April 20, 2024

మాలిక పత్రిక సెప్టెంబర్ 2022 సంచికకు స్వాగతం..

  ఓ గం గణపతియే నమ: ఈ మంత్రం చాలా విశేషమైంది. అంటే దేవతల ప్రభువుకు వందనం చేస్తున్నానని దీని అర్థం. గణపతి మూలాధార చక్రానికి అధిపతి. అందువల్ల ఈ మంత్రంతో మూలధార చక్రానికి శక్తి లభించి ఉత్తేజితమవుతుంది. మాలిక పత్రిక పాఠకులు, రచయితలకు స్వాగతం సుస్వాగతం.. విఘ్నేశ్వరుడు మీ అందరికీ శుభాలు కలిగించాలని కోరుకుంటున్నాము. రాబోయేవి పండగరోజులు. సంతోషాల సంబరాలు రోజులు.. మాలిక పత్రిక మీకోసం ఎన్నో కొత్త కొత్త కథలు, సీరియళ్లు అందించబోతోంది. ముందు […]

చంద్రోదయం – 32

రచన: మన్నెం శారద స్వాతి సారథి బేంక్ కెళ్లగానే జానకమ్మని పిలిపించింది రహస్యంగా. “పిన్నిగారూ! నాకు మళ్లీ అనుమానంగా వుంది. డాక్టరు దగ్గరకెళ్దాం” అంది భయంగా. జానకమ్మ స్వాతిని తేరిపారా చూసింది.”నువ్వు చదువుకున్నావ్ గాని బొత్తిగా బుద్ధిలేదే అమ్మాయ్. ఇప్పటికే రెండుసార్లయింది. మొన్నటిసారే మూల్గుతూ ప్రాణానికి ముప్పంటూ నసిగి విసిగి చేసింది. ఈసారి వెళ్తే మొహన్నే వూస్తుంది. నావల్ల కాదు బాబు” అంది. స్వాతి “అలా అంటే ఎలా పిన్నిగారూ, మీరు కాకుంటే నాకెవరు దిక్కు?” అంది […]

అమ్మమ్మ – 39

రచన: గిరిజ పీసపాటి అయినా, వచ్చిన కార్యం ముఖ్యమైనది కనుక ప్రసన్నంగానే ఆయనతో “అవన్నీ నిజం కాదు మామయ్యగారు. ఒక్కసారి ఇంటికి రండి. ఇన్నాళ్లు మేమెందుకు అక్కడికి రాలేదో, అసలు ఆయనకి, నాకు మధ్య జరిగిన గొడవేమిటో వినండి. ఆ తర్వాత మీరే శిక్ష విధించినా నేను, పిల్లలు భరిస్తాము. ఈ ఒక్కసారి నా మాట మన్నించండి” అని వేడుకుంది. “నన్ను అభిమానించేవారు, నేను తమ ఇంటికి వస్తే చాలు అనుకునేవారు చాలామంది ఈ ఊరిలో ఉన్నారు. […]