April 16, 2024

మాలిక పత్రిక మే 2022 సంచికకు స్వాగతం

Jyothivalaboju. Chief Editor and Content Head మాలిక పత్రిక మిత్రులకు, రచయితలకు సాదర స్వాగతం..మీకందరికీ కూడా ఆవకాయ అభినందనలు, రాబోయే మాతృదినోత్సవ శుభాకాంక్షలు.. ఆవకాయ అభినందనలు ఏంటి అనుకుంటున్నారా.. రెండేళ్లకు పైగా ఉన్నామో లేదో అన్నట్టు కాలం గడిపిన మనం ఇప్పుడు హుషారుగా, మునుపటలాగే ఆవకాయలు పెట్టడం మొదలెట్టేసాము కదా. మే నెల అంటే దాదాపు ప్రతీ తెలుగింట వినపడే మాట మల్లెపూలు, మామిడిపళ్లు, ఆవకాయలు, వడియాలు.. సూర్యనారాయణ ఎంత మండినా కూడా వీటిని మనం […]

(వ్యంగ్యల్పిక) ప్రేమల పార్టీలు.. దొంగప్రేమల పార్టీలు!

రచన:-కర్లపాలెం హనుమంతరావు ‘ప్రేమే దైవం! యువతే లక్ష్యం!’ ‘ఇదివ రకు ఓన్లీ ఒన్ సేవే లక్ష్యం అన్నట్లు గుర్తు?’ ‘అది ముగిసిపోయిన పార్టీ పొట్టి కేప్షన్ బాబాయ్! ఇది ముందుకు దూసుకొస్తోన్న పార్టీ కొత్త స్లోగన్. మాది దక్షిణాది రాష్ట్రాల మార్కు లవ్ పార్టీ! అదేమో ఉత్తరాది రాష్ట్రాల ఉత్తుత్తి ప్రేమ పార్టీ! మాధుర్ నాథ్ చౌధురి గుర్తున్నాడా?’ ‘మర్చి పోదగ్గ మహానుభావుడట్రా బాబూ! పాఠాలు చెప్పమని పెద్దబళ్లో పంతులుద్యోగ మిస్తే .. ప్రేమ పాఠాలు వల్లించి […]

ధృతి – 11

రచన: మణికుమారి గోవిందరాజుల స్వాతీ… చెప్తే అర్థం చేసుకో… ఆ అమ్మాయి చాలా తెలివితేటలు కలది. అదే కాక మనవాడికి తగినజోడి అవుతుంది కూడాను” అప్పటికి చాలా సేపటినుండి నచ్చ చెప్తున్నాడు శేఖరం. “అంత మాత్రం జోడీ మనవాడికి ఎలానూ దొరుకుతుంది. ఇలా చిన్నపిల్లను ఒప్పుకుని వయసొచ్చేదాకా ఎదురు చూడక్కరలేదు. ఎట్టి పరిస్తితుల్లోనూ నేను ఒప్పుకోను” ఖరాకండిగా చెప్పింది స్వాతి. “ఇప్పుడు నీకు అర్థం కావటం లేదు. ఆ అమ్మాయి మన కాలేజ్ లో మూడేళ్ళుగా టాపర్ […]

అమ్మమ్మ – 35

రచన: గిరిజ పీసపాటి కొన్ని విషయాలు మనం ఎంత దాచాలనుకున్నా దాగేవి కావు కనుక అన్ని విషయాలూ ఒక్క తమ ఆర్థిక ఇబ్బందులు తప్ప ప్రసాద్ గారితో వివరంగా చెప్పింది నాగ. జరిగినదంతా విన్నాక ఆయన చాలా బాధపడి “అయ్యో! మీరు పిల్లలు ఇంత బాధలో ఉన్నారని తెలియదు మేడమ్! ఎవరికైనా హెల్త్ బాగోలేదేమో అవసరమైతే తెలిసిన డాక్టర్ దగ్గరకు తీసుకెళ్దామని వచ్చాను. మీరు ధైర్యంగా ఉండండి. సర్ వచ్చేస్తారు. మిమ్మల్ని పిల్లల్ని వదిలి వారు మాత్రం […]

మోదుగ పూలు – 10

రచన: సంధ్య యెల్లాప్రగడ సూర్యుడు పశ్చిమం వైపుకు సాగుతున్నాడు. అడవిలో కాలిబాట మీద జాగ్రత్తగా తోలుతూ రాము ఒక కూలిపోతున్న కోట దగ్గర ఆగాడు. అప్పటికి వాళ్ళు ‘చెట్టు దేవర’ దగ్గర్నుంచి బయలుదేరి తూర్పు దిశకు వచ్చి దాదాపు నాలుగు గంటలయ్యింది. ఒక చెట్టు క్రింద బండి ఆపి దిగారు మిత్రులిద్దరూ. తమతో తెచ్చుకున్న బ్యాగు లోంచి చక్కినాలు తీసి తిన్నారు ఇద్దరూ. చెట్టు దగ్గర పట్టుకున్న నీరు త్రాగారు. “ఇది దేవరకోట. ఇది దాటాక మనకు […]

