April 25, 2024

మాలిక పత్రిక జూన్ 2022 సంచికకు స్వాగతం

Jyothivalaboju Chief Editor and Content Head   మాలిక పాఠక మిత్రులకు, రచయితలకు, మిత్రులకు సాదర ఆహ్వానం.. వేసవి వడగాడ్పులనుండి ఉపశమనం పొందే తరుణం ఆసన్నమయింది. చిరుగాలులు, ముసురేసిన మబ్బులతో, అప్పుడప్పుడు పలకరించే చినుకులతో శరీరంతోపాటు మనసును కూడా చల్లబరిచే కాలం నేనొస్తున్నానొస్తున్నా అంటోంది.. మండువేసవిలో చినుకుల కోసం ఎదురుచూపులు, భారీ వర్షాల తాకిడికి తల్లడిల్లిపోతాము. తర్వాత చలికి గిజగిజలాడి ఎండకోసం వెతుకులాడుతాము. మనం ఎలా ఉన్నా, ఏమనుకున్నా కాలచక్రం ఆగదు. తన పని తను […]

వెంటాడే కథలు – 9

నా వృత్తిలో భాగంగా దేశ దేశాల కథలు, మన దేశానికి చెందిన తెలుగు, తెలుగేతర కథలూ వేలకొద్దీ చదివాను. వాటిలో కొన్ని ఎప్పటికీ మరుపుకు రావు. ఎల్లవేళలా మనసుని వెంటాడుతూనే ఉంటాయి. అవి ఏ భాషలో వచ్చాయో.. రచయితలెవరో, అనువాదకులెవరో గుర్తులేకపోవడం నా దురదృష్టం. అలాంటి కథలు నెలకొకటి చొప్పున నా మాటల్లో క్లుప్తంగా చెబుతాను. పాఠకులెవరైనా ఇది ఫలానా వారి కథ, ఫలానా భాష కథ అని గుర్తుపడితే మరీ సంతోషం. ఆ రచయిత గురించి […]

సాఫ్ట్‌వేర్ కథలు – తైర్ సాదమ్

రచన: కంభంపాటి రవీంద్ర అర్ధరాత్రి ఒంటి గంటకి మా మేనేజర్ నుంచి మెసేజ్.. మర్నాడు ఉదయాన్నే ఆఫీసులో కలవమని. చాలాకాలం నుంచి అతనితో పని చేస్తున్నానేమో , మెసేజ్ లో వివరాలు లేకపోయినా ఎందుకు కలవమన్నాడో సులభంగానే ఊహించగలను. కొత్త ప్రాజెక్ట్ ఏదో వచ్చినట్టుంది, నన్ను టేకప్ చెయ్యమని అడుగుతాడు. నిజమే..నేను ఊహించినట్టే ..ఉదయం కలవగానే , “కొత్త ప్రాజెక్ట్ వచ్చింది , నన్ను టేకప్ చెయ్యమని” చెప్పేడు. ఆ తర్వాత రెండు రోజులూ ప్రాజెక్టు స్కోప్ […]

పరవశానికి పాత(ర) కథలు – పోలీ శాంతీ మియా వీరా?

రచన: డా. వివేకానంద మూర్తి ఎవరన్నారో, ఎందుకన్నారో తెలీదుగానీ, అలా నోరు నెప్పిజేసి దవళ్ళు వాచేలా – అనగా అనగా ఒక రాజు అప్పుడే సాయంత్రాన్ని సాగనంపేసిన ఒక రోజు ప్రపంచాన్ని చల్లగాను, ప్రేమికుల్ని వేడిగానూ పరిపాలించటం ప్రారంభించేరు. ఆ రాజుగారి చూపులు విస్తృతంగా విస్తరించి విశాలంగా, విలాసంగా వున్నాయి. అది విశాఖపట్నంలో “లాసన్స్ బే’ తీరంలో వున్న శాంతి ఆశ్రమంలోనికి కూడా చొచ్చుకుని, అక్కడ ఏపుగా పెరిగిన సరుగుడు చెట్లని వొరుసుకుంటూ వచ్చి నేల మీదికి […]

ధృతి పార్ట్ – 12

రచన: మణి గోవిందరాజుల కాలేజీ వార్షికోత్సవ వేడుకలు దగ్గరికొస్తున్నాయి. ఇదే ఇక ఆఖరు సంవత్సరం అని ధృతి కూడా అన్నిట్లో ఉత్సాహంగా పేరు ఇచ్చింది. క్లాస్మేట్స్ అందరూ కూడా ఫస్ట్ ఇయర్ చేసిన డ్యాన్సే మళ్లీ చేయమని వెంటపడ్డారు. కాని ధృతికి అందరికీ గుర్తుండిపోయేలా ఏదైనా మంచి ప్రదర్శన ఇవ్వాలని ఉన్నది. ఎప్పటిలానే స్పోర్ట్స్ ఒక రోజు, మధ్యలో ఒక రోజు రెస్ట్ ఇచ్చి కల్చరల్ ఆక్టివిటీస్. కాలేజీ మొత్తం వెల్ నోటెడ్ అయిన ధృతికి ఇది […]

