April 20, 2024

అర్చన కనిపించుట లేదు – 2

రచన: కర్లపాలెం హనుమంతరావు మెడికల్ రిపోర్టు చూసింది శ్రావణి . “మీ వదిన ప్రెగ్నెంట్ అన్నావు కదా! ఈ మధ్య కడుపులోని బేబీ హెల్త్ కండిషన్స్ సరిగ్గా ఎవాల్యుయేట్ చేయడానికి ఫాదర్స్, మెడికల్ హిస్టరీ కూడా చూస్తున్నార్లే . అందుకే మీ బ్రదర్ ఈ రిపోర్టు తీసుకున్నాడు లాగుంది” అంది. “ఇంతకీ ఈ రిపోర్టుల్లో ఏముంది?” “మీ బ్రదర్ హెచ్చైవీ. నెగెటివ్ రిపోర్టు రా ఇది” “గర్భం వదినకయితే అన్నయ్యను టెస్ట్ చేయించుకోవలసిన అవసరం ఏముచ్చింది?” “ఇది […]

అమ్మమ్మ – 43

రచన: గిరిజ పీసపాటి ఆ రోజు షాపుకి రానని ముందే చెప్పి ఉండడం వల్ల ఇంట్లోనే ఉండిపోయింది నాగ. కాసేపటికి ఢిల్లీ వచ్చి అమ్మమ్మతో కబుర్లు చెప్పి, నానిని తీసుకొని పనికి వెళ్లిపోయాడు. పదకొండు గంటలకల్లా వంట ముగించిన వసంత, ముందుగా అమ్మమ్మకి భోజనం వడ్డించింది. అమ్మమ్మకి మడి, ఆచారం, ఎంగిలి వంటి పట్టింపులు ఎక్కువ. కనుక వీళ్ళతో కలిసి తినదు. అమ్మమ్మ తినగానే, నాని కూడా రావడంతో అందరూ కలిసి భోజనాలు ముగించి కాసేపు విశ్రాంతి […]

పువ్వుల వనము

రచన: సుజాత తిమ్మన బలపం పట్టిన పసి కరము ఓం నమః చెప్పే స్వరము అమాయక చూపుల సరము దేవునిచే పొందిన వరము అమృతవాక్కులు రాసే కలము మానవతే మనందరి కులము గంగమ్మ ఇచ్చిన ఈ జలము పవిత్రతను వెలికి తీసే హలము ఒక్కటై ఉంటేనే అది మనము కలిసి పనిచేస్తే ఎంతో ఘనము సంతోషమే మనకున్న ధనము పసినవ్వుల పువ్వుల వనము ***

సంక్రాంతి పౌష్యలక్ష్మీ

రచన: ప్రకాశ లక్ష్మి వచ్చింది, వచ్చింది పౌష్య లక్ష్మీ, తెచ్చింది, భువికి హరివిల్లు శోభ, లేతగరిక మీద మంచు బిందువులు, మంచి ముత్యాలు గా, లేత సూర్యకాంతిలో మెరయు, హరిదాసుల హరి స్మరణ కీర్తనలు, డూ,డూ బసవన్న ల ఆటపాటలతో, ఇంటి ముంగిట రంగవల్లుల మధ్య గొబ్బెమ్మలతో, కొత్త పంటలు తో గాదెలు నిండి, ైబోగి మంటలతో చలిపులి తరిమివేయగా, కొత్త గా పెళ్ళి అయిన దంపతుల ముద్దు ముచ్చట్లు, బావామరధళ్ళ సరసాలు, కమ్మనైన పిండి వంటల […]

కాలమదియె ( గజల్ )

రచన: ములుగు లక్ష్మీ మైథిలి క్రిమి రక్కసి విలయాన్నే సృష్టించిన కాలమదియె దేశమందు చెడు రోజులె తలపించిన కాలమదియె! దేశాన్ని కాపాడే దళపతికే నివాళులే భరతభూమి కన్నీటితో విలపించిన కాలమదియె! దశాబ్దాల సుస్వరాలె ప్రపంచమే కదిలించెను స్వర్గపురికి గళములనే తరలించిన కాలమదియె! కవనాఝరి చిత్రసీమలొ సిరివెన్నెలె కురిపించెలె గగనవీధి నిలిచేలా మరలించిన కాలమదియె! శివనృత్య పదఘట్టన కైలాసం చేరిపోయె పాండిత్యపు రచయితలనె కదిలించిన కాలమదియె! మహమ్మారి అలధాటికి అసువులే విడిచిరిగా అవనిలోన పుణ్యాత్ముల స్మరించిన కాలమదియె! గడిచిపోయె […]