చంద్రోదయం . 28

రచన: మన్నెం శారద ఆ సమయంలో వాళ్ళు అక్కగారి సంగతి తెలిసి ఆందోళన చెందడం మంచిది కాదు. పరీక్షలు సరిగ్గా వ్రాయలేరు. అందుచేత ఆ వుద్ధేశ్యం విరమించుకున్నాడు సారథి. స్వాతి కోలుకోటానికి చాలా రోజులు పటింది. ఆమె మానసికంగా బలహీనురాలయిపోయింది. సారథి జాగ్రత్తగా ఆమెని గమనిస్తున్నాడు. చిన్న చప్పుడయితే పెద్దగా అరిచేది. ఉండి ఉండి వెక్కి వెక్కి ఏడ్చేది. భయంతో బిగుసుకుపోయేది. హిస్టీరికల్‌గా ఫీలవుతున్న ఆమెని చూసి బాధపడేవాడు సారథి. సున్నితమైన ఆమె హృదయం బలంగా దెబ్బతిన్నదని […]

వెంటాడే కథలు – 8

నా వృత్తిలో భాగంగా దేశ దేశాల కథలు, మనదేశానికి చెందిన తెలుగు, తెలుగేతర కథలూ వేలకొద్దీ చదివాను. వాటిలో కొన్ని ఎప్పటికీ మరుపుకు రావు. ఎల్లవేళలా మనసుని వెంటాడుతూనే ఉంటాయి. అవి ఏ భాషలో వచ్చాయో.. రచయితలెవరో, అనువాదకులెవరో గుర్తులేకపోవడం నా దురదృష్టం. అలాంటి కథలు నెలకొకటి చొప్పున నా మాటల్లో క్లుప్తంగా చెబుతాను. పాఠకులెవరైనా ఇది ఫలానా వారి కథ, ఫలానా భాష కథ అని గుర్తుపడితే మరీ సంతోషం. ఆ రచయిత గురించి తరువాతి […]

తాత్పర్యం – దిగడానికి కూడా మెట్లు కావాలి

రచన: – రామా చంద్రమౌళి రాత్రి పదీ నలభై నిముషాలు. డిల్లీ రైల్వే ప్లాట్ ఫాం నంబర్ పన్నెండు. అటు చివర. ఎప్పటిదో. పాతది. దొడ్డు సిమెంట్ మొగురాలతో. సిమెంట్ పలకతో చేసిన బోర్డ్. పైన పసుపు పచ్చని పెయింట్ మీద నల్లని అక్షరాలు. ‘నయీ ఢిల్లీ ‘. పైన గుడ్డి వెలుగు. కొంచెం చీకటికూడా. వెలుతురు నీటిజలలా జారుతుందా. కారుతుందా. చిట్లుతుందా. ప్రవహిస్తుందా. వెలుతురుపై. కురుస్తూ. వెలుతురును కౌగలించుకుంటూ.. సన్నగా. మంచుతెర. పైగా పల్చగా చీకటి […]

పరవశానికి పాత(ర) కథలు – చరిత్ర శిధిలం

డాక్టర్. కె.వివేకానందమూర్తి (యు.కె) ఉన్నట్టుండి ఏదో భరించలేని శబ్ధం గుండె బ్రద్దలు చేసింది. అధిగమించిన వేగంతో పరిగెత్తుతున్న బస్సు ప్రయాణీకులందర్నీ ఒక్కసారి కుదిపి. బాణం తగిలిన పక్షిలా కీచుమంటూ అరచి హఠాత్తుగా ఆగిపోయింది. డ్రైవరు కిందికి దిగేడు. చక్రాలవైపు వొంగి పరిశీలనగా చూస్తూ అన్నాడు – ‘దిగండి, బండి దెబ్బతింది’. కండక్టరు కూడా దిగి చూసేడు. అదే మాట తనూ చెప్పేడు. ప్రయాణీకులందరం క్రిందికి దిగేం. వెనుకపైపు వెలికివచ్చిన చక్రాలకేసి చూస్తూ డ్రైవరు కండక్టరుతో ఏదో మాట్లాడుతున్నాడు. […]

సాఫ్ట్‌వేర్ కధలు – అప్నా టైం ఆయేగా ?

రచన: రవీంద్ర కంభంపాటి శైలజ ఇంటికి వచ్చి, బయట చెప్పులు విప్పుకుంటూంటే, ఇంట్లో నుంచి అత్తగారి మాటలు వినిపిస్తున్నాయి. ‘అవును.. శైలజ కి కూడా అమెరికా కి వీసా వచ్చింది.. ఊహూ.. అఖిల్ కి డిపెండెంట్ గా కాదు.. వాళ్ళ కంపెనీ వాళ్ళే చేయించేరు.. ఒకవేళ వీసా రాకపోయినా ఊరుకోడుగా.. తన డిపెండెంట్ గానైనా తీసుకుపోతాడు ‘ అంటూ ఆవిడ ఎవరితోనో చెప్పుకుపోతూంది. లోపలికి వచ్చిన శైలజ ని చూసి, ‘పాపం వాడు ఇంకా ఆఫీస్ లోనే […]