May 31, 2023

మహిళలు – మారని గతులు

రచన: శ్రీ పేరి

బాలగా కన్న వారి మురిపెంను పొందినా
కుమారిగా కుర్రకారుకి హుషారు తెప్పించినా
చెలిగా చెలుని చేరి చెంగల్వల చెండుగా మురిసినా
భార్యగా బతుకు బాధ్యతలు మోసినా

గంటె తిప్పి శాకపాకాలకు చవులు తెచ్చినా
నెలతగా నెల తప్పి నెల బాలుడిని సాకినా
అమ్మగా లాలించి పాలిచ్చి పాలించినా
ముదితల్ నేర్వగారని విద్యలు లేవనిపించినా

అతివగా అంతరిక్షాన విజయబావుట ఎగురవేసినా
ధీర వనితగా కదన రంగాన కాలు దువ్వినా
ఇంతిగా ఇంట బయట కీర్తిని తెచ్చి పెట్టినా
ముదుసలిగా ఆఖరి శ్వాసన కూడా కుటుంబం కోసం ఆలోచించినా

ఆనాడు ఈనాడు ఏనాడైనా కాలాలు మారినా
రుతువులు మారుతూ రుతుచక్రంలో వున్నా
మహిళ పడతి కోమలి ఆడది పేర్లు వేరైనా
దశ దిశ మారదు, తల రాత చెరగదు

1 thought on “మహిళలు – మారని గతులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *