April 19, 2024

మాలిక పత్రిక మే 2023 సంచికకు స్వాగతం

  స్వాగతం… సుస్వాగతం… మాలిక పాఠక, రచయిత మిత్రులందరికీ మండే మే నెల సంచికకు స్వాగతం. అయినా ఈ వేసవికాలం ఏంటో అస్సర్ధం కావట్లేదు. ఏప్రిల్ నెలలోనే వేడి పెరిగింది మే ఎలా కాల్చేస్తుందో అని అందరూ భయపడుతూంటే, ఆకాశం బద్ధలైనట్టు వానలు ఉరుములు, మెరుపులతో ముంచేస్తున్నాయి. ఏంటో ఈ చెడగొట్టు వానలు. ఇక ఇప్పుడు జరిగేది… జరుగుతున్నది… జరగబోయేది మామిడి , మల్లెల కాలం… మల్లెలు పెట్టుకున్నా, పెట్టుకోకపోయినా మామిడిపళ్లను మాత్రం మరువగలమా.. పచ్చి మామిడికాయలతో […]

జీవనవేదం – 9

రచన: స్వాతీ శ్రీపాద   ఇంట్లో మిగిలినది సీత, రవికిరణ్.  ఒక గది మిత్రుడిదే.  తనగదిలో తను ఉండటం ఎప్పుడైనా తనకు కావలసినది వండుకోడం తప్ప పెద్దగా వారిని డిస్టర్బ్ చేసే వాడు కాదు. సీత మరింత బిజీగా మారిపోయింది.  రవికిరణ్ ఒక్కడూ ఉంటాడని వంటావార్పులకు వెళ్ళడం తగ్గించుకుని ఇంట్లోనే వండి సరఫరా చేసేది.  కదిలినా మెదిలినా రవికిరణ్ ను కంటికి రెప్పలానే చూసుకుంది.  వారానికి రెండు రోజులు సంగీతం నేర్పడానికి వెళ్ళేది.  ఏ పని చేస్తున్నా […]

గోపమ్మ కథ… 8

రచన: గిరిజారాణి కలవల   గోపమ్మని అలాంటి పరిస్థితుల్లో చూసాక, ఎలా ఓదార్చాలో కూడా తెలీలేదు నాకు. “ఊరుకో! గోపమ్మా! వాడికి అంతవరకే రాసి పెట్టి వుంది. మన చేతుల్లో ఏముంది చెప్పు.” అన్నాను. “చేజేతులా చేసుకున్నాడమ్మగారూ! వాడి చావుని వాడే కొనితెచ్చుకున్నాడు. సంపాదించినదంతా… ఆ తాగుడికీ, చెడ్డ తిరుగుళ్ళకీ పెట్టి… నడి వయసులోనే చచ్చిపోయాడు. మా ఇళ్ళలో మగాళ్ళందరికీ ఇది మామూలే కదమ్మా! ఇలాంటి చావులు చస్తూనే వుంటారు. మా పీకల మీదకు తెస్తూనే వుంటారు.” […]

లోపలి ఖాళీ – సిద్ధయ్య మఠం

రచన: రామా చంద్రమౌళి     ఎర్రగా తెల్లారింది. మైసమ్మగండి ఊరు ఊరంతా ఇక ప్రేలబోతున్న అగ్నిపర్వతంలా నిశ్శబ్దంగా, గంభీరంగా, కుతకుత ఉడుకుతున్న లోపలి లావాలా ఉంది. ఊరి జనాబా రెండు వేలమందిలో ఏ ముసలీముతకనో విడిచిపెడ్తే.. ఆడా , మగా .. పిల్లా పాపతో సహా అందరూ మైసమ్మ గుట్ట చుట్టూ వరుసగా నిలబడి ఒక చుట్టు చుట్టి.. పాల సముద్రంలో మందరపర్వతం చుట్టూ తాడులా వాసుకి చుట్టుకున్నట్టు గుట్టను అలుముకుని నిలబడ్డరు.. ఎర్రటి ఎండలో.. […]

అమ్మమ్మ – 46

రచన: గిరిజ పీసపాటి     “ఆయన చెప్పాడు కానీ నాకు వీలు కాదు. మొత్తం డబ్బు కట్టండి. లేదా, వెంటనే ఇల్లు ఖాళీ చేసెయ్యండి” అన్నాడు తిరిగి. “ఇప్పటికిప్పుడు ఇల్లు దొరకాలి కదా అన్నయ్యగారు! ఇన్నాళ్ళు ఆగారు. ఈ ఒక్క నెల పిల్లల ముఖం చూసైనా దయచేసి ఆగండి. వచ్చే నెల మొత్తం ఇచ్చేస్తాను” అంది నాగ బతిమాలుతూ. “కుదరదు. వెంటనే ఖాళీ చెయ్యండి” అన్నాడు తిరిగి. అంతవరకు సహనంగా వీళ్ళ మాటలు వింటున్న అమ్మమ్మ […]

పరవశానికి పాత(ర) కథలు – ఊరకే రాకోయి అతిధీ!

