March 29, 2024

మాలిక పత్రిక ఫిబ్రవరి 2023 సంచికకు స్వాగతం

పువ్వులు నవ్వులు, ఊసులు, సంతోషాలు, అభినందనలు… ఇలా ఎన్నింటికో ప్రతిరూపంగా భావిస్తాము మనం. సంవత్సరం పొడవునా ఏదో ఒక పువ్వు విరబూస్తూనే ఉంటుంది. ఎండా, వాన, చలి అంటూ అలసట చెందక అందంగా విరబూసి, చూసినవారికి ఆనందాన్ని ఇస్తాయి. లేదా భగవంతునికి సమర్పింపబడతాయి. తాత్కాలికమైన జీవనం కలిగి ఉండే పువ్వులు వీలైనంత సంతోషాన్ని ఇస్తాయనడంలో అతిశయోక్తి లేదు. కొద్దికాలంగా ఎందరో ప్రముఖ వ్యక్తులను ముఖ్యంగా సినీరంగానికి చెందినవారిని కోల్పోతున్నాము. మనకు బంధువులు కాకున్నా వారి చిత్రాలద్వారా కొంత […]

చంద్రోదయం – 37

రచన: మన్నెం శారద   సారథి సలహా మీద ఆమె నుంగంబాకంలో వున్న మహిళా సమాజంలో మెంబర్‌షిప్ తీసుకుంది. అక్కడ తమిళులకి తెలుగు నేర్పటం, తను తమిళం నేర్చుకోవటం, యిష్టమైన కుట్టుపనులు తెలుసుకోవటం ఆమెకు కొంత కాలక్షేపంగానే వుంది. ఎంతయినా అది కేవలం రెండు గంటల కాలక్షేపం మాత్రమే. సారథి దాదాపు ఎనిమిది గంటల కాలం యింట్లో వుండడు. ఒంటరితనం నుంచి తననెలా రక్షించుకోవాలో అర్థం కాలేదు స్వాతికి. పనిపిల్లతో ఏం మాటలుంటాయి? మెల్లిగా వీధిలో వారితో […]

సుందరము – సుమధురము – 2 – అందెల రవమిది

రచన: నండూరి సుందరీ నాగమణి చిత్రం:స్వర్ణకమలం   సుందరము – సుమధురము నండూరి సుందరీ నాగమణి   సుందరము సుమధురము ఈ గీతం: ‘స్వర్ణ కమలం’ చిత్రంలోని ‘అందెల రవమిది’ గీతాన్ని గురించి ఈ నెల వివరించాలని అనుకుంటున్నాను. భాను ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై, 1988లో విడుదల అయిన ఈ చిత్రానికి, కళాతపస్వి  శ్రీ కె. విశ్వనాథ్ గారు దర్శకత్వం వహించారు. శ్రీ కె. యస్. రామారావుగారి సమర్పణలో శ్రీ సి.హెచ్. అప్పారావుగారు ఈ చిత్రాన్ని నిర్మించారు. […]

ఆ కీర్తనల శృంగారం అతి గుంభనం – శోభారాజ్

విరించినై విరచించితిని రచన: ఉంగుటూరి శ్రీలక్ష్మి అన్నమాచార్య కీర్తన అంటే ఎవరైనా స్ఫురణకు వచ్చే అతికొద్దిమందిలో శోభారాజ్ ఒకరు. అలాగే శోభారాజ్ పేరు వినగానే అన్నమాచార్యుని కీర్తన మృదుమధురంగా వినపడుతున్నట్లే వుంది. ఆవిడ నిర్వహిస్తున్న ‘అన్నమాచార్య భావనా వాహిని’ని చూస్తేనే మనలో ఒక విధమైన భక్తిభావన కలుగుతుంది. ఆవిడతో కొన్ని ముచ్చట్లు: అన్నమాచార్య కీర్తనలపైన మీకు ఆసక్తి ఎలా కలిగింది? చిన్నప్పటినుంచే నాలో భక్తిభావన ఉండేది. శ్రీ వేంకటేశ్వరుని ఆశీర్వాదం వల్ల, పూర్వజన్మ సుకృతం వల్ల అనుకుంటా, […]

కోకో

రచన: వి. రాజారామమోహనరావు “కోకో – మా కుక్క పేరు, మీకు నచ్చిందా? కోకో వెనకాల ఒక కథ ఉంది. దానికన్నా ముందు లియో గురించి చెప్పుకోవాలి. పక్షుల్నీ, కుక్కల్నీ ఇంట్లో పెంచడం నాకు అయిష్టం. హాయిగా తిరగాల్సిన వాటిని బంధించటమేమిటని నా అభిప్రాయం. కానీ మా అమ్మాయికి వాటిని పెంచడం అంటే ఎంతో ఇష్టం. ఎవరింట్లో ఏ పెంపుడు జంతువు కనిపించినా వాటితో తెగ ఆడేది. అయినా నాకు ఇష్టం లేదని తెలిసి ఎప్పుడూ ఏ […]

