April 19, 2024

‘ఆర్డినరీ’ మనిషి. . .! ఎక్స్ట్రార్డినరీ జర్నీ !!

రచన: ధరిత్రిదేవి. ఎమ్ “అబ్బ! ఏమిటీ, నా కాళ్లు ఇలా ఇరుక్కుపోయాయి! బాబోయ్!. . రావడంలేదేంటి?. . ” మగతగా కళ్ళు మూసుకుని కునికిపాట్లు పడుతున్న పరమేశ్వర్రావు ఒక్కసారిగా కళ్ళు తెరిచి సీటులోంచి కదలబోయాడు. కానీ సాధ్యం కాలేదతనికి. ఎందుకో అర్థం కాక అటూ ఇటూ చూశాడు. ముందు సీటులో బైఠాయించిన ఆసామీ ఇంట్లో డన్‌లప్ బెడ్ మీద ఆరాంగా పడుకున్న చందాన వెనక్కి జారగిలబడి ఎంచక్కా నిద్రిస్తున్నాడు. అతను బస్సులో ప్రయాణిస్తున్నానన్న స్పృహలో కూడా ఉన్నట్టు […]

తథాస్తు

రచన: సి. హెచ్. ప్రతాప్ సీతాపురంలో కృష్ణయ్య, రాధమ్మ అనే దంపతులు వుంటున్నారు. వారికి కడు బీద కుటుంబం. పెళ్ళయి పదేళ్లయినా పిల్లలు కలగలేదు. జరుగుబాటు కష్టం అవుతున్నా నైతిక విలువలకు, మానవత్వానికి పెద్ద పీట వేసేవారు ఆ దంపతులు. తాతల కాలం నాటి పది సెంట్ల స్థలంలో ఇల్లుకు పోగా మిగిలిన జాగాలో కూరలు పండిస్తూ, వాటిని బజారులో అమ్ముకొని, వచ్చిన డబ్బుతో తృప్తిగా జీవించేవారు. ఏనాడు కూడా తమది కష్టంతో కూడుకున్న జీవితం అని […]

అందమైన అనుబంధం

రచన: రాజ్యలక్ష్మి బి “బావా, మన పెళ్లి జరగబోయే ముందు నీతో నా మనసులోని భావాలు పంచుకోవాలనుంది “అన్నది సరస్వతి కృష్ణవంశీతో. “సరూ, నా దగ్గర మొహమాటమెందుకు? తప్పకుండా పంచుకుందాం. సాయంకాలం గుడి దగ్గర పార్కులో కలుద్దాం “అన్నాడు వంశీ. ఇద్దరూ పార్కులో కలిసారు. “బావా మనం చిన్నప్పట్నుంచి బావామరదళ్ళుగా పెరిగాం, అరమరికలు లేకుండా ఆడుకున్నాం, పాడుకున్నాం. నీ మనసేమిటో నాకు తెలుసు, నా మనసేమిటో నీకు తెలుసు. నా చదువు ఇంటర్మీడియట్ తో ఆగిపోయింది. నువ్వు […]

చాణక్యనీతి – సువర్ణసుగంధం.

కథా రచన:- పంతుల ధనలక్ష్మి. “ఏమండీ! ఆషాఢమాసం వెళ్ళిపోతుంది. ”అన్నారు తాయారుగారు. “అయితే ఏమిటే? కాలాలు ఋతువులు, సంవత్సరాలు వస్తాయి, వెళతాయి ఆషాఢం కూడా అంతే”అన్నారు పరంధామయ్యగారు. “అలాకాదండీ! ఈ ఆషాఢం వేరు. ఆ ధనలక్ష్మీమాల్ లో శ్రావణమాసం కాసులకీ , హారాలకి, ముఖ్యంగా ముక్కుపుడకలకి మంచిగంధపు వాసన వచ్చేటట్టు తయారుచేసి అమ్ముతున్నారట. అదీ ఆషాఢం నెలాఖరు రోజు మాత్రమే! మంచి గంధంతో బంగారం ఎంత బాగుంటుందో కదా! ” అంది తాయారు. “నీ మొహం! బంగారానికి […]

శక్తిని భక్తిని చాటే మొగ్గలు

సమీక్ష: – బోల యాదయ్య హనుమాన్ చాలీసా (మొగ్గలు) తెలుగు సాహిత్యం లోకహితమై పుట్టింది. సాహిత్యం ఏదైనా ప్రజలకు మనోధైర్యాన్ని ప్రసాదించి వారిలో చైతన్యాన్ని నింపుతుంది. ప్రపంచ సాహిత్యం మొత్తం పరిశీలన చేసి చూస్తే, ఎందరో ఆదర్శనీయమైన ఆచరణాత్మకమైన జీవితాలను మన ముందుంచారు. అవి ఆధ్యాత్మికపరమైనవి కావొచ్చు. సామాజికపరమైనవి కావొచ్చు. ఎవరు ఏమి చెప్పినా, ఏది రాసినా ధర్మం, న్యాయం, నిలబడే విధంగా ప్రజాహితమైన సాహిత్యాన్నే రాస్తారు. అది వారికి నచ్చిన, మెచ్చిన ప్రక్రియలలో రాస్తారు. కాటేగారి […]

చిత్రగుప్తుడు

రచన: శ్యామసుందరరావు యమగోల యమలీల లాంటి హిందూ దేవుళ్లను కించపరిచే సినిమాల పుణ్యమా అని పురాణాల్లోని ఉదాత్తమైన పాత్ర చిత్రగుప్తుడు ఒక హాస్య పాత్రగా మన మనస్సుల్లో ముద్ర పడింది నిజానికి చిత్రగుప్తుడు బ్రహ్మ యొక్క పదిహేడు మంది మానసపుత్రులలో ఒకడు. యమధర్మరాజుకు ధర్మ నిర్వహణలో సహాయకుడిగా ఉంటూ భూలోకవాసుల మరణానంతరము వారి పాప పుణ్యాల అనుగుణముగా వారికి న్యాయ బద్ధముగా ఏ విధమైన పక్షపాత ధోరణి లేకుండా శిక్షలు నిర్ణయించటంలో యమధర్మ రాజుకు సహకరించే వ్యక్తి […]

చంటోడి స్వగతం

రచన: గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్ పుట్టగానే ఏడ్చా పరమాత్ముని వీడి పుడమిపై పడ్డందుకు క్షీరం కుడిపితే త్రాగా కన్నతల్లి ప్రేమరుచిని కనుగొనేందుకు వంటిపైన చెయ్యేస్తే స్పర్శానుభూతిని పొందా హాయిగా నిదురబోయా నాన్న ఎత్తుకుంటే నాకు కావలసినవాడని నేను మురిసిపోయా ఉయ్యాలలోవేసి ఊపితే గాలిలో తేలిపోతున్నట్లుగా సంబరపడిపోయా ప్రక్కవాళ్ళు పలకరిస్తే పరిచయం చేసుకుంటే పకపక నవ్వా అన్నను చూశాక ఆటలు ఆడాలని ఆరాటపడ్డా అక్క పలకరించాక అనురాగం ఆప్యాయతలను అందరికి అందించాలనుకున్నా అంగీ తొడిగితే అంగాలకు రక్షణ దొరికిందని అనందపడిపోయా […]

తొలకరి జల్లు

రచన: ప్రకాశ లక్ష్మి రోహిణీ కార్తె ఎండ ప్రతాపానికి, దప్పికతో కడబట్టి అర్రులు చాచి, అల్లాడి, నెఱ్ఱెలిచ్చిన ధరణి ఎదురుచూసె, తొలకరి చినుకు రాకకొరకు వేయికనులతో। నీటి చెలమలు, చెఱువులు, బావులు, నీరు అడుగంటి, ఆకాశం వంక ఆత్రంగా చూసె, వాటిలోని జలచరాలు ఆశగా ఎదురు చూసె, తొలకరి చినుకు ఎన్నడు విందు చేయునా అని। కొండాకోనా తమ మేనిని మలయమారుత, సుగంధ సువాసన భరితమైన, లేత చిగురాకుల సోయగాల హొయల కొరకు, తొలకరి చినుకుకు ఆహ్వానం […]

వస్తున్నా నేను

రచన: కుమార్ జొన్నలగడ్డ కాలనిశ్శబ్దపు పొరలలో నిద్రిస్తున్నా నేను అమ్మ గర్భంలోని వెచ్చదనం ఆస్వాదిస్తున్నా నేను నన్ను చూద్దామన్న అమ్మ తపనను చూస్తున్నా నేను జాగు చేయను అమ్మా…నిన్ను చూడాలని వస్తున్నా నేను అమ్మ రూపు పొంది నేను..మహాలక్ష్మి అన్న పిలుపు ఆస్వాదిస్తున్నా నేను బుడి బుడి అడుగులతో గజ్జెల సవ్వడితొ అమ్మని మురిపిస్తున్నా నేను కాలంతో పరుగిడుతూ వడివడిగా వయసుకొచ్చి బొమ్మనయ్యాను నేను పొగాలము దాపురించ మగాడిదల మృగతృష్ణకు బలయ్యాను నేను నిశ్శబ్దపు నిశీధిలో నిద్రిస్తున్నా […]