June 19, 2024

సారు ఏం చేస్తారు?

రచన. పంతుల ధనలక్ష్మి. శారద తన మనవలని చూస్తోంది. పాప, బాబు పోటీలు పడి ఇసుక కోటలు కడుతున్నారు. పెద్ద కెరటాలు వచ్చినప్పుడల్లా అవి కొట్టుకుపోతున్నాయి. ”అంతేకదా! అడ్డుకోలేనివి వస్తే అలాగే వెళ్ళిపోతాయి. మనుషులయినా!అయినా బంధాలు ఎదురీదమంటాయి. ఎదురీదితే మాటిమాటికీ ఎదుర్కోవాలి. ఎంతకాలమో తెలీదు.”అనుకుంటోంది. అలా ఎంతసేపు చూసిందో ! పిల్లలిద్దరూ అమ్మానాన్నలతో చిన్న కెరటాలలో గెంతుతూ అరుస్తున్నారు. “ఇంక ఇంటికెళదాము పదండి. చీకటిపడింది. ”అన్నది సుస్వర. కారులో ఇంటికొచ్చినా శారదకి ఆలోచనలు తగ్గలేదు. ఏదయినా పుస్తకం […]

తెలుగు పలుకలేక మౌనయోగి నైతిని!

రచన: వేణుగోపాల్ యెల్లేపెద్ది ఈ రోజు తెలుగు భాషా దినోత్సవమని తెలిసి నిన్నరాత్రి నిద్రకు ఉపక్రమించే ముందే ఒక చిన్న సంకల్పము చేసితిని! పొద్దున్న లేచినది మొదలు, కార్యాలయమునకు వెళ్లు వరకూ ఒక్క ఆంగ్ల పదమూ నా నోటి వెంట రాకూడదు! (కార్యాలయమునకు పోయినాక ఎటూ తప్పదు) ఒక వేళ అటుల పలుకలేకుంటే మౌనముగా ఉందామని నిర్ణయించుకున్నా! క్లుప్తముగా అదీ నా సంకల్పము! మరి తెలవారకుండా ఉంటుందా! అయ్యింది ఇక వినండి నా పాట్లు! రాత్రి గడియారములో […]

చిగురించిన శిశిరం

రచన: డా. జల్లా నాగరాజు “అనుకున్నంత పనీ జరిగింది. మన అనిల్ ఇంటర్ తప్పాడు!” ఫోను టేబుల్ మీద పెట్టి భారంగా అన్నాడు ప్రభాకర్. “అయ్యో రామా”! దిగ్భ్రాంతిగా చూసింది ప్రభాకర్ భార్య సంధ్య. నుదురు రుద్దుకున్నాడు ప్రభాకర్. ఇప్పటి పిల్లలు చాలా సున్నితంగా ఉంటున్నారు. వాడికసలు లెక్కలు మొదట్నుంచి ఇష్టం లేదు. బావ బలవంతంగా ఎంపీసీలో చేర్పించాడు. “మనం వెళ్దాం పద. చెల్లాయి రమ్మంది. బావ వూళ్ళో కూడా లేడు. ఇంతకీ మన పుత్రరత్నం ఎక్కడ?” […]

కాసులపేరు

రచన: సావిత్రి దుడ్డు నాన్నమ్మగారు చూపిస్తున్న నగ చాలా బావుంది. చిన్న బంగారు చాక్లెట్ బిళ్ళలు వరుసలా ఉంది. వదిన కోసం చేయించాలి అని బంగారం కొట్టు పెద్దయ్యని రమ్మన్నారు. మా అమ్మ పక్కన కూర్చుని, తన చీర నలిపేస్తూ తనని ఊపేస్తూ “అమ్మ, నాకు ఎప్పుడు కొంటావు?” అని అడిగాను. పెద్దయ్యిన తర్వాత కొనుక్కుందాము అంది అమ్మ. యెంత పెద్ద అవ్వాలి? నేను పెద్దదాన్నయ్యాను అన్నావు కదా. గొడవ చెయ్యకూడదని! అని అన్నాను. ఏమి సమాధానం […]

నింగిని మెరిసిన వర్ణచిత్రం!!

రచన:ముక్కమల్ల ధరిత్రీ దేవి మిట్టమధ్యాహ్నపువేళ ఎండ కాస్తున్న సమయాన మొదలయ్యింది ఉన్నట్టుండి జల్లున… వాన !! మల్లెలు కురిసిన చందాన ! నేనూహించని ఆనందం ! చేరింది చెంతకు..అతి నిశ్శబ్దంగా…చిత్రం! నింగిని భానుడి కిరణాల మెరుపు ఒకవంక చిరుజల్లుతో చల్లని చిరుగాలి మరోవంక ఆపై…తడిసిన మట్టి సువాసనలింకొంత ! ఆస్వాదిస్తూ ఆరుబయటికొచ్చి ఆకసం వేపు చూశా ఒకపరి అరెరే !! రంగు రంగుల హరివిల్లు !! మెల్లిమెల్లిగా పరుచుకుంటూ ప్రత్యక్షం విశాల గగనపు ‘కాన్వాసు’ మీద ! […]

జగన్మాత

రచన: ప్రకాశలక్ష్మి అక్రరమాలలోని మొదటి అక్షరం”అ”. అ అంటే అమ్మేగా మరి। ఆదికి,అనాదికి మూలం అమ్మ। సమస్త సృష్టికి మాతృరూపం అమ్మ। ధరణి పైన నడయాడే దేవత అమ్మ। దుష్ట శిక్షణ , శిష్టరక్షణ చేసి, సమస్త మానవాళికి రక్షణ ఇచ్చేది అమ్మ। అమ్మ ప్రేమ అమృతం,అదేకదా ..మనకు ఆధారం పాల సంద్రం లో పుట్టిన క్షీరాబ్ధి కన్యక అమ్మ। సృష్టి స్థితి లయ కారిణి అమ్మ। ముగ్గురమ్మల మూలపుటమ్మ జగన్మాత ఆషాడమాసం బోనాలజాతరలు, శ్రావణమాస లక్ష్మీ […]

*సోమనాథ్ పురా ఆలయం – ప్రశాంతతకు నిలయం*

రచన: రమా శాండిల్య బెంగుళూర్ నుంచి ఒక్కరోజులో వెళ్ళి, తిరిగి రాగలిగిన అద్భుతమైన వినోద, విజ్ఞాన, ఆధ్యాత్మిక, చారిత్రక యాత్ర, ఈ సారి నేను వ్రాస్తున్న ఈ యాత్రాదర్శిని. బెంగుళూర్ మా ఇంటినుంచి, ఉదయం ఆరుగంటలకు బయలుదేరి, సాయంత్రం ఏడుగంటలకు ఇంటికొచ్చేసాము. ఈ ట్రిప్పులో, మేము చూసిన స్థలాలు, సోమనాథ్ పురాలోని, శ్రీ కేశవస్వామి ఆలయం. ఈ మధ్యలో ఏ ఆలయానికి ఇంత ‘థ్రిల్’ అయి చూసిన అనుభవమే లేదు. అంత అద్భుతమైన ఆలయం. రెండవది, ఒక […]

కురువంశ మూల పురుషుడు “వసు (ఉపరిచరుడు) చక్రవర్తి”

రచన: శ్యామసుందరరావు ఒకసారి వేటాడాలన్న ఆసక్తితో చేది రాజు వసు తన పరివారముతో వేటకు బయలుదేరాడు కొంచము సేపు వేటాడినాక అలసిపోవటం వల్ల ఆ ప్రాంతములోని ఒక ఆశ్రమాన్ని చేరి అక్కడి ఆశ్రమ ప్రశాంతత ఆహ్లాదకరమైన వాతావరణానికి సంతోషపడి తాను ప్రస్తుతము గడుపుతున్న జీవితము మీద విరక్తి కలిగింది.ఈ భోగభాగ్యాలు సుఖాలు అన్ని అశాశ్వతమని పరమాత్ముడే శాశ్వతమని నిర్ణయించుకొని అన్నిటిని త్యజించి తపస్సు ప్రారంభించాడు.ఈ తపస్సు తన ఇంద్రపదవికి అన్న అనుమానంతో రాజు కోరకుండానే ఇంద్రుడు ఇతర […]