March 29, 2024

పెద్ద కొడుకు

రచన : ముక్కమల్ల ధరిత్రీ దేవి వంటకాలన్నీ డైనింగ్ టేబుల్ మీదకు చేర్చి, అన్నింటినీ ఓ సారి పరకాయించి చూసింది పావని. ” అమ్మయ్య! అన్నీ పెట్టేసాను. . ” అనుకుంటూ నిట్టూర్పు విడిచి, ఓ నిమిషం అక్కడే చైర్ లో కూర్చుని పైటకొంగుతో మొహమంతా తుడుచుకుంది. సంక్రాంతి పండక్కి వచ్చిన మరిది, ఆడపడుచులు ఊర్లో బంధువుల్ని కలిసొస్తామంటూ వెళ్లారు. భర్త వెంకటరెడ్డి పొలంలో పని ఉందంటూ ఉదయమే వెళ్లాడు. పిల్లలంతా బయట ఆడుకుంటున్నారు. నెమ్మదిగా లేచి […]

శ్రీగణేశ చరిత్ర

రచన: నాగమంజరి గుమ్మా 101 ముల్లోకమ్ముల జనులకు కల్లోలము సేయుచున్న కర్కశ దనుజుల్ ఉల్లము దలచిన కదిలెడు ఇల్లులు గట్టుకు తిరుగుచు నిడుముల పెట్టెన్ భావం: మూడు లోకాలలో ఉన్న ప్రజలను బాధలు పెడుతున్న రాక్షసులు మనసులో తలచుకోగానే కదిలే ఇళ్లు కట్టుకుని నానా కష్టాలు పెడుతున్నారట. (త్రిపురాసురుల వృత్తాంతం) 102 వ పద్యం అసురుల బాధల కోర్వక వెసవెస వేల్పులు కదిలిరి వెన్నుని కొలువన్ అసురుల కిచ్చిన వరములె లసకమ్మౌ సమయమిదని లచ్చిమగడనెన్ భావం: రాక్షసుల […]

దేవశర్మ పత్ని- రుచి

రచన: శ్యామసుందర రావు ఈ కధను భీష్ముడు అంపశయ్య మీద ఉండగా తన దగ్గరకు వచ్చిన ధర్మరాజుకు అనేక నీటి సూత్రాలు , ధర్మబోధ చేస్తూ చెపుతాడు. ఆడవాళ్ల కోసము యుద్దాలు జరగటం అనేది చరిత్రలో సర్వసాధారణంగా జరిగేదే మనము ఎప్పటి నుంచో వింటున్నదే. చివరకు మేధావులు ఆడదాని మనస్సును తెలుసుకోవటం కష్టము అని సింపుల్ గా తేల్చేశారు. దీనికి ఉదాహరణగా పురాతనకాలములోని భారతములోని కథ చెప్పుకుందాము. పూర్వము దేవశర్మ అనే బ్రాహ్మణుడికి రుచి అనే సౌందర్యరాశి […]

నీ కోసమై నేను

రచన: డా. బాలాజీ దీక్షితులు పి.వి నీ చూపులు దూసే బాణలు నీ పెదవులు లాగే అయస్కాంతాలు నీ అందాలు కాల్చే వలపు కణికలు నీ వంపులు కోసే చురకత్తులు నీపై మేరువులు రాజేసే రవ్వల కేరింతలు నీవు నిలువెళ్ళా కాటేస్తుంటే….. నేను మూగపోయాను నేను నీతో మనసు విప్పి మాట్లడాలనుకున్నా… నీవు తప్పించుకుపోయావు నేను నీ గుండెన నిలిచి పోవాలనుకున్నా నీవు అమాంతం అదృశ్యమయ్యావు కానీ నీ కోసమై నేను

అమ్మ

రచన: లక్ష్మీ ఏలూరి అవని పైన నడయాడే దేవత అమ్మ। అనురాగం పంచే మాతృమూర్తి అమ్మ। మాతృదేవోభవ। అని వందన నమస్సులు అమ్మకు। మన ఉనికికి ఆద్యం అమ్మేగా। తను పునర్జన్మ ఎత్తి మనకు జన్మనిచ్చినది అమ్మ। తప్పటడుగులు నుంచి తప్పుటడుగులవరకు పడకుండా కాపాడుతుంది అమ్మ। కొవ్వొత్తిలా తాను కరుగుతూ, మనకు జ్ఞానమార్గాన్ని ప్రసాదించేది అమ్మ। అమ్మ ప్రేమ అనంతమయినది। అమ్మ ప్రేమకు విలువ కట్టే బేహారి ఈ జగతిలో లేనే లేడు। మనం ఉన్నతస్థాయికి ఎదిగితే, […]