March 29, 2024

రైభ్య మహర్షి

రచన: శ్యామ సుందరరావు

రైభ్య మహర్షి వృత్తాంతాన్ని ధర్మరాజుకు అరణ్య పర్వంలో పాండవులు తీర్ధయాత్రలు చేస్తున్నప్పుడు లోమాంశుడు అనే ఋషి చెపుతాడు.
రైభ్యుడు, భరద్వాజుడు ఇద్దరు మంచి స్నేహితులు అన్నదమ్ములులా మెలుగుతూ తపస్సు చేసుకుంటూ ఉండేవారు. రైభ్యుడు చిన్నతనము నుండి గురు శుశ్రుహ చేస్తూ వినయవిధేయలతో గురువులనుండి వేదాధ్యయనము చేస్తూ ఉండేవాడు గురువులు కూడా రైభ్యుని గురుభక్తికి మెచ్చి ఆయనకు అన్ని వేదాలను నేర్పారు. కొన్నాళ్ల వేదధ్యాయనము చేసినాక రైభ్యుడు దేవా గురువైన బృహ స్పతిని కలిసి తన సందేహాలను తీర్చుకొనేవాడు.
రైభ్య మహర్షికి అర్వావసువు పరావసువు అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరు ముగ్గురు వేద అధ్యయనము మీద శ్రద్ద పెట్టి వేదాలను అభ్యసించేవారు భరద్వాజునికి ఆవక్రీతుడనే కుమారుడు ఉన్నాడు. భరద్వాజుడు అయన కొడుకు ఇద్దరు తపస్సు చేస్తూ ముని వృత్తిలో ఉండేవారు అవక్రీతుడు ఈర్ష్యతో వేదాలను గురువు ద్వారా కాకుండా తపస్సు ద్వారా నేర్చుకోవాలని ఇంద్రుని గురించి తపస్సు చేసాడు. ఇంద్రుడు ప్రత్యక్షమై వేదాలు గురువు ద్వారా అభ్యసించాలి తపస్సుద్వారా కాదు అని హితవు పలికిన
వినకపోవటంతో, “నీవు అడిగినట్లు వారము ఇస్తాను కానీ ఆ వారము నీకు ఎంత వరకు ఉపయోగపడుతుందో నేను చెప్పలేను”అని చెపుతాడు.
అవక్రీతుడు వరము పొంది వేదాలు నేర్చుకున్నాను అన్న గర్వముతో రైభ్యుని ఆశ్రమములోకి ప్రవేశించి రైభ్యుని కోడలిని (పరావసువు భార్య) అవమానిస్తాడు. ఆవిడ తనకు జరిగిన ఆవమానాన్ని మామగారికి చెపుతుంది రైభ్యుడు ఒక రాక్షసిని, ఒక రాక్షసుడిని సృష్టించి అవక్రీతుని చంపించాడు విషయము తెలుసుకున్న భరద్వాజుడు రైభ్యుడు చేసిన పని న్యాయమే అని భావించి కొడుకుకి
దహనసంస్కారాలు చేసి పుత్రశోకము భరించలేక తానూ కూడా శరీర త్యాగము చేస్తాడు.
అ సమయములోనే రాజైన బృహద్యుమ్నుడు ఒక సత్ర యాగము చేస్తూ ఉంటాడు ఆ యాగానికి రైభ్యుని కొడుకులు ఆర్యావసువు, పరావసువు ఋత్విక్కులుగా తండ్రి అనుమతితో వెళతారు. రైభ్యుడు తన కోడలితో(పరావసువు భార్య) ఆశ్రమములోనే
ఉంటాడు. పరావసువు తన భార్యను చూడాలన్న ఉద్దేశ్యముతో ఆశ్రమానికి బయలుదేరుతాడు. పరావసువు చీకటిలో తండ్రిని గమనించక తనపై వస్తున్న మృగము అనుకోని ఆత్మరక్షణార్ధము ఒక కర్ర విసురుతాడు. ఆ కర్ర తగిలి రైభ్యుడు చనిపోతాడు.
తండ్రి దహన కార్యక్రమాలు నిర్వహించి యాగము వద్దకు వచ్చి సోదరుడికి జరిగిన విషయము చెపుతాడు. బ్రహ్మహత్యా పాతక పాప పరిహార్దము అర్వావసువు తపస్సు చేయటము ప్రారంభిస్తాడు. దేవతలు అతని తపస్సుకు సంతోషించి ప్రత్యక్షమవుతారు ఏమి వరము కావాలో కోరుకోమంటే అర్వావసువు తన తండ్రి రైభ్యుడిని, భరద్వాజుడిని, అతని కొడుకు అవక్రీతుడిని బ్రతికించమని కోరుకుంటాడు. ఆ విధముగా బ్రతికిన అవక్రీతుడు గర్వము వదలి అందరితో సఖ్యముగావుంటూ సుఖజీవనము సాగిస్తాడు.
రైభ్యుడు తీర్ధయాత్రలు చేస్తూ అందరి దేవతలను దర్శించి గయ చేరి పితృదేవతలకు పిండ ప్రదానాలు చేసి ఒకచోట తపస్సు చేసుకుంటూ ఉండిపోతాడు. ఆ విధముగా తపస్సు చేసుకుంటున్న రైభ్యుడిని సనత్కుమారుడు చూసి, రైభ్యుని తపోదీక్షను మెచ్చు కుంటాడు. రైభ్యుని తపస్సుకు మెచ్చి శ్రీమహావిష్ణువు ప్రత్యక్షమై ఏమి వరము కావాలో కోరుకోమంటాడు. అప్పుడు రైభ్యుడు తనను సనకాదులు ఉండే చోటుకు పంపమని కోరుతాడు. ఆ విధముగా రైభ్యునికి మోక్షసాధన లభిస్తుంది.
రైభ్య మహర్షి వృత్తాంతము వలన విద్యను గురువు ద్వారా, గురువులకు సేవ చేయటము ద్వారా మాత్రమే అభ్యసించాలి. తపస్సుల ద్వారా వరములు పొందితే విద్య రాదు అని భరద్వాజుని కొడుకు అవక్రీతుని వృత్తాంతము తెలియజేస్తుంది. ఈర్ష్య అసూయలు పనికిరావని కూడా మనము తెలుసుకోవచ్చు. రైభ్యమహార్శి కుమారులు అర్వావసువు పరావసువులు క్షమా గుణముతో అవక్రీతుని బ్రతికించారు. మహర్షుల జీవితాలు మనకు చాలా నీతిని ధర్మాన్ని బోధిస్తాయి.

2 thoughts on “రైభ్య మహర్షి

  1. kasyapasa gotram saptha rishiyam lo vunde kasyapa, Avatsara, Naidruva, Rebha, Raibha, sandila, Sandilys rishi lalo Raibha rishi eeyana okkarena telupagalaru

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *