రచన: కుమార్ జొన్నలగడ్డ
కాలనిశ్శబ్దపు పొరలలో నిద్రిస్తున్నా నేను
అమ్మ గర్భంలోని వెచ్చదనం ఆస్వాదిస్తున్నా నేను
నన్ను చూద్దామన్న అమ్మ తపనను చూస్తున్నా నేను
జాగు చేయను అమ్మా…నిన్ను చూడాలని వస్తున్నా నేను
అమ్మ రూపు పొంది నేను..మహాలక్ష్మి అన్న పిలుపు ఆస్వాదిస్తున్నా నేను
బుడి బుడి అడుగులతో గజ్జెల సవ్వడితొ అమ్మని మురిపిస్తున్నా నేను
కాలంతో పరుగిడుతూ వడివడిగా వయసుకొచ్చి బొమ్మనయ్యాను నేను
పొగాలము దాపురించ మగాడిదల మృగతృష్ణకు బలయ్యాను నేను
నిశ్శబ్దపు నిశీధిలో నిద్రిస్తున్నా నేను
సమాధి గోడల వెచ్చదనం ఆస్వాదిస్తున్నా నేను
లోకంలో ఆడవారికి రక్షణనిచ్చే ప్రదేశానికై వెదుకుతున్నా నేను
మాతృగర్భం సమాధి తల్పం మాత్రమే సరైన ప్రదేశాలని చెబుతున్నా నేను
1 thought on “వస్తున్నా నేను”