March 19, 2024

కోటి విద్యలు కూటి కొరకే

రచన: ప్రకాశలక్ష్మి

పొట్టకూటికోసం బొమ్మలాడించే,
ఓ…బడుగుజీవి…నీ సంపాదన కొరకు,
నీ చిల్లుల గుడిసెలో ఎన్ని నకనకలాడే,
కడుపులు ఎదురు చూస్తున్నవో,
అయ్య …ఎపుడు వచ్చునో … అమ్మ
బువ్వ ఎపుడు వండునో అని.

ఉన్న ఊరు ముసలి తల్లితండ్రులను వదలి,
పసిపాపలతో ఊరు కాని ఉరు వచ్చి,
రహదారి పక్కన గుడారాలలో… దేవుడి బొమ్మలు,
చేసే ఓ.. కాందిశీకా। దారిదోపిడి దొంగలతో,
ఖాకీ జులుంతో చీమ, దోమ విషప్పురుగులతో,
మలమల మాడే ఆకలి కడుపులతో,
బతుకుబండి వెళ్లదీసే, ఓ…బాటసారి,
నీకు ఎంత కష్టం…!ఎంత కష్టం।
తప్పదు మరి…కూటి కొరకు కోటి విద్యలు।

చిత్తు కాగితాలు, ఖాళీ సీసాలు,
ఏరుకొనే… పాలబుగ్గల పసివాడా।
అమ్మ పాలు మరచి ఎన్ని దినాలయ్యింది?
బతుకుతెరువు కోసం రోడ్డున పడ్డావా?
నీవే వచ్చావా? లేక…ఎవరైనా ఆశపెట్టి పంపారా?
ఎంత కష్టం।కూటి కోసం కోటి విద్యలు తప్పవా?

సన్నటి తీగ మీద విన్యాసాలు చేసే ఓ..పాపా।
బడి కెళ్ళే వయసులో ఈ పొట్ట తిప్పలేంటి నీకు?
ఆదమరిచితే నీ జీవితం అవకతవక మరి।
జర… జాగరూకతతో ఉండు మరి।
కూటి కోసం కోటి విద్యలు తప్పవా?

* * *

1 thought on “కోటి విద్యలు కూటి కొరకే

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *