April 20, 2024

మాలిక పత్రిక డిసెంబర్ 2022 సంచికకు స్వాగతం

  డిసెంబర్ అనగానే చిరు చలిగాలులు చురుక్కుమంటుంటే, పిల్లల పరీక్షలు, క్రిస్మస్ వేడుకలు,… వీటన్నింటితోపాటు సంవత్సరం ముగియబోతుందన్న దిగులతో పాటే మరో కొత్త సంవత్సరంలోకి అడుగిడబోతున్నామన్న సంబరం కూడా ఉంటుంది. అప్పుడే కొత్త సంవత్సరం వేడుకలు జరుపుకున్నాము కదా, అప్పుడే అయిపోయిందా అని అనుకోవడం పరిపాటైపోయింది. కాలం అంత వేగంగా పరిగెడుతోంది మరి.. ఈ డిసెంబర్ సంచిక నుండి ప్రముఖ రచయిత్రి, అందరికీ ఆత్మీయురాలైన శ్రీమతి ఉంగుటూరి శ్రీలక్ష్మిగారు చాలా ఏళ్ల క్రితం ఎంతోమంది ప్రముఖులను ఇంటర్వ్యూ […]

గోపమ్మ కథ – 4

రచన: గిరిజారాణి కలవల నేను అడిగిన ప్రశ్నకు సమాధానంగా, గోపమ్మ … లక్ష్మి రెక్క పట్టుకుని ముందుకి లాగి, “చెప్పవే! అమ్మగారు అడుగుతున్నారుగా! చెప్పూ!” అంది కోపంగా. ఏం జరుగుతుందో నాకు అర్ధం కాలేదు. ఉదయం నుంచి నేను పడుతున్న ఆదుర్దా అయితే, లక్ష్మిని చూడగానే తీరింది కానీ, హైదరాబాద్ నుంచి ఇక్కడకి ఈ పిల్ల ఎలా రాగలిగిందా? అనే సందేహం వచ్చింది. “ఉండు, గోపమ్మా! దాన్నేం అనకు. నేను కనుక్కుంటాను” అన్నాను. “ఏంటమ్మా! కనుక్కునేది ? […]

విరించినై… మనసున మల్లెలు – భానుమతి

రచన: ఉంగుటూరి శ్రీలక్ష్మి డాకర్ పద్మశ్రీ భానుమతీ రామకృష్ణ పేరు వినగానే కమ్మని సంగీతం, హాయిగా నవ్వుకోగలిగే హాస్యం గుర్తొస్తాయి. ఆమె అరవై సంవత్సరాల సినీజీవితంలో నటీమణిగా మాత్రమే కాదు, సంగీతజ్ఞురాలు సాహితీవేత్త, మధురగాయిని, దర్శకురాలు, నిర్మాత, ఎడిటర్ కాస్ట్యూమ్ డిజైనర్ గా అన్నింటా ప్రవేశమున్న బహుముఖ ప్రజ్ఞాశాలి. రాజ్యలక్ష్మీ అవార్డ్ వచ్చిన సందర్భంగా ఇంటర్వ్యూ కోసం వెళ్ళాను. గేటు దాటగానే నిలువెత్తు అలమేలుమంగా, వేంకటేశ్వరుల ఫోటోలు, ‘శరణం నీ దివ్య చరణం’ – కమ్మని కంఠం […]

వెంటాడే కథలు – 15

రచన: … చంద్రప్రతాప్ కంతేటి విపుల / చతుర పూర్వసంపాదకులు Ph: 80081 43507 నా వృత్తిలో భాగంగా దేశ దేశాల కథలు, మన దేశానికి చెందిన తెలుగు, తెలుగేతర కథలూ వేలకొద్దీ చదివాను. వాటిలో కొన్ని ఎప్పటికీ మరుపుకు రావు. ఎల్లవేళలా మనసుని వెంటాడుతూనే ఉంటాయి. అవి ఏ భాషలో వచ్చాయో… రచయితలెవరో, అనువాదకులెవరో గుర్తులేకపోవడం నా దురదృష్టం. అలాంటి కథలు నెలకొకటి చొప్పున నా మాటల్లో క్లుప్తంగా చెబుతాను. పాఠకులెవరైనా ఇది ఫలానా వారి […]

చంద్రోదయం – 35

రచన: మన్నెం శారద “నానీకి వళ్ళు వెచ్చబడింది, జ్వరమేమో కాస్త చూడండత్తయ్యా!” అంది స్వాతి ఆందోళనగా సావిత్రమ్మ దగ్గరకొచ్చి. ఆమె ఆయిష్టంగా ముఖం తిప్పుకొంది. స్వాతి జాలిగా నిలబడింది. స్వాతిని చూడగానే ఆమెకు అరికాలి మంట నెత్తికెక్కుతోంది. “నేను చూసేదేమిటీ? థర్మామీటరుందిగా చూడు” అంది అయిష్టంగా. “చూసేను. నూట నాలుగుంది. వాడికెప్పుడూ ఇంత జ్వరం రాగా చూడలేదు. సమయానికి ఆయన లేరు” అంది ఆందోళనగా స్వాతి. ఆవిడ కోడలివైపు వెటకారంగా చూసింది. “అన్నీ ఆయనకు చెప్పే చేస్తున్నావా? […]

సాఫ్ట్ వేర్ కథలు – ఆలేమగలు

రచన: రవీంద్ర కంభంపాటి కంగారుగా నడుచుకుంటూ తన క్యూబికల్ దగ్గరికి వచ్చిన చరిత, అటూ ఇటూ చూసింది. అప్పటికే టీమ్ అంతా మీటింగ్ కి వెళ్ళిపోయేరు. ఛ.. వద్దు వద్దంటున్నా ఆ కృతిక వచ్చి కాఫీకి లాక్కెళ్లిపోయింది. వీకెండ్ వాళ్ళు చూసిన సినిమాల కబుర్లు చెప్పుకుంటూంటే, టైమే తెలీలేదు. ఇప్పుడు ఆ టీం మీటింగ్ లో అందరి ముందూ వాళ్ళ ప్రాజెక్ట్ మేనేజర్ విమల్ చులకనగా చూసే చూపూ, విసిరే కామెంట్లూ పడాలి, అనుకుంటూ మెల్లగా మీటింగ్ […]

తాత్పర్యం – ప్రమేయం (ఒక కథ … మూడు ముగింపులు)

రచన: రామా చంద్రమౌళి అదృష్టం. అంటే దృష్టము కానిది. అంటే కనబడనిది . ఏమిటి కనబడనిది.? ఏదైనా. నేటికి రేపు. కనబడనిది. వర్తమానానికి భవిష్యత్తు కనబడనిది. మనిషికి మనసు. కనబడనిది. కళ్ళకు గాలి కనబడనిది. అసలు మున్ముందు జరుగబోయే జీవితం ఏమిటో. అస్సలే కనబడనిది. ఒక స్త్రీ, పురుషుడి జీవితంలో ‘ పెళ్ళి చూపులు ‘ అనే ప్రహసనం ఎంత పెద్ద జోకో అనుకుంది లీల. వెంటనే అమ్మ జ్ఞాపక మొచ్చిందామెకు. తనను పెళ్ళి చూపులకు అలంకరించి […]

జీవనవేదం – 4

రచన: స్వాతీ శ్రీపాద “నాగరత్నం మా అమ్మ.” అంటూ లేచి పారిజాతం “మా అమ్మ లోకం తెలిసిన మనిషి కాదు. మేనత్త దగ్గర ఒద్దికగానే పెరిగినా లోకం పోకడ అసలు తెలియదు. భర్తే ప్రపంచం అనుకుంది. పెళ్ళైన ఆరునెలలకే మేనత్త కాలం చేసినా వెళ్ళి చూసే అనుమతి కూడా దొరకలేదు. మేనత్త మైల మూడు రోజులతో సరి – అంటూ ఇంటిపనులన్నీ చేయించారట దుఃఖంలో ఉన్న అమ్మతో. ఇహ నాన్న సంగతి సరేసరి. పదిళ్లపూజారి. ఏ రోజునా […]

పరవశానికి పాత(ర)కథలు – ఓవర్ నటేశన్

రచన: డా. వివేకానందమూర్తి “కాస్త చూసి నడువికా!” అన్నాడు బేతాళుడు. విక్రమార్కుడు ఆగి బేతాళుడి కేసి కోపంగా చూశాడు. “అపార్థం చేసుకోకు మార్కా! అసలే మనం నడిచేది హైదరాబాదులో చిక్కడపల్లి రోడ్డు. అదీగాక ఎదురుగా వచ్చేది ఎవరోకాదు ఆర్. టి. సి. బస్సు, దానికి యన్టీరామారావైనా ఒకటే. ఎక్స్ ట్రా నటుడైనా ఒకటే”. విక్రమార్కుడు ఒకసారి రోడ్డంతా కలయజూశాడు. ఆవాళే రిలీజయిన చిత్రం మొదటి ఆట అప్పుడే వదిలినట్టుంది. రోడ్డు. నడక వేగం తగ్గించి జాగ్రత్త పడ్డాడు. […]

మంచుపూల వాన

రచన: రమాదేవి బాలబోయిన “శారదక్కా! ఈరోజు మీరు ఆ భోజనాల ఆటోతో రోడ్ నెంబర్ 13 లోని రాజనందనం అపార్ట్మెంట్స్ కి వెళ్ళి ఫుడ్ డెలివరీ చేయండి” అంది జ్యోతి మధ్యవయస్కురాలైన ఓ స్త్రీ వైపు చూస్తూ. “అలాగేలేమ్మా” అని తలూపుతూ…ఇక తప్పుతుందా అన్నట్లుగా మొహం తిప్పుకుని కౌంటర్ మీద ఉన్న ఐడెంటిటీ కార్డ్ మెడలో వేసుకుంది శారద. మళ్ళీ ఏదో గుర్తొచ్చిన దానిలా…”ఆహ్… అక్కా! వాళ్ళు మనకు పదహారు వేల మూడొందల రూపాయలు ఇస్తారు. ఈ […]