May 19, 2024

ఓ మగువా …..

రచన: పి.రాధాకృష్ణ

కదిలే కాలపు లెక్కలలో
శూన్యపు ఆశల హెచ్చువేతలు,
విభజనకాని కలతల భాగాహారాలు
కుదిరించలేని బంధాల కూడికలు,
మరెన్నో మమతల తీసివేతలు

అన్నింటిలో…
ఎదురుపడని సంతోషాన్ని
నీలో నువ్వు వెతుక్కోవాలి
ప్రేమ గూడును అల్లుకోవాలి

కళ్ళ టేపుతో నీ చుట్టుకొలతలు కొలిచేస్తారు
ఎక్సరే చూపుతో నీ అంగాంగాల లోతుల్ని తాకేస్తారు
రంపపు మాటలతో నీ మనసు ముక్కలు చేసేస్తారు.

అన్నింటిలో…
తప్పుకు తిరిగే భద్రతను
నీకై నువ్వు వెతుక్కోవాలి
పట్టుకొమ్మను ఒడిసిపట్టాలి

ఋతుక్రమంలో రుతుస్రావం
గర్భస్థానాన ఉన్నది ఆడబిడ్డ అయితే గర్భస్రావం
పురిటిక్రమంలో రక్తస్రావం
అనారత హృదయాశృస్రావం

అన్నింటిలో…
దరికిరాని ఓదార్పును
నీకై నువ్వే వెలివేయాలి
స్వధైర్య కవచాన్ని ధరించాలి.

అందుకు
బలహీనతల బావి నుండి బయటపడి
నిన్ను నువ్వు ప్రేమించుకో…
నిన్ను నువ్వు గుర్తించుకో…
నీలో నిన్ను నువ్వు వెతుక్కో…
నీ సాటి మారో స్త్రీని సృష్టించుకో.

1 thought on “ఓ మగువా …..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *