌచిత్యమైన అంశాలతో కూడుకొని ఉంటుంది.   ఋషుల మహాత్యము […]

మొసలి రామలింగేశ్వర ఆలయం “పవర”

రచన: రమా శాండిల్య   ఈ మధ్య నేను  ఒకరి ఇంటిలో జరిగే పౌర్ణమి పూజలు, అభిషేకాలు, హోమాలు చూసి రావటానికి తూర్పుగోదావరి  జిల్లాలోని కాకినాడకు వెళ్ళాను. ఆ పూజలు, యాత్రలు అన్నీ అయి,  పిఠాపురం, ద్రాక్షారామం అన్నీ చూసేసాక,  బెంగుళూర్ తిరుగు ప్రయాణం అయ్యాను. నా ప్రయాణం రోజున ఉదయం మా అక్క, ఇక్కడికి దగ్గరలో ‘పవర’ అనే గ్రామంలో శివాలయం ఒకటి ఉంది. చూసి వద్దాము.” అన్నది. సరే అనుకుని…  ఒక ఆటో మాట్లాడుకుని […]

యాత్రామాలిక – ముక్తినాథ్ యాత్ర

రచన: నాగలక్ష్మి కర్రా కైలాశ్ మానససరోవరం యాత్ర చేసుకున్నాక నేపాలులో ఉన్న ముక్తినాథ్ యాత్ర చేసుకోవాలనిపించింది. సరే గూగుల్ లో చూసుకొని ఓ ట్రావెల్స్ వాళ్లని సంప్రదించి బేరసారాల తరువాత మేం మొత్తం ఏడుగురం బయలుదేరేం. మేం మాట్లాడుకున్న పేకేజీ ప్రకారం రెండురోజులు ఖాట్మండు, ఒక రోజు జనకపూర్, ఒక రోజు పోకర, ఒక రోజు ‘జోమ్ సోమ్’, తిరిగు ప్రయాణంలో ఒక రోజు పోకర, రెండు రోజులు ఖాట్మండు. మొత్తం మా పాకేజీ ఎనిమిది రాత్రులు […]