రచన: డా. వివేకానందమూర్తి   రోజూలాగే నేను రాత్రి తొమ్మిదిన్నర ప్రాంతంలో యిల్లు చేరాను. రోజూ ఆ టైముకి పిల్లల్ని పడుకోబెట్టి, పెద్ద లైట్లన్నీ ఆర్పేసి మా శ్రీమతి నా కోసం ఎదురుచూస్తూ వుంటుంది. కానీ ఇవాళ మాత్రం ముందుగదిలో పెద్దలైటు ఇంకా వెలుగుతోంది. తలుపులు కూడా తెరచివున్నాయి. ఎవరా! అని ఆలోచిస్తూ గదిలోకి ప్రవేశించాను. గదిలో ఒక పక్క మంచం మిద దాదాపు నలభై అయిదేళ్ళ ఆసామి ఒకాయన గురక పెట్టి గాఢంగా నిద్రోతున్నాడు. నేను […]

అర్చన కనపడుటలేదు – 5

రచన: కర్లపాలెం హనుమంతరావు   వానలో తడుస్తూనే గేటు తెరిచి రోడ్డు మీదకు వచ్చి పరుగులాగా అందుకున్నాడు చిన్న కర్రపోటేసుకుంటూనే.  అంతకన్నా వేగంగా ఆటో ముందుకు వెళ్ళి పోయింది. వీధి చివరలో ఆగింది ఎందుకో ! ఇంట్లోని పోను గణగణ మోగింది.  పరుగెత్తుకుంటూ వెళ్లి ఫోను అందుకుంది కాంతమ్మగారు.  అర్చన గొంతు! ‘నిన్నూ, చిన్ననూ చూసాను ఇప్పుడే.  నా కోసం ఇక ఎదురుచూడద్దు.  చిన్నను బాగా చదివించు పిన్నీ! మంచి డాక్టర్ని చెయ్యి! బ్యాగులో మీ కోసం […]

పక్కవారిది పరమానందం

రచన:వేణి కొలిపాక ఇల్లంతా హడావిడిగా ఉంది. కమల అన్ని, ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుంటోంది. సోఫా కవర్లు మళ్ళీ సర్ది, ఫ్లవర్ వాసులు వాటి స్థానాల్లో పెట్టి!! సంగతి ఏమిటంటే వాళ్ళింట్లో ఈరోజు కిట్టి పార్టీ ఉంది. కమల లాయర్ గా మంచి పేరు తెచ్చుకుంది. ఆ విధంగా ఆమెకు వివిధ రంగాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్న ఆడవారు స్నేహితులయ్యారు.’ “వంట అయిపోయినట్టే కదా అత్తయ్య” అంటూ,  వంట పర్యవేక్షిస్తున్న అత్తగారిని అడిగింది..’ఆ..అంతా అయినట్టే,  ఇదిగో ఈ […]

రాతి మనసు

  రచన: యశస్వి జవ్వాది   చేతిలో ఉన్న సారా ప్యాకెట్‌ను మూలగా కొరికి నోట్లో పెట్టుకుని అరచేతితో గట్టిగా నొక్కాడు రంగడు.  నిషా మత్తు గొంతు నుండి బుర్రకెక్కగానే గుడారం నుండి బయటకు అడుగులు వేశాడు.  ఎండ గూబని తాకింది.  భుజం మీదున్న కండువా తీసుకుని నెత్తికి చుట్టుకుని,  రిక్షా దగ్గరకెళ్లాడు.  రిక్షా మీద చెక్కిన రుబ్బురోళ్ళు,  సనికలు రాళ్లు ఉన్నాయి.  వాటి పక్కనే గంట్లు పెట్టడానికి అవసరమయ్యే సుత్తి,  శానాలు వున్నాయి.  శానాలకు ఉన్న […]

బాల మాలిక – ప్రోత్సాహంతోనే విజయం..

రచన: భోగా  పురుషోత్తం   ‘‘నమస్తే అంకుల్‌!’’  గుమ్మం బయటి నుంచి అంది పక్కింటి ప్రియాంక తలెత్తి చూశాడు పరంధామయ్య. ప్రియాంక నవ్వుతూ నిల్చొని వుంది. ఆ అమ్మాయిని చూస్తే పరంధామయ్యకి చిరాకు. ‘‘రవి లేడా అంకుల్‌ ’’ ప్రశ్నించింది ప్రియాంక. ‘‘ఉన్నాడు’’ పుస్తకం కింద పెడుతూ అన్నాడు పరంధామయ్య. టీవీ ఆపేసి పక్కకి తిరిగి చూశాడు రవి. పరీక్ష రాయడానికి ఏదో ఒకటి చదవమని పుస్తకం వంక చూడబోయింది ప్రియాంక. హిస్టరీ పుస్తకం అందించాడు రవి. […]