March 19, 2024

మాలిక పత్రిక సెప్టెంబర్ 2022 సంచికకు స్వాగతం..

  ఓ గం గణపతియే నమ: ఈ మంత్రం చాలా విశేషమైంది. అంటే దేవతల ప్రభువుకు వందనం చేస్తున్నానని దీని అర్థం. గణపతి మూలాధార చక్రానికి అధిపతి. అందువల్ల ఈ మంత్రంతో మూలధార చక్రానికి శక్తి లభించి ఉత్తేజితమవుతుంది. మాలిక పత్రిక పాఠకులు, రచయితలకు స్వాగతం సుస్వాగతం.. విఘ్నేశ్వరుడు మీ అందరికీ శుభాలు కలిగించాలని కోరుకుంటున్నాము. రాబోయేవి పండగరోజులు. సంతోషాల సంబరాలు రోజులు.. మాలిక పత్రిక మీకోసం ఎన్నో కొత్త కొత్త కథలు, సీరియళ్లు అందించబోతోంది. ముందు […]

చంద్రోదయం – 32

రచన: మన్నెం శారద స్వాతి సారథి బేంక్ కెళ్లగానే జానకమ్మని పిలిపించింది రహస్యంగా. “పిన్నిగారూ! నాకు మళ్లీ అనుమానంగా వుంది. డాక్టరు దగ్గరకెళ్దాం” అంది భయంగా. జానకమ్మ స్వాతిని తేరిపారా చూసింది.”నువ్వు చదువుకున్నావ్ గాని బొత్తిగా బుద్ధిలేదే అమ్మాయ్. ఇప్పటికే రెండుసార్లయింది. మొన్నటిసారే మూల్గుతూ ప్రాణానికి ముప్పంటూ నసిగి విసిగి చేసింది. ఈసారి వెళ్తే మొహన్నే వూస్తుంది. నావల్ల కాదు బాబు” అంది. స్వాతి “అలా అంటే ఎలా పిన్నిగారూ, మీరు కాకుంటే నాకెవరు దిక్కు?” అంది […]

అమ్మమ్మ – 39

రచన: గిరిజ పీసపాటి అయినా, వచ్చిన కార్యం ముఖ్యమైనది కనుక ప్రసన్నంగానే ఆయనతో “అవన్నీ నిజం కాదు మామయ్యగారు. ఒక్కసారి ఇంటికి రండి. ఇన్నాళ్లు మేమెందుకు అక్కడికి రాలేదో, అసలు ఆయనకి, నాకు మధ్య జరిగిన గొడవేమిటో వినండి. ఆ తర్వాత మీరే శిక్ష విధించినా నేను, పిల్లలు భరిస్తాము. ఈ ఒక్కసారి నా మాట మన్నించండి” అని వేడుకుంది. “నన్ను అభిమానించేవారు, నేను తమ ఇంటికి వస్తే చాలు అనుకునేవారు చాలామంది ఈ ఊరిలో ఉన్నారు. […]

జీవన వేదం -1

ఏదేశమేగినా ఎందుకాలిడినా ఏ పీఠమెక్కినా – భారతీయత ఔన్నత్యమే వేరు. భారతీయ జీవన విధానం అపూర్వం అద్వితీయం. వేరు పురుగుల్లా, బురదలో దొర్లే జీవాల్లా ఎందరున్నా అక్షయ పాత్రల్లా ఆర్తులకు అండగా నిలిచేవారు, ధర్మాన్ని మరచిపోని మహాత్ములు ఉన్నంతవరకు ఈ ధర్మపధం ఈ యాత్ర కొనసాగుతాయి. బ్రతుకు బ్రతకనివ్వు అదే జీవన వేదం. రచన: స్వాతీ శ్రీపాద ఆది దేవ నమస్తుభ్యం …. ప్రసీద మమ భాస్కరః ప్రభాకర నమస్తుభ్యం దివాకర నమోస్తుతే …. సరిగ్గా ఉదయం […]

మోదుగపూలు – 14

రచన: సంధ్యా యల్లాప్రగడ వివేక్‌ స్కూలుకు వచ్చిన గంటకు వచ్చింది నాగలక్ష్మి. అప్పటికీ వివేక్‌ స్కూలు గ్రౌండులో పనిలో ఉన్నాడు. ఆమెను చూసి దగ్గరకు వచ్చాడు. “నా రూము ఇక్కడే అక్కడికి వెళదామా?” అడిగాడు ఆమెను. తల ఊపి “పద బిడ్డా!” అంది. “ఎమన్న తిన్నావా? తింటావా?” అంటూ కుశలం అడిగాడు. “దావత్ చేసినా గదా. అది చాలు!” అన్నది. “టీచర్ల ఇళ్ళు ఇవే…” అన్నాడు తలుపు తీస్తూ “నే చూసిన బిడ్డా!” అన్నదామె. లోపల ఉన్న […]

తాత్పర్యం – గడ్డి తాడు

రచన:- రామా చంద్రమౌళి   రెండు ప్రశ్నలు. ఒకటి..అందరూ చేస్తున్నట్టే తనుకూడా మనసుతో ప్రమేయం లేకుండా ఏదో ఒక ఉద్యోగం చేస్తూ కేవలం శరీరంతోనే జీవించాలా.? రెండు..రాజలింగం సార్ చెప్పినట్టు..ఒక విలక్షణమైన జీవితాన్ని అందరికంటే భిన్నంగా రూపొందించుకుని ఆశించినవాటిని ఆచరిస్తూ ,అర్థవంతంగా హృదయానందకరంగా జీవించాలా.? ఇరవై నాలుగేళ్ళ రాము ఆలోచిస్తున్నాడు..చాలా రోజులుగా..దాదాపు ఓ నెలరోజులనుండి తీవ్రంగా. విలక్షణంగా..భిన్నంగా..ప్రత్యేకంగా..జీవించడం..ఎలా, చాలాసార్లే అడిగాడు రాము రాజలింగం సార్ ను.ఎప్పటికప్పుడు సార్ చాలా కరెక్ట్ గా..సరిపోయే సమాధానాలే చెప్పాడు. ‘అందరు పిల్లలు […]

సాఫ్ట్‌వేర్ కథలు – ఉప్మా

రచన: కంభంపాటి రవీంద్ర   “ఇదిగో… రేపు వీకెండ్ అని లేట్ గా లేవకు… గుర్తుందిగా?” అడిగింది కావ్య “మర్చిపోలేదు తల్లీ… రేపు ఉదయాన్నే హాస్టల్ నుంచి డైరెక్ట్ గా కొత్త గూడ జంక్షన్ దగ్గిరికి వచ్చి వెయిట్ చేస్తూంటాను… నన్ను పికప్ చేసుకో “అన్నాను “గుడ్… నైన్ కి అక్కడికి వచ్చేస్తాను… మన మిగతా టీం డైరెక్ట్ గా ఓల్డ్ ఏజ్ హోమ్ కి వస్తామన్నారు… అందరం అక్కడ కలుద్దాం” అంది కావ్య. “సరే… నేను […]

పరవశానికి పాత(ర) కథలు – జ్వరం

రచన: డా. వివేకానందమూర్తి   భూమికి పాతికేళ్ళు పాతబడిపోయిన పరమహంసకి జీవితంలో మొదటిసారిగా జ్వరం వచ్చింది. జ్వరానికి, పరమహంసకి మధ్యన ఉన్న సంబంధం అయస్కాంతం యొక్క నార్త్ పోల్ నీ, సౌత్ పోల్ నీ గుర్తుకు తెస్తుంది, చీకటికీ, దొంగలకీ, దెయ్యాలకీ, ప్రాణం మీదికొచ్చే ప్రమాదాలకీ చివరికి భార్య మాటకి కూడా భయపడని పరమహంస జ్వరానికి భయపడతాడని తెలిస్తే నవ్వు వస్తుంది. చంటి పిల్లలు బూచాడు ఎత్తుకుపోవడం గురించి, పెద్దవాళ్లు ప్రమాదాల గురించి, రాజకీయ నాయకులు నిజం […]

వెంటాడే కథ 12 – ఉత్తరం

రచన: … చంద్రప్రతాప్ కంతేటి విపుల / చతుర పూర్వసంపాదకులు Ph: 80081 43507 నా వృత్తిలో భాగంగా దేశ దేశాల కథలు, మన దేశానికి చెందిన తెలుగు, తెలుగేతర కథలూ వేలకొద్దీ చదివాను. వాటిలో కొన్ని ఎప్పటికీ మరుపుకు రావు. ఎల్లవేళలా మనసుని వెంటాడుతూనే ఉంటాయి. అవి ఏ భాషలో వచ్చాయో. . రచయితలెవరో, అనువాదకులెవరో గుర్తులేకపోవడం నా దురదృష్టం. అలాంటి కథలు నెలకొకటి చొప్పున నా మాటల్లో క్లుప్తంగా చెబుతాను. పాఠకులెవరైనా ఇది ఫలానా […]

‘గోపమ్మ కథ’

రచన: గిరిజారాణి కలవల ముందు గోపమ్మ అంటే ఎవరో చెప్పాలి కదా! గోపమ్మ అసలు పేరు కృష్ణవేణి. తల్లితండ్రులు గోపమ్మ, గోపయ్య.. పెద్ద కూతురు పేరు లక్ష్మి. రెండో కూతురు కృష్ణవేణి. గోపయ్య పంచాయతీ ఆఫీసులో స్వీపర్ పని చేసేవాడట. గోపమ్మ మా అత్తగారి ఇంట్లో పనిచేసేదట. తల్లితో పాటుగా కృష్ణవేణి కూడా మా ఇంటికి వస్తూండేదట. అట.. అని ఎందుకన్నానంటే.. అప్పటికి ఇంకా నాకు నా అత్తారింటికి దారి తెలీదు. క్రీస్తుపూర్వంలాగా.. నా పెళ్లి పూర్వం […]