April 23, 2024

విషాదాన్ని విస్మరించు..!

రచన: ధరిత్రి ఎమ్

జీవితం ఓ పయనం
ఎత్తు పల్లాలు దాటుతూ సాగే గమనం
రాత్రి… పగలు.. అనివార్యం
ఆగమనం.. నిష్క్రమణ..
ఆగమనం.. నిష్క్రమణ.. !
నిరంతర భ్రమణం !
చీకటీ.. వెలుగూ .. అంతే కదా !
మరెందుకీ వేదన !
రాత్రి లేక పగటికీ
కష్టం లేక సుఖానికీ
ఉన్నదా విలువ !
రెండింటి సమాహారమే
బ్రతుకన్నది… పచ్చి నిజం !
అలా సాగితేనే కద…
జన్మ సార్థకం !!
అందుకే… నేస్తమా…
చీకటికి వెరవకు..
చింతించి భీతిల్లకు !
సంతోషాన్ని ఆస్వాదించు…
విషాదాన్ని విస్మరించు…!
ఎదురుచూడు… ఏమో !
నేటి నీ కన్నీటి ధారలు..
రేపటి పన్నీటి జల్లులు కానున్నవేమో !!
నేడు బీటలు వారి ఎండిన భూమి
రేపు సస్యశ్యామలం అయినట్లు !!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *