March 28, 2024

జీవనవేదం – 7

రచన: స్వాతీ శ్రీపాద “లాంగ్ వీకెండ్ వస్తోంది కదా, కిరణ్ ఎక్కడికి వెళ్దాం?” సోఫాలో అతన్ని ఆనుకుని కూచుని అడిగింది సుమ. “అవును, ఇంకా ఆలోచించనే లేదు.చెప్పు ఎక్కడికి వెళ్దాం.” ఎందుకో కాని అలా అడగ్గానే సిత గుర్తుకు వచ్చింది రవి కిరణ్ కు. చిన్నప్పటినుండీ ప్రతివాళ్ళూ రవి అని పిలవడమే కాని ఎవ్వరూ ఇలా కిరణ్ అని పిలవకపోడం కొత్తగా, బాగుంది అతనికి. “నువ్వే చెప్పాలి, రెండు మూడు రోజులు ఇద్దరమే ఒక ప్రపంచమై గడపాలి. […]

పరవశానికి పాత(ర) కథలు – రైలు తప్పిన దేవుడు

రచన: డా. వివేకానందమూర్తి   వాన్ వానలో తడుస్తోంది.  వానపాములా నడుస్తోంది.  సెలైన్ డ్రిప్ జ్ఞాపకానికొస్తోంది. ఎదురుగా అద్దం ఏడుస్తోంది.  వైపర్లు కన్నీటి చినుకుల్ని తుడుస్తూ ఓదారుస్తున్నాయ్. చీకటి గుయ్యారంగా వుంది.  చీల్చే ప్రయత్నం వొయ్యారంగా వుంది. అందంగా తూలుతోంది అటూ ఇటూ – తాగిన అప్సరసలా,  టాంకులో పెట్రోల్లో స్కాచి కల్తీ అయిందేమో అనుకొన్నాను.  కాలే సిగరెట్టు వెలుగుతో వాచీ చూసుకున్నాను.  కాలానికి మొహం వాచినట్టుంది.  సెకన్ల ముల్లు అర్జంటు పనున్నట్టు గబగబా తిరుగుతోంది. చీకటి […]

గోపమ్మ కథ – 6

రచన: గిరిజారాణి కలవల   నేను చెప్పినదేదీ పట్టించుకోకుండానే గోపమ్మ … తిరనాల అయిన పదిరోజులకే లక్ష్మి,  కోటిలకి లగ్గాలు పెట్టించేసింది.  ముందు నిశ్చయ తాంబూలాలకి వాళ్ళ భాషలో పప్పన్నాలు పెట్టుకోవడం.  అలా ఓ మంచి రోజు చూసుకుని,  రెండు కుటుంబాలతో పాటు బంధువులందరూ కలిసి  పెళ్ళి నిశ్చయం చేసుకున్నారు.  అదే పప్పన్నాలు పెట్టుకున్నారు.  పేరుకే పప్పన్నాలు… ఆరోజు కోడి పలావులు,  కల్లు ముంతలు ధారాళంగా కొనసాగాయని చెప్పింది గోపమ్మ. “ఎందుకు అలా అనవసరపు ఖర్చు గోపమ్మా? […]

అమ్మమ్మ – 44

రచన: గిరిజ పీసపాటి   కానీ, ఆరోజు మధ్యాహ్నం అవుతున్న కొద్దీ విపరీతమైన తలనొప్పితో పాటు వాంతులు కూడా అవసాగాయి గిరిజకి. ఇదివరకు తండ్రి ఉన్నప్పుడు కూడా అలా తరచూ జరుగుతూండడంతో డాక్టర్ కి చూపిస్తే, అది మైగ్రేన్ తలనొప్పి అని, తలనొప్పి వచ్చినప్పుడల్లా వాడమని టాబ్లెట్స్ ఇచ్చారు. కొద్దిగా మజ్జిగ అన్నం తిని టాబ్లెట్ వేసుకొని అరగంట ఆగి, తలనొప్పి ఇంకా తగ్గక ముందే గబగబా ఇంటర్వ్యూ కి వెళ్లడం కోసం తయారవసాగింది. ఇంతలో అమ్మమ్మ […]

లోపలి ఖాళీ – భరిణె

రచన: రామా చంద్రమౌళి   ఫిబ్రవరి 17, 2016 : బుధవారం. ప్రాతః సమయం 4.50 నిముషాలు. ఒక సందర్భాన్నీ, ఒక వస్తువునూ ఒక వ్యక్తి తన నేపథ్యంతో, తన దృష్టికోణంలో, తనకున్న జ్ఞానస్థాయిని బట్టి చూచినప్పుడు ఆ వస్తువు అతనికి కనబడినట్టే ఇంకొక వేరే ఎవరికైనా ఆ వస్తువు సరిగ్గా అదేవిధంగా కనబడుతుందా. ఉహూ.. అస్సలే కనబడదు. చూపూ, దృష్టీ.. రెండూ ఒకటేనా. చూచుట, దర్శించుట.. రెండూ ఒకటేనా. ఒక వస్తువు మనకు ఎలా కనబడ్తే […]

కంకణాలు – జొన్నరొట్టెలు

రచన: కవిత బేతి ‘ఇవాళ ఎలాగయినా అమ్మకి ఫోన్ చేసి మాట్లాడాల్సిందే…’ ‘ఈయన కూడా ఊర్లో లేరు, క్యాంపులో ఉండగా ఇలాంటి విషయాలు చెప్పినా సరిగా పట్టించుకోరు…’ ‘రేపటికిగానీ ఇంటికి రారు…’ ఆలోచిస్తూ నడుస్తుంది సరిత. ఇయర్ ఫోన్స్ పెట్టుకుని పాటలు వింటూ వాకింగ్ చేస్తుందన్నమాటే కానీ రాత్రి నుండి సరిత మనసు మనసులో లేదు. ముంబైలో ఉండే సరిత అక్క లలిత ముందునాటి రాత్రి ఫోన్ లో చెప్పిన విషయం విన్నప్పటినుండి అసహనంగా ఆలోచనలు సాగుతున్నాయి, […]

ఉనికి

రచన: మంథా భానుమతి సావిత్రికి ఎక్కడ చూసినా అందాలే కనిపిస్తున్నాయి. ఎప్పుడూ తనని విసిగించే ఎదురింటి బుల్లబ్బాయిగారి మనవడి అల్లరి ఆహ్లాదంగా. ఇంటి ముందున్న కాలువలో స్నానం చేసే పంది వరహావతారంలా.. ఆ రోజేం చేసిందో, ఎవరెవరితో తిరిగిందో ఆరా తీసే పక్కింటి అమ్మమ్మగారి ప్రశ్నలు జనరల్ నాలెడ్జ్ కి ఉపయోగపడేలా అనిపించాయి. ఆనందోత్సాహాలతో గాల్లో తేలిపోతున్నట్లు నడుస్తూ ఇంట్లో అడుగు పెట్టింది. ఎవరి పనులలో వాళ్లున్నారు. అయినా ఫరవాలేదు.. అలవాటే తనకి. సావిత్రి అక్క, సీత […]

ప్లీజ్ మైండ్ యువర్ బిజినెస్

రచన: శైలజ రాంషా Awkward : ఇబ్బందికరమైన, వికారమైన, వికృతమైన, చేతకాని – డిక్షనరీ అర్ధం. మనందరం ఎన్నో ఆక్వర్డ్ సిట్యుయేషన్స్ ఎదుర్కొంటుంటాం మన జీవితంలో. పని చేసే చోట, మనం ఉండే చోట! వీటిని ఎంత బాగా ఎదుర్కోగలిగితే అంత త్వరగా ఆ పరిస్థితిలో నుండి బయటపడతాము. రెండు రోజుల క్రితం, సార్థక్ ఫోన్, తను చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకొంటూ సోఫాలు డస్టింగ్ చేస్తూ ఆలోచిస్తూంది లత. ఇంతలో, ద్వారం దగ్గర ఎవరో వెలుగుకి […]

అలసిపోతున్న ఆనందం

రచన: విజయలక్ష్మి మూడు జనరేషన్స్ ను చూస్తున్న ఎనబై పదులు వయసులో మా చిన్నతనం, మా పెద్దవాళ్ళను, మా సంతానం ప్రస్తుత వారి పిల్లల జీవనశైలి గుర్తుచేసుకోవా లని పిస్తుంది. మేము ఆరుగురం, ఐదుమంది ఆడపిల్లలo. మాకు ఒక అన్న. ఊరు , ఉమ్మడి కుటుంబ వ్యవస్థకు దూరం కాకుండానే కొంత మార్పుతో హైదరాబాదులో ఉంటున్నాo కనుక, చదువులకని మా చిన్నాన్న పెద్దమ్మల పిల్లలు, మరొకిద్దరు మగపిల్లలుండేవారు. కాగా ఆడపిల్లలందరికి పొడవాటి వెంట్రుకలుండేవి. ఆ రోజుల్లో క్రాఫ్ […]

సుందరము – సుమధురము – వ్రేపల్లియ ఎద జల్లున

రచన:- నండూరి సుందరీ నాగమణి సుందరము సుమధురము ఈ గీతం: ‘సప్తపది’ చిత్రంలోని ‘వ్రేపల్లియ ఎద ఝల్లున పొంగిన రవళి’ అనే గీతాన్ని గురించి ఈ నెల వివరించాలని అనుకుంటున్నాను. జ్యోతి ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై, 1981లో విడుదల అయిన ఈ చిత్రానికి, కళాతపస్వి శ్రీ కె. విశ్వనాథ్ గారు దర్శకత్వం వహించారు. శ్రీ భీమవరపు బుచ్చిరెడ్డి గారు ఈ చిత్రనిర్మాత. నృత్యం ప్రధానాంశంగా సాగే ఈ చిత్రంలో కథకులు, దర్శకులు విశ్వనాథ్ గారు కులమత భేదాలను […]