May 25, 2024

చంద్రోదయం – 36

రచన: మన్నెం శారద “డాక్టర్! ఎలా వుంది?” నానీని పరీక్షించి వెళ్తోన్న డాక్టర్ని వెంబడించి వరండాలో అడిగేడు సారథి. అప్పటికే వారం రోజులుగా నానీలో ఎలాంటి మార్పూ లేదు. అతనికసలు స్పృహే లేదు. కాళ్లు కొయ్యలా బిగుసుకుపోయేయి. ముఖం గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. మంచానికి పుల్లలా అతుక్కుపోయేడు. డాక్టర్ సారథివైపు జాలిగా చూసేడు. “మా ప్రయత్నం మేము చేస్తున్నాం. ఇది బ్రెయిన్ ఫీవర్ దీనికింతవరకు మందు లేదు. ధైర్యంగా వుండండి” అంటూ వెళ్లిపోయేడు. సారథి మ్రాన్స్పడి నిలబడిపొయేడు. భూమిలోకి […]

బాల మాలిక – కందికాయలాంటి కమ్మని కథ

రచన: నండూరి సుందరీ నాగమణి అనగనగా… మరేమో… ఒకానొక దేశంలో… ఉల్లిపాయంత ఊరుండేదట. ఆ ఉల్లిపాయంత ఊరిలో బుడమకాయంత బుల్లోడు ఉండేవాడట… ఆ బుడమకాయంత బుల్లోడికి తామరకాయంత తండ్రి ఉన్నాడట. ఆ తామరకాయంత తండ్రి కాకరకాయంత కార్యాలయంలో పని చేస్తూ ఉండేవాడట. బుడమకాయంత బుల్లోడు బంగాళాదుంపంత బళ్ళో చదువుకుంటున్నాడట. ఆ బడిలో వీడికి చదువు చెప్పే పనసకాయంత పంతులమ్మ చెర్రీ పండంత చదువు చెప్పేదట. పుచ్చకాయంత ఫ్రెండ్స్ తో అనాసపండంత ఆటలా చదువు నేర్చుకుంటున్నాడు మన బుడమకాయంత […]

తుళ్ళి పడకే ఓ…మనసా

రచన: లక్ష్మీ ఏలూరి ఎడారి లో ఓ …కోయిలా ! ఎగిరిపడి ముందే కూయకు! మునుముందే వసంతం వచ్చునని! ఆశపడి మిడిసిపడి కృంగిపొబోకు! కన్న కలలన్నీ కల్లలైయి,కన్నవారు, పెళ్లి పేరిట కూపస్థమండూకం లాంటి, అత్తవారింటికి పంపితే, కసాయిలాంటి, భర్తతో అడుగడుగునా అవమానాలే! అయినా… ఈమనసున పెనవేసుకున్న, ఆశలన్నీ నీమీదే నీవు వస్తావని! నీవు వచ్చే దారిలో గులాబీ రేకులు పరిచి! నా ఆశలన్నీ సమాధి చేసి నా, నా చేతులతో, తడిమి నిన్ను అప్యాయంగా అక్కున చేర్చుకుని, […]

కౌముది

రచన: ములుగు లక్ష్మీ మైథిలి ఈ మధుర కౌముది ఎన్నో ఊసులకు,ఊహలకు జీవం పోస్తుంది ఎందరో ప్రేమికులకు వలపు కుటీరమై ఆశ్రయమిస్తుంది ఎన్ని రాత్రులు వస్తున్నా వెన్నెల రేయి కోసం జగతి వేయి కనులతో వేచి చూస్తుంది పండువెన్నెల జాబిల్లి నిశీధిలో వెలుగులు చిందిస్తూ పసిపాపలందరికీ పాలబువ్వ తినిపిస్తుంది ఆకాశ వీధిలోఅందాలచందమామ యువజంటల అనురాగానికి తానే పల్లవి చరణాలవుతుంది జలతారుల చంద్రికలతో యువత మనసు దోచేస్తూ గుండెల్లో గుబులు రేపుతుంది అప్పుడప్పుడూ.. నీలి మేఘాల చాటున దాగి […]