April 20, 2024

అమ్మ

రచన: లక్ష్మీ ఏలూరి

అవని పైన నడయాడే దేవత అమ్మ।
అనురాగం పంచే మాతృమూర్తి అమ్మ।
మాతృదేవోభవ। అని వందన నమస్సులు అమ్మకు।
మన ఉనికికి ఆద్యం అమ్మేగా।

తను పునర్జన్మ ఎత్తి మనకు
జన్మనిచ్చినది అమ్మ।
తప్పటడుగులు నుంచి తప్పుటడుగులవరకు
పడకుండా కాపాడుతుంది అమ్మ।

కొవ్వొత్తిలా తాను కరుగుతూ,
మనకు జ్ఞానమార్గాన్ని ప్రసాదించేది అమ్మ।
అమ్మ ప్రేమ అనంతమయినది।

అమ్మ ప్రేమకు విలువ కట్టే బేహారి
ఈ జగతిలో లేనే లేడు।
మనం ఉన్నతస్థాయికి ఎదిగితే,
తానే మకుటం లేని మహారాణీ అని మురిసేది।

సంసార సాగరంలో ఆటుపోట్లను ఒడ్డి,
మన జీవిత నావకు చుక్కాని వేసి దరికి చేర్చేది,
తాను మునిగినా మన ప్రాణానికి తన ప్రాణం అడ్డు వేసి
ఆ…యముని సైతం ఎదిరించే ధీశాలి అమ్మ।

సకల చరాచర సృష్టికి మాతృరూపేణ ప్రతిరూపం అమ్మ।
ఇన బింబం ఎఱుపుదనంలో అమ్మ నొసటి బొట్టును।
పున్నమి నాటి వెన్నెల చల్లదనంలో,
అమ్మ ప్రేమ కమ్మదనాన్ని।

గోమాత “అంబా”అనే పిలుపులో అమ్మ
ప్రేమలోని మాధుర్యమును।
చూసే కనులకు ప్రతి చరాచర జగత్తులో,
గోచరిస్తుంది అమ్మ।

ఎమి..! ఇచ్చి నా ఈ జన్మలో తీర్చలేని
ఋణం అమ్మది।
అమ్మ అంటే అనంతమైన మమకారం।

1 thought on “అమ్మ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *