March 29, 2024

ప్రకృతి మాత

రచన: లక్ష్మీ ఏలూరి

ఎవరు సారె పెట్టారమ్మా ?
పుడమి తల్లికి పచ్చలకోక।
అమ్మ బిడ్డలకు ఆనందమాయా।
కళకళలాడుతున్న అమ్మ ముఖబింబం కాంచి।

ఆర్ణవంకి ఎవరు నేర్పారమ్మా?
తను పరిశుభ్రంగా ఉండి, తనలోని,
జీవజాలాన్ని పదికాలాలపాటు
పదిలంగా ఉంచమని।

తనమీద పదేపదే తిరిగే నౌకలకు,
చెత్తాచెదారం, కాలుష్యభూతాన్నివదిలి,
తనకూ,తనలోని జీవజాల మనుగడకు,
ఆటంకం కలిగించవద్దని చేతులు జోడించి,
వేడుకుంటుంది।

పచ్చల పందిరేసి, తనతో మనుగడ
సాగించే పులుగూ, పుట్రకూ స్వేచ్ఛగా,
జీవించనీయమని , చేతులెత్తి వేడుకుంటూ,
ఆ అడవితల్లి,।

నన్ను మీరు కాపాడితే, నేను మీముందు,
తరాలకు స్వచ్చమైన వాతావరణం,
ప్రసాదించుతాను అని ప్రకృతిమాత మాట ఇస్తే
అడవిలో స్వేచ్చగా తిరిగే జీవులను।
వరదలు రాకుండా తమ వేళ్ళను అడ్డువేసే మానులను।
పురివిప్పి నాట్యం చేస్తున్న మయూరాలను।
కెంజిగురులు తిని వగరెక్కిన నోటితో,
పాటపాడే కోయిలమ్మను।

పూవు పూవుకూ తిరిగి మకరంధం,
సేకరించే తేనెటీగలను మన ముందు తరాలకు।
చిత్రంలోమాత్రమే చూపించే దుర్గతి పట్టకుండా।

ప్రతి మానవుడు తన వంతుగా,
ఒక చెట్టు నాటి పెంచితే..!
తన వారసులకు చల్లనినీడను,
తియ్యని పండ్లను, స్వచ్చమైన వాతావరణం
బహుమతిగా అందుతుంది।

నన్ను మీరు కాపాడండి నేను,
మిమ్మల్ని కాపాడుకోంటాను,
అని భరోసా ఇస్తుంది పర్యావరణ మాత।

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *