March 29, 2024

మాలిక పత్రిక మార్చ్ 2023 సంచికకు స్వాగతం.

      స్వాగతం సుస్వాగతం.. మరి కొద్దిరోజుల్లో తెలుగువారి కొత్త సంవత్సరానికి కూడా స్వాగతం పలుకుదాం. చైత్ర మాసం శుక్లపక్షం పాడ్యమి రోజున ఆ విధాత ఈ జగత్తును సృష్టించాడని నమ్ముతారు. సోమకుడు వేదాలను తస్కరించిన కారణంగా మత్సావతారం ధరించిన విష్ణువు అతడిని సంహరించి వాటిని తిరిగి బ్రహ్మదేవుడికి అప్పగించిన సందర్భంగా ‘ఉగాది’ ఆచరణలోకి వచ్చిందని పురాణప్రతీతి.  చైత్ర శుద్ధ పాడ్యమి రోజున సూర్యోదయ వేళలో బ్రహ్మ దేవుడు సృష్టిని సృష్టించాడని అంటారు. అంటే కాలగణాన్ని […]

దైవేచ్చ

రచన: సి. హెచ్. ప్రతాప్ నారాయణపురంలో రామయ్య అనే రైతు నివసిస్తుండేవాడు. తనకు వున్న ఎకరం పొలంలో వ్యవసాయం చేసుకుంటూ, దానిపై వచ్చిన రాబడితో తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఎంతో సంతృప్తితో జీవిస్తుండేవాడు. రామయ్యకు దైవ భక్తి ఎక్కువ. తన జీవితంలో ఏం జరిగినా అది భగవంతుని ప్రసాదమేనని భావిస్తుండేవాడు. ఒకరోజు ఇంటిల్లిపాదీ పక్క ఊళ్ళొ జరుగుతున్న అమ్మవారి జాతరకు వెళ్ళారు. అక్కడ ఎవరూ లేని సమయంలో కొందరు దొంగలు అతని ఇంట్లో వున్న పాడి ఆవును […]

ఆత్మీయత

రచన: రాజ్యలక్ష్మి బి కూలీనాలీ చేసుకునేవారి రోజువారీ పనులకు అడ్డుగా వారం రోజులనించి కుంభవృష్టి. రెక్కాడితే కానీ డొక్కాడని బ్రతుకుల్లో ఆకలి బాధ వర్ణనాతీతం. ఆకలితో అలమటిస్తూ కుక్కిమంచం మీద రొచ్చుకంపులో సగం చిరిగిన గోనెసంచిలో కాళ్లు ముడుచుకుని పడుకున్న రంగమ్మ కుంభవృష్టిని చూస్తూ తమ చితికిన బ్రతుకులను తల్చుకుని కుమిలిపోతున్నది. బయట వర్షం, గుడిసెలోపల చిమ్మచీకటి, వూరిబయట వాడలోని గుడిసెలు. ఆ మట్టినేలంతా తడిసిముద్దయింది. కోడలు నీలమ్మ ఆ తడినేలలోనే ఒదిగిఒదిగి ముడుచుకుని చెక్కపీట మీద […]

ఆల్లెం గుండు

రచన: కాశీవరపు వెంకటసుబ్బయ్య వెంకటాపురానికి ఆచారం లాంటి ఒక విధానం వుంది. దాని కారణంగానే ఆ ఊరికి చుట్టూ ప్రక్కల పల్లైల్లో ఒక ప్రత్యేకత ఏర్పడింది. ఊరి మధ్యలో గ్రామాచావడి ముందర ఒక గుండు వుంది. దాన్ని అల్లెం గుండు అంటారు. అది సాధారణ వ్యక్తులు ఎవ్వరూ ఎత్తలేరు. ఆల్లెం తిని బాగా బలిసిన వారు తప్ప. ఆ ఊరి పిల్లను పెళ్లి చేసుకుని అల్లుడిగా వచ్చినవాడు ఎవరైనా ఆరునెలలు అల్లెం తిని గుండు భుజాలపైకి ఎత్తిగాని […]

చిన్న వయసు – పెద్ద ఆలోచన

రచన: డా. సూర్యకుమారి మానుకొండ ఒక ‘ పిల్లల స్కూల్ బస్సు’ స్టాప్ దగ్గర ఆగింది. ఒక చిన్న కుఱ్ఱవాడిని అటెండర్ జాగ్రత్తగా కిందికి దింపాడు. బాబు కోసం ఎవరూ వచ్చిన సూచన లేదు. “బాబూ ! ఈ గట్టుమీద కూర్చో మీ వాళ్ళు వచ్చేదాకా. భయపడకుండా కూర్చుంటావా” అని అడిగాడు. ” సరే అంకుల్” అన్నాడు బాబు .అయినా ఒక ఐదు నిమిషాలు చూసాకే డ్రైవర్ బస్సు పోనిచ్చాడు. ఎందుకంటే బస్సులో ఇంకా చాలామందే చిన్నపిల్లలు […]