సాఫ్ట్‌వేర్ కధలు – పర్పస్

రచన: రవీంద్ర కంభంపాటి ఆ రోజు ఉదయం మెయిల్ బాక్స్ ఓపెన్ చేసిన రాజేష్ కి తన క్లయింట్ డగ్లస్ నుంచి మెయిల్ కనిపించింది. ‘హై ఇంపార్టెన్స్ ‘ అని మార్క్ చేసి ఉండడంతో, ఏమైనా ఎస్కలేషన్ వచ్చిందేమోనని వెంటనే ఆ మెయిల్ ఓపెన్ చేసేడు రాజేష్. వచ్చే నెల, ఇండియాలో ఉన్న తమ టీం ని కలవడానికి వస్తున్నానని, మూడు రోజులు ఉంటానని సారాంశం ! సాధారణంగా డగ్లస్ ఇండియా వచ్చినప్పుడు, తమ కంపెనీతో పాటు, […]

లోపలి ఖాళీ – 1

రచన: రామా చంద్రమౌళి ‘‘ఒకసారి మళ్ళీ చెప్పండి ’’ అన్నాడు డాక్టర్‌ కుమార్‌ చాలా ఆశ్చర్యంగా. . విభ్రమంతో. . చిత్రంగా ఎదుట కూర్చుని ఉన్న ఆ పెద్దమనిషి ముఖంలోకి చూస్తూ. ఆ పెద్దాయన ఏమీ చెప్పలేదు. సూటిగా డాక్టర్‌ కళ్ళలోకి ఓ లిప్తకాలం చూచి ఏదో చెప్పడానికి ఉద్యుక్తుడౌతూండగా. , ‘‘ఐతే మీరు మనుషులను ప్రేమించే శక్తిని కోల్పోతున్నారు. . యామై కరక్ట్‌. ? ’’ అన్నాడు డాక్టర్‌ కుమార్‌. . ప్రసిద్ధ సైకియాట్రిస్ట్‌. గత […]

గోపమ్మ కథ – 6

రచన: గిరిజారాణి కలవల ఇక అప్పటినుండి గోపమ్మ , లక్ష్మిని తనతోనే తను పనిచేసే ఇళ్ళకి తీసుకువెళ్ళేది. బడిలో చేర్పించి చదువు చెప్పిస్తానంటే ససేమిరా ఒప్పుకోలేదు లక్ష్మి. లక్ష్మి చేసే సహాయంతో గోపమ్మకి మరి నాలుగు డబ్బులు చేతిలో ఆడసాగాయి. లక్ష్మి ఈడేరినప్పుడు ఫంక్షన్ చేద్దామని తలచింది. నన్ను పదివేలు సర్దమని అడిగింది. ‘ఎందుకు గోపమ్మా! ఈ ఆర్భాటాల ఫంక్షన్లు. అనవసరంగా డబ్బు దండుగ కదా! అప్పు చేసి మరీ చేయాలా?’అని అడిగాను. “ఏం చేస్తామమ్మా! మా […]

జీవనవేదం – 6

రచన: స్వాతీ శ్రీపాద సీతకు సంతోషంగా ఉంది. మొదటి సారి తనకంటూ వచ్చిన గుర్తింపు ఎంతో ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. పుట్టి బుద్దెరిగి ఎప్పుడూ నా అనే ఆలోచనే లేదు. బహుమతి ప్రదానం జరిగి మీటింగ్ ముగిసేసరికి రాత్రి తొమ్మిది దాటి పోయింది. మర్నాడు ఆలిండియా రేడియో వాళ్ళు విజేతలను తమ రికార్డింగ్ కోసం ఆహ్వానించారు. నలుగురైదుగురు కలిసి రికార్డింగ్ కి వెళ్ళారు. వెంట వచ్చినలెక్చరర్ర్లు తమ బసలోనే ఉండిపోయారు. “అయితే లంచ్ కాగానే వెళ్ళిపోతారన్న మాట” అన్నాడు […]

పరవశానికి పాత(ర) కథలు – చరిత్ర శిధిలం

రచన: డా. వివేకానందమూర్తి ఉన్నట్టుండి ఏదో భరించలేని శబ్దం గుండె బద్దలు చేసింది. అధిగమించిన వేగంతో పరిగెత్తుతున్న బస్సు ప్రయాణీకులందర్నీ ఒక్కసారి కుదిపి, బాణం తగిలిన పక్షిలా కీచుమంటూ అరచి హఠాత్తుగా ఆగిపోయింది. డ్రైవరు కిందికి దిగేడు. చక్రాలవైపు వొంగి పరిశీలనగా చూస్తూ అన్నాడు – ‘దిగండి. బండి దెబ్బతింది’. కండక్టరు కూడా దిగి చూసేడు. అదే మాట తనూ చెప్పేడు. ప్రయాణీకులందరం క్రిందికి దిగేం. వెనుకవైపు వెలికి వచ్చిన చక్రాలకేసి చూస్తూ డ్రైవరు కండక్టరుతో ఏదో […]