April 19, 2024

ఆట పట్టింపు

రచన: ప్రకాశ లక్ష్మి వేణూ, వనజా అన్నా చెల్లెళ్ళు. వనజకు పది సంవత్సరాల వయస్సులో వారి తల్లిదండ్రులు ఒక బందువుల ఇంట్లో ఫంక్షన్ కు వెళ్ళి వస్తూ వుండగా జరిగిన యాక్సిడెంట్లో మరణించారు. అప్పటికే వేణూ పెళ్లి అయ్యి జాబ్ చేస్తున్నాడు. వేణూ భార్య రాధ మంచి అణుకువ గల పిల్ల. అడపడచు రాధను చాలా ప్రేమగా చూసుకొనేది. కానీ వేణూ ఇంకా గారాబంగా చూసుకొనేవాడు. దాంతో వనజకు పెంకితనం, ముక్కోపం అలవాటు అయింది. అలా అని […]

గోపమ్మ కథ – 3

రచన: గిరిజారాణి కలవల ఆ రోజు మా ఇంట్లో పనికి గోపమ్మ రాను అని కబురు చేసింది కాబట్టి… నాకు ఆలోచించుకుందుకి కాస్త సమయం దొరికింది. లక్ష్మి దొరికిన పిల్లే అయినా తన స్వంత కూతురులాగే పెంచింది గోపమ్మ. ఏదో డబ్బు వస్తుందన్న ఆశతో, నా మాట మీద నమ్మకంతో హైదరాబాద్ పంపింది. ఇప్పుడు లక్ష్మి కనపడ్డం లేదంటే ఎలాంటి గొడవ చేస్తుందో అని నాకు ఆందోళన కలిగింది. ఇందులో నా తప్పు లేదు.. హైదరాబాద్ లోని […]

అమ్మమ్మ – 41

రచన: గిరిజ పీసపాటి వీళ్ళ నవ్వులు విన్న అన్నపూర్ణ ఆంటీ తలుపు తీసి, వీళ్ళను చూస్తూ “ఎన్నాళ్ళు అయిందండీ మీరు ఇలా హాయిగా నవ్వగా చూసి. అన్నయ్య గారు వెళ్ళిపోయాక మీరందరూ అసలు నవ్వడమే మర్చిపోయి, మర మనుషుల్లా మారిపోయారు. మీ ఇంట్లో మళ్ళీ మునుపటిలా నవ్వులు వినిపిస్తే ఎంతో సంతోషంగా అనిపిస్తోంది. మీరు నలుగురూ ఎప్పుడూ ఇలాగే నవ్వుతూ ఉండాలి” అంటూ మనస్ఫూర్తిగా దీవించారు. అప్లికేషన్ పోస్ట్ చేసి, చాలా రోజులు ఇంటర్వ్యూకి పిలుపు వస్తుందేమోనని […]

భావ కాలుష్యం

రచన: వసంతరావు నాగులవంచ కాలుష్యాలు నానా విధములు. భౌతిక కాలుష్యం కంటే భావ కాలుష్యం మిక్కిలి ప్రమాదకరమైనది. మానవుని ఆలోచనా విధానంలో వ్యతిరేక భావాలు చోటుచేసుకున్నప్పుడు మనసు మాలిన్యమౌతుంది. తత్ఫలితంగా వచ్చే ఫలితాలు కూడా చెడ్డగానె ఉంటాయి. జరుగవలసిన పనికూడా సక్రమంగా జరుగదు. మనసుకు శరీరానికి అంతులేని అవినాభావ సంబంధం ఉంది. మనసు తేలికగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉన్నప్పుడు శరీరంలోని అవయవాలు ఉత్తేజితమై శరీరాన్ని ఆరోగ్యవంతంగా, కర్మలను చేయడానికి మిక్కిలి అనుకూలంగా ఉంచుతుంది. భావాలు వ్యతిరేకమైనప్పుడు శరీరం […]