పిల్లలు నేర్పిన పాఠాలు

రచన: అపర్ణ క్రోవి పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు అని, నా బిడ్డలు నిజంగా ఏ జన్మలోనో నేను చేసిన దానాలకి ప్రతిఫలమే. 19 ఏళ్లకి డిగ్రీ పరీక్షలు రాసిన వెంటనే, ఫారెన్ సంబంధం వచ్చిందని పెళ్లి చేసేశారు అమ్మ నాన్న. పెళ్లి అయిన రెండు నెలలకే, అందరినీ వదిలి, ఆ భగవంతుడి మీద భారం వేసి, ప్రపంచ పటంలో ఏ మూలన వుందో కూడా ఐడియా లేని దేశానికి (బ్రెజిల్) వెళ్లాను మావారితో. […]

పరివర్తన

రచన: వీణ మునిపల్లె “రేపట్నించీ ఉద్యోగానికి వెళుతున్నాను రాజ్యం” “ఏవిఁటండీ ఏమంటున్నారూ…. మీరు ఉద్యోగానికి వెళతానంటున్నారా?” నమ్మలేనట్టుగా, ఆశ్చర్యంగా అడిగింది. రాజ్యం. “ఇన్నాళ్లూ లేనిది ఇప్పుడేంటి కొత్తగా? అయినా ఈ వయసులో మీకుద్యోగమెవరిచ్చారు? వంట్లో ఓపికుండి, చెయ్యాల్సిన అవసరంమున్నప్పుడు ఏమీ చెయ్యకుండా పెద్దలిచ్చిన ఆస్తులున్నాయని….జీవితం గడిచిపోతుందిలే అని జల్సాగా గడిపేశారు…ఇన్నాళ్ళు గడిచిపోయాక ఇప్పుడర్థమైందా మీకు ఉద్యోగం అవసరమని? ఏదైనా ఉద్యోగం చూసుకోండి అంటే…ఒకరి కింద పని చెయ్యను’ అనేవారు …మరిప్పుడు ఈ నిర్ణయమేంటీ?” ‘కుటుంబ అవసరాలు నడవడానికి, […]

అతులిత బలధామం

రచన: పద్మజ ముడుంబై ఆరేళ్ళ అతులిత్ కొచ్చిన్ లో సముద్రం దగ్గర గల చక్కటి కుటీరం లాంటి క్వార్టర్స్ లో తన తండ్రి బలరాం, తల్లి మానసలతో కలిసి ఉంటున్నాడు. బలరాం ఇండియన్ నేవీలో ఆఫీసర్. మానస పెద్ద కార్పోరేట్ కంపెనీలో మేనేజర్. బలరాం తండ్రి పరంధామం, తల్లి అరుందతి. హైదరాబాద్లో వారికి సొంతిల్లు ఉంది. తల్లిదండ్రులు లేని తన క్లాస్మేట్ మానసను ప్రేమించానని చెప్పగానే కొడుకు ఇష్టాన్ని కాదనలేక మానసతో పెళ్లి జరిపించారు. ఎవ్వరూ లేని […]

కాన్ఫిడెన్స్

రచన: మంజుల దేశ్ పాండే మా అమెరికా ప్రయాణం ఇంకా వారం రోజులే ఉంది. ఇంకా కొనాల్సినవి చాలా ఉన్నాయి. బిడ్డ అయితే.. అమ్మా నువ్వు అనవసరంగా అలసట చేసుకోకు. ఇక్కడ ఇండియన్ స్టోర్స్ చాలా ఉన్నాయి వాటిలో ప్రతి వస్తువు దొరుకుతుంది నువ్వేం హైరాణా పడకు, నీకు కావలసిన మెడిసిన్స్ మాత్రం మరిచి పోకుండా జాగ్రత్తగా తెచ్చుకో అంటూ పాఠాలు మొదలుపెట్టింది ! నా బిడ్డ ఎంత వద్దన్నా.. తల్లిని కదా, నా మనసు ఊరుకోదు […]

వారాల అబ్బాయి

రచన : తాతా కామేశ్వరి రామం స్నేహితులు రామం కోసం ఎదురుచూస్తూ ఎప్పుడు రామం కారు ఆగుతుందా? అని ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఆ హాలు ఆ ఊరిలో కల్లా పెద్ద హాలు. అందులో రామం రిటైర్మెంట్ ఫేర్వెల్ పార్టీ ఏర్పాటు చేసి, ప్రతి ఒక్కరూ నేను ముందు అంటే నేను ముందు అనేటట్టు తమ చేతులలో పూలగుచ్ఛం పట్టుకొని నిలబడ్డారు. ఆ జిల్లాకే కలెక్టర్ గా చేసి రిటైర్ అయిన రామం అతినిరాడంబరంగా ఉండి, ప్రతి ఒక్కరికి […]