తాత్పర్యం – దృష్టిని బట్టి దృశ్యం

రచన:- రామా చంద్రమౌళి ” నాన్నా! వీనికేదైనా మంచి పేరు సూచించండి” అంది డాక్టర్ దుర్గ. అప్పుడు నగరంలోనే అతి పెద్ద వ్యాపారవేత్త.. దుర్గ భర్త నీలకంఠం కూడా అక్కడే ఉన్నాడు ప్రక్కన. అదొక అతిపెద్ద కార్పొరేట్ దవాఖాన. దుర్గ తండ్రి వెంకటశేషయ్య దుర్గవైపూ.. అల్లుడు నీలకంఠం వైపూ నిరామయంగా చూచి అన్నాడు “ఊర్కే ఏదో మర్యాదకోసం అడిగి.. నేనేదో చెప్పగానే విని.. పెదవి విరిచి.. మళ్ళీ మీకు నచ్చిన పేరేదో మీరు పెట్టుకుంటే అది నన్నవమానించినట్టవుతుంది.. […]

చంద్రోదయం – 29

రచన: మన్నెం శారద సారథి గుంటూరు నుంచి తిరిగొచ్చేడు. స్వాతి అతని చేతిలోని సూట్‌కేస్ అందుకుంటూ “అందరూ బాగున్నారా?” అంది ఆత్రంగా. “ఆ!” అన్నాడు సారథి లోపలికి వస్తూ. సారథి మాటలకి నానీ పక్కమీంచి లేచి అతని వడిలోకి దూకేడు. “డాడీ! ఎప్పుడొచ్చేవు?” “ఇప్పుడే” అన్నాడు సారథి నానీని ముద్దు పెట్టుకుంటూ. స్వాతి కాఫీ తీసుకొచ్చింది. సారథి కప్పు అందుకుంటూ “థాంక్యూ” అన్నాడు. స్వాతి ఆశ్చర్యంగా సారథి ముహంలోకి చూసింది. అదే క్షణం అతను కూడా ఆమెని […]

మోదుగ పూలు – 11

రచన: సంధ్య యెల్లాప్రగడ వివేక్‌ లేచి కూర్చున్నాడు. చేయి విపరీతంగా సలుపుతోంది. రామును చూస్తే అతని తల నుంచి రక్తం కారుతోంది. క్షణం పాటు కళ్ళు తిరిగినట్లుగా అనిపించింది. లేచి బండికున్న బ్యాగులోంచి ఒక టవల్ తీసి రాము తలకు కట్టు కట్టాడు. ముందు రక్తం కారటం ఆగాలి. అతని తలకు కట్టాక, మరో టవల్ తీసుకొని చేతికి కట్టుకున్నాడు. “దగ్గరలో మనకు ఆసుపత్రి ఉంటుందా?” అడిగాడు ఊపుతూ రాముని. “ఆ… ఆ రోడ్డు సీదా పో!” […]

అమ్మమ్మ – 36

రచన: గిరిజ పీసపాటి అన్నపూర్ణ గారు రెండు కాఫీ గ్లాసులు తెచ్చి వసంత చేతికిచ్చి “తమ్ముడికి, చెల్లికి ఇచ్చి రామ్మా!” అనడంతో మారు మాట్లాడకుండా గ్లాసులందుకుని, తమ ఇంట్లోకెళ్ళి ఇద్దరికీ కాఫీ ఇచ్చి వచ్చింది వసంత. మరో రెండు గ్లాసుల కాఫీ తెచ్చి తల్లీకూతుళ్ళకి ఇచ్చారావిడ. మౌనంగా కాఫీ తాగేసి తాము వచ్చిన విషయం చెప్పింది నాగ. ఆవిడ ఎప్పటిలాగే ప్రశాంతంగా అంతా విని “తప్పకుండా మీ అన్నయ్య గారు ఆయనకు ఫోన్ చేసి చెప్తారు. మీరు […]

వెళ్ళాం! వొచ్చాం!

రచన: జె. యు. బి. వి. ప్రసాద్‌ “ఓ వరలక్ష్మొదినా! పనిలో వున్నావా?” అంటూ పార్వతి, పెరటి గోడ మీద నుంచి, పక్కింటి పెరట్లోకి చిన్న కేక పెట్టింది. “పనెప్పుడో అయిపోయింది. ఒక కునుకు కూడా తీసి, లేచి, కాఫీ తాగేశాను. మీ అన్నయ్య గారు ఇంకా శయనాగారం లోనే వున్నారు. ఎప్పుడు పిలుస్తావా? – అని ఎదురు చూస్తున్నాను ఇందాకట్నించీ!” అంటూ ఒక్క పరుగున ఆ గోడ దగ్గిరికి వొచ్చేసింది, నేస్తం వరలక్ష్మి. “మేం వచ్